Jump to content

వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 7

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తెలుగు వ్యంగ్య చిత్రకారుల మూస

[మార్చు]

శివ గారూ! మీరు రవిచంద్రగారి పేజీలో అడిగిన మూస తయారు చేసాను. మూస:తెలుగు వ్యంగ్య చిత్రకారులు చూడండి. అందులో ఇంకా చాలా విషయాలు చేర్చాలి, మీరు దాంట్లో ఇతర వివరాలు చేర్చడానికి ప్రయత్నించండి. మీకు కష్టంగా ఉంటే నా చర్చాపేజీలో ఏమేమి మార్పులు చేయాలో తెలపండి, నేను ప్రయత్నిస్తాను. δευ దేవా 21:29, 15 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేస్తున్న కృషిలో సహకరించగలిగినందుకు సంతోషిస్తున్నాను.δευ దేవా 17:57, 16 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శివ గారూ! ఆ వాక్యం ప్రతీ వ్యాసం క్రింద ఉంటుంది. ఒకసారి గమనించండి. అది వికీపీడియా పేజీ ఫార్మాట్, దానికి మూసకు ఏమీ సంబంధం లేదు. δευ దేవా 09:44, 18 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శివ గారు, మీ వ్యాఖ్య చూశాను. శంకరమంచి గారి విషయములో ఏమైనా ప్రగతి ఉన్నదా? ఇంతకు ముందు నా ఈ మెయిల్ ఐ.డి అడిగారు. ఎలా ఇవ్వాలి? వికీలో ఇవ్వడం నాకిష్ఠం లేదు.Kumarrao 16:22, 28 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలలో సమాచారం అమరిక

[మార్చు]

శివరామ ప్రసాదు గారూ కేవలం కార్టూన్లులలో సంతకాలు తప్ప మరేమీ తెలియని, వాటి వెనుక ఉన్న వ్యక్తుల గురించి అందరికీ పరిచయం చేస్తున్నందకు చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యాసంలా చక్కగా ప్రవహించినగలిగిన సమాచారాన్ని, పాయింట్లుగా తుంచేయకుండా ఒక వ్యాసంలా వ్రాస్తే చదవటానికి ఆహ్లాదంగానూ, సులువుగానూ ఉంటుంది. అలా వీలుకానీ సమాచారాన్ని అక్కడక్కడా పాయింట్లుగా వ్రాయవచ్చు కానీ అదే అన్నింటికీ అవలంబించవద్దని కోరుతున్నాను. --వైజాసత్య 05:07, 9 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కల్ప వృక్షం, కార్టూనులు

[మార్చు]

శివా!

  • తెలుగు కార్టూను రంగం వ్యాసం గురించి మీరు వ్రాసిన విషయం పరిశీలించి జవాబిస్తాను.
  • రామాయణ కల్పవృక్షం వ్యాసం ప్రారంభిస్తాను. నా దగ్గర ప్రస్తుతం రిఫరెన్సులు ఏవీ లేవు. కనుక నిదానంగా విస్తరించవచ్చును. {{తెలుగులో రామాయణ రచనలు}} అనే మూస కూడా దానితో అనుసంధిస్తాను.
  • కార్టూను బొమ్మల గురించి ఒక విషయం గమనించగలరు. ఇది నాకు తోచినది. - బహుశా వారు వికీపీడియాలో ఆ బొమ్మలు పెట్టుకోవడానికి అనుమతించి ఉండవచ్చును. వారు GFDL క్రింద వాడుకోవచ్చునని స్పష్టంగా చెబితే తప్ప, వాటిని GFDL బొమ్మలుగా ట్యాగ్ చేయడం ఉచితం కాదు. నేనుకొన్నది సరైతే ఆ బొమ్మల లైసెన్సులను non-free fair use గా మార్చవచ్చును. ఒకవేళ వారు ఉచితంగా వాడుకోడానికి ఒప్పుకొన్నా గాని కార్టూనులకు Creative commons లైసెన్సు మరింత మెరయగైనదవుతుంది.
  • గ్రామాల పేజీల వ్యాసాల గురించి కూడా మీతో కొంత చర్చించాల్సి ఉంది. తరువాత వ్రాస్తాను.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:25, 27 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

శివాగారికి, 2వ తెలుగు పతకం అందుకున్న శుభసందర్భంగా "శుభాకాంక్షలు". అహ్మద్ నిసార్ 08:48, 7 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లింకులు చూండండి

[మార్చు]

శివా! చందమామ పాత పుస్తకాల గురించి ఈ లింకులు చూడగలరు. (ఇంతకుముందే చూసి ఉండకపోతే) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:18, 28 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


http://blogaagni.blogspot.com/2008/12/wwwuliborg.html


http://chandamaamalu.blogspot.com/

సభ్యత గురించి

[మార్చు]

ఆవతలి వ్యక్తిని నువ్వు, నీవు, అని సంబోధిస్తున్న మీకు ఉన్న సభ్యత ఎంతో బాగానే తెలుస్తున్నది.

నేను నా చర్చా పేజీలో మీరు చేసిన వ్యాఖ్యను తొలగిస్తే మీరు ఇంత బాధపడవలసిన అవసరం ఏమిటి?? మీరేదో హెడ్మాస్టరు అయినట్ట్లు, ఇతరులంతా ఏదో ఒకటో క్లాసు పిల్లలు అయినట్లు ప్రవర్తించకండి. తరువాత ఈ వారం బొమ్మ గురించి: నేను ఒక బొమ్మను ఉంచానే అనుకోండి, అక్కడ ఆ పేజీలో ఉన్న నియమాలలో మీరు చెప్పిన విషయాలు ఏమీ లేవు.మీరు చెప్పిన నియమాలన్నీ కూడ ఆ పేజీలో ఉంచండి, అప్పుడు మాలాంటి వారు చూసి దానికణుగుణంగా మసులుకుంటాము. మీరు మీ నిర్వాహక హోదాలో తీసెయ్యదలుచుకుంటే తీసెయ్యండి. నా చర్చా పేజీలో వ్యాఖ్యలు చెయ్యాల్సిన అవసరం లేదు. మాకు కూడ అంతో, ఇంతో, కొంత, తెలుసును. మీ అంత కాకపోవచ్చును. మీ వ్యాఖ్యలు నాకు చాలా బాధ కలిగించినాయి. ఎంతో అరుదయిన ఫొటోను నేను ఈ వారం బొమ్మగా ఊంచటానికి ప్రతిపాదిస్తే ఇంత అల్లరా?? అది కూడ ఒక నిర్వాహకునివల్లనా?

నేను మళ్ళి మళ్ళి ఈ విషయంలో చర్చించను. ప్రస్తుతానికి నాకు బెంగుళూరు బదిలీ అయినందువల్లన కొంత dislocate అయ్యి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడ ఇంకా ఏర్పడలేదు.ఇంతటితో ఈ విషయం ముగించండి. దయచేసి, చురుకుగా పనిచేస్తున్న సభ్యులను నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చెయ్యటం ఇకనైనా మానుకోండి. శలవు.నమస్కారం.--S I V A 08:55, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివగారూ, మీ దిద్దుబాట్ల మీద చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ రచనలను విమర్శించటానికి, మిమ్మల్ని విమర్శించటానికి చాలా తేడా ఉందని మీలాంటి పెద్దలకు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. నేను వచ్చిన కొత్తలో చాలా ఉత్సాహంతో పేజీల సంఖ్య పెంచడానికి ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో అతికించాను. అప్పుడు ఒక ఆకాశరామన్న నన్ను ఇక్కడ మందలించారు చూడండి. అప్పుడో వికీలో ఏదో ఒకటి వ్రాస్తున్నది నేను ఒక్కన్నే. "వ్రాసేది లేదుగానీ, నేనోదే చేస్తుంటే ఎంత ధైర్యం నన్ను విమర్శించడానికి" అని ఉక్రోషం వచ్చింది కూడా. కాస్త నెమ్మదించి ఆలోచిస్తే ఆయన/ఆమె అన్నది నిజమే కదా అనిపించింది. --వైజాసత్య 01:33, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

శివ స్పందన

[మార్చు]

ఛంద్రకాతరావుగారూ! మీరు ఇచ్చిన సుదీర్ఘ సమాధానం ఆసక్తిగా చదివాను. సభ్యత వంటి పెద్ద పెద్ద మాటలు వాడేసరికి నేను స్పందించవలసి వచ్చింది. మీరు మీ వ్యాఖ్యలను బొమ్మ తొలగిస్తూ, ఆ బొమ్మ చర్చా పేజీలోనే వ్రాసి ఉంటే సరిపొయ్యేది అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా, నేనుకూడ ఈ చర్చను పొడిగించదలుచుకోలేదని ఇంతకుముందే చెప్పాను కదా, అందుకని ఇక ఈ విషయం వదిలేద్దాం, మళ్ళీ మన కృషి ఎప్పటిలాగ కొనసాగిద్దాం. వచ్చే వారంలో నాకు ఇంటర్‌నెట్ కనెక్షన్ రావచ్చును, మళ్ళీ రచన / దిద్దుబాట్లు కొనసాగించవచ్చనే అనుకుంటున్నాను.

ఇక చర్చాపేజీలో వ్రాయటం పుట మొదట్లోనా, చివరలోనా అన్న విషయం మీద: నేను పుట మొదట్లోనే ఎందుకు వ్రాస్తానంటే, సంబంధిత సభ్యుడు పుట తెరువగానే, వ్యాఖ్య కనబడి సౌకర్యంగా ఉంటుంది. ఇది నాపద్ధతి. అలా కాదు చివరనే వ్రాస్తే బాగుంటుంది అనె మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. మనం ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశ్యం. --S I V A 09:53, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]