Jump to content

వామన గుంటలు

వికీపీడియా నుండి
(వాన గుంటలు నుండి దారిమార్పు చెందింది)


ఆధునిక వామన గుంటల పీట

చరిత్ర

[మార్చు]

వామన గుంటలు పాత కాలపు ఆట. సుమారు 1950 తరువాత క్రమేపీ మరుగున పడిపోయింది. దీనినే వాన గుంటలు, ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు. సీతామ్మవారు వామనగుంటలు ఆడినట్లు ఎక్కడో ఒక జానపద గీతంలో విన్నానంటూ శ్రీ అక్కిరాజు రమాపతిరావు అన్నారు. త్యాగరాజు ఒక కీర్తనలో ఓమనగుంటలు అన్న పదం ఉపయోగించాడు.

వామన గుంటలు ని "పీట ఆట" (board game) గా వర్గీకరించవచ్చు. (అష్టా-చెమ్మా, పులి-మేక, పచ్చీస్ పాళీ, వైకుంఠ పాళీ, చదరంగం, వగైరాలు కూడా పీట ఆటల జాతికి చెందినవే.) ఈ ఆట ఆడడానికి సాధారణంగా కొయ్యతో తయారు చేసిన, పొడుగాటి, దీర్ఘచతురపు పెట్టె ఆకారంలో ఉన్న పీటని వాడతారు. ఈ పెట్టెని తెరచి నేల మీద పెడితే (బొమ్మని చూడండి) ఇటూ, అటూ, రెండు వరుసలలో, ఏడేసి గుంటలు (లేదా డిబ్బీలు) చొప్పున మొత్తం పద్నాలుగు గుంటలు కనిపిస్తాయి. ఒక పక్కని ఉన్న 7 గుంటలు ఒక ఆడగత్తెవి, రెండవ పక్కన ఉన్న 7 గుంటలు ప్రత్యర్థివి అన్నమాట. ఈ పెట్టెకి ఈ చివరా, ఆ చివరా ఒక పెద్ద గుంట ఉంటుంది. వీటిని కాసీ గుంటలు అంటారు. ఈ ఆటని అమ్మాయిలు ఎక్కువగా ఆడతారు.

ఈ ఆట ఆడాలనిపించినప్పుడు పీట వెంటనే అందుబాటులో లేకుంటే నేల మీద, బండ మీద మరి ఏదేని సమతలంపై గుంటలను అనుకరిస్తూ వృత్తాలు గీసి వాటితో ఆడవచ్చు.

ఒక్కొక్క గుంటలో ప్రారంభంలో ఐదేసి (ఐదే వాడాలని నిబంధన ఏదీ లేదు. 15 గింజలతో ఆడే ఆటలు కూడ ఉన్నాయి) చింత గింజలు కానీ, సీతాఫలం గింజలు కానీ, చిన్న చిన్న గులకరాళ్లు కానీ ఉంచుతారు. ఇవేవీ దొరక్కపోతే శనగలు కాని బటానీలు కాని వాడడం పరిపాటే.

పంచడం

[మార్చు]

సాధారణంగా ఇద్దరు ఆడే ఈ ఆటలో పీట యొక్క ఒక అర్ధ భాగములోని 7 గుంటలు ఒకరికి చెందుతాయి. మిగిలిన అర్ధభాగములోని గుంటలు ఎదుటి వారికి చెందుతాయి. కాసీ గుంటలు ఉమ్మడి గుంటలు. ఆట ప్రారంభంలో ఒక ఆటగత్తె ఒక గుంటలోని గింజలని మొత్తం తీసుకొని ఖాళీ చేసిన గుంటకు కుడివైపు గుంటతో ప్రారంభించి వరుసగా ఒక్కొక్క గుంటకు ఒక గింజ చొప్పున పంచడం ప్రారంభిస్తుంది. చేతిలోని గింజలన్నీ అయిపోతే ఆ తరువాత గుంట (ఈ గుంట ఎవరిదైనా కావచ్చు) లోని రాళ్లను తీసి పంచడం కొనసాగిస్తారు. ఇలా చేతిలోని గింజలన్నీ అయిపోయి ఆ తరువాత గుంట పంచడానికి వీలులేకుండా ఖాళీ గుంట వచ్చే వరకు ఒకే వ్యక్తి పంచుతూ ఉంటుంది.

పంచడానికి 3 ఉన్నాయి 1 0 2 4
పంచక ముందు.
ఈ కుప్ప ఖాలీ అయ్యింది 1 నుండి 2 అయ్యాయి ఖాళీగా ఉన్న దీన్లో ఒకటి చేరింది 2 నుండి 3 అయ్యాయి ఇప్పుడూ నాలుగే ఉన్నాయి
పంచిన తర్వాత.

అలా చేతిలోని గింజలన్నీ అయిపోయి ఆ తరువాత ఖాళీ గుంట తటస్థ పడితే ఆ ఖాళీ గుంట తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకుని గుంటలో నుండి తీసుకొని పక్కన పెట్టుకుంటుంది. ఖాళీ గుంట తటస్థపడి దాని తరువాత గుంట కూడా ఖాళీగా ఉంటే మీ తడవు ముగుస్తుంది కానీ గింజలు మాత్రం ఏమీ గెలుచుకోరు. ఆ తరువాత ఎదుటి ఆటగానికి పంచే తరుణం వస్తుంది. పంచడం ప్రారంభం మాత్రం మన అర్ధభాగములోని గుంటలతోనే ప్రారంభించాలి. ఆట చివరి దశలలో ఒక ఆటగానికి పంచే తరుణం వచ్చినా పంచడం ప్రారంభించడానికి తన అర్ధ భాగములోని గుంటలన్నీ ఖాళీగా ఉంటే పంచలేడు. ఇక పంచే అవకాశము తిరిగి ఎదుటి వ్యక్తికి ఇవ్వవలసిందే.

వరుసగా పంచేటప్పుడు ఒక గుంటలో పంచకుండా దాటెయ్యడము, వ్యతిరేక దిశలో పంచడము నిషిద్దము. ఒక వ్యక్తి పంచుతుంటే అవతలి వ్యక్తి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు.

ఇలా ఒకరి తర్వాత ఒకరు పీటలోని గుంటలన్నీ ఖాళీ అయ్యేదాకా ఆడతారు. చివరలో ఎవరెన్ని గింజలను గెలుచుకున్నారో లెక్కపెడతారు. అత్యధిక గింజలు గెలుచ్కున్నవారే విజేతలు.

రకరకాలు

[మార్చు]
దొంగా పోలీసు

ఇందులో ఒక గుంట నుండి అన్ని గింజలు తీసి పక్క గుంటలో వేయాలి. మళ్ళీ పక్క గుంట నుండి తీసి ఆ పక్క గుంటలో వేయాలి.అలా ఖాళీ గుంట రాగానే తట్టి పక్క గుంటలోని గింజలన్నీ తీసుకోడమే

అత్తా కోడల్లాట

ఎదన్నా గుంట నుండి మొదలు పెట్టి మూల నున్న గుంట ఖాళీగ ఉండి మన చేతిలొ ఒకె గింజ ఉంటే అది ఆ గుంటలో వేయకుండా గుంట పైన పెట్టి అది తమ ఇల్లు అంటారు.అందులో ఎన్ని గింజలు పడితే అన్ని వారివే. వేరేవాళ్ళు అందులో గింజలు వేయకూడదు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]