వాన్‌లావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వాన్‌లావ్‌
వాన్‌లావ్‌
జననంవాన్‌లావ్‌
1879 అక్టోబర్‌ 9
ఇతర పేర్లువాన్‌లావ్‌

వాన్‌లావ్‌ మాలిక్యులర్ బయాలజీ పరిశోధకుడు. ఆవిష్కర్త. ఈయన స్ఫటికాల నిర్మాణాన్ని శోధించినవాడు- ఇప్పటి ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ రంగాల్లో ట్రాన్సిస్టర్లు, ఎల్‌సీడీ సాంకేతికతల వల్ల వస్తున్న అధునాతన పరికరాల సందడి చెప్పక్కర్లేదు. వీటి అభివృద్ధికి నాంది పలికిన పరిశోధన చేసిన శాస్త్రవేత్త.

స్పటికాల అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుందో కనుగొని, తద్వారా సరికొత్త సాంకేతిక విప్లవానికి దోహదపడిన శాస్త్రవేత్తగా జర్మనీకి చెందిన వాన్‌లావ్‌ పేరు పొందాడు. కంటికి కనబడని, ఏ పరికరానికీ అందుబాటులో లేని స్ఫటికాల అంతర్భాగంలో ఉండే పరమాణువుల అమరికను ఎక్స్‌రేల వివర్తనం ద్వారా అవలోకించిన ఈయనకు 1914లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం లభించింది .

స్ఫటికాల్లో (క్రిస్టల్స్‌) కొన్ని పరిపూర్ణమైనవైతే, మరికొన్ని అసంపూర్ణమైనవి ఉంటాయి. పరిపూర్ణ స్ఫటికాల్లో పరమాణువుల అమరిక కచ్చితంగా క్రమపద్ధతిలో ఉంటుంది. అసంపూర్ణ స్ఫటికాల్లో అలా ఉండకపోయినా, ఇవే పరిశోధనలకు అనువైనవి. ఈ కారణంగా పరిపూర్ణ స్ఫటికాలలోని పరమాణువులను వాటి స్థానాల నుంచి తప్పించి వేరే మూలకపు పరమాణువులను చొప్పిస్తారు. దీన్నే 'డోపింగ్‌' అంటారు. ఈ ప్రక్రియ వల్లనే ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల ఆవిష్కరణకు నాంది ఏర్పడింది. ఇలా అర్థవాహకాలైన (semi conductors) జెర్మానియం, సిలికాన్‌ స్ఫటికాలను వాహకాలుగా మార్చడం వల్ల ట్రాన్సిస్టర్లు, ఎల్‌సీడీ (లిక్విడ్‌ క్రిస్టల్‌ డిస్‌ప్లే) వంటి సాంకేతిక పరికరాలను కనుగొనగలిగారు.

జర్మనీలో 1879 అక్టోబర్‌ 9న పుట్టిన మాక్స్‌ థియోడర్‌ ఫెలిక్స్‌ వాన్‌లావ్‌ స్కూలు విద్య అనంతరం అప్పటి నిబంధనల ప్రకారం ఏడాది పాటు సైనిక శిక్షణ పొందాడు. ఆపై వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య చదివి 24 ఏళ్లకే పీహెచ్‌డీ సాధించాడు. తర్వాత బెర్లిన్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా 24 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించాడు. ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో పరిచయం స్నేహంగా మారిన నేపథ్యంలో ఆయన సాపేక్ష సిద్ధాంతంపై కూడా వాన్‌లావ్‌ పరిశోధన చేశాడు. ఇంకా ఆప్టిక్స్‌, క్వాంటం సిద్ధాంతం, అతివాహకత, క్రిస్టలోగ్రఫీల్లో అతడి సిద్ధాంతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో శాస్త్ర పరిశోధన రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన పరిశోధనలు 'మాలిక్యులర్‌ బయాలజీ' అనే నూతన శాస్త్ర ఆవిర్భావానికి దోహద పడ్డాయి.

వావ్‌లావ్‌కు మోటార్‌ డ్రైవింగ్‌, పర్వతారోహణం, నౌకాయనం, సంగీతాలపై కూడా పట్టు ఉంది. ఆయన రచించిన 'హిస్టరీ ఆఫ్‌ ఫిజిక్స్‌' పుస్తకం ఏడు భాషల్లోకి అనువాదమై ప్రాచుర్యం పొందింది.

మూలాలు

[మార్చు]
  • ప్రొ||ఈ.వి. సుబ్బారావు గారి రచనలు