Jump to content

వారుణాస్త్ర (టార్పెడో)

వికీపీడియా నుండి
వారుణాస్త్ర
రకంహెవీ టార్పెడో
అభివృద్ధి చేసిన దేశంభారతదేశం
సర్వీసు చరిత్ర
సర్వీసులో2016 జూన్ 29[1]
వాడేవారుభారత నౌకాదళం
ఉత్పత్తి చరిత్ర
డిజైనరునేవల్ సైన్స్ అండ్ టెక్నొలాజికల్ లేబొరేటరీ, DRDO
తయారీదారుభారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఒక్కొక్కదాని వెలమూస:INRconvert - మూస:INRconvert[2]
తయారు చేసిన సంఖ్యతెలియరాలేదు (73 అని తలపెట్టారు)[3]
విశిష్టతలు
బరువు1,500 కి.గ్రా. (3,300 పౌ.)[4]
పొడవు7 నుండి 8 మీటర్లు (23 నుండి 26 అ.)
వ్యాసం533 mమీ. (21.0 అం.)

వార్‌హెడ్high explosive
వార్‌హెడ్ బరువు250 కి.గ్రా. (550 పౌ.)[5]

ఇంజనువిద్యుత్
ఆపరేషను
పరిధి
40 కి.మీ. (25 మై.)[5]
గరిష్ఠ లోతు400 మీటర్లు (1,300 అ.)[5]
వేగం40 knots (74 km/h; 46 mph)[5]
గైడెన్స్
వ్యవస్థ
wire-guided, active-passive acoustic homing
లాంచి
ప్లాట్‌ఫారం

వారుణాస్త్ర భారత్ అబివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పెడో. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన నేవల్ సైన్స్ అండ్  టెక్నొలాజికల్  లేబొరేటరీ ఈ హెవీవెయిట్ టార్పెడోను అభివృద్ధి చేసింది.

ఓడనుండి ప్రయోగించే రకపు వారుణాస్త్రను 2016 జూన్ 26 న భారత నౌకాదళంలో చేర్చుకున్నారు.[7] ఈ టార్పెడోను వియత్నామ్ వంటి మిత్రదేశాలకు ఎగుంతి చేస్తామని ఆ సందర్భంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ చెప్పాడు.[8] కొన్ని మార్పులతో జలాంతర్గామి నుండి ప్రయోగించే రకాన్ని త్వరలో ప్రయోగించనున్నారు.[9][10] నౌకాదళ అవసరాల కోసం 73 టార్పెడోలను తయారుచెయ్యనున్నారు.[11]

రూపకల్పన

[మార్చు]

ఈ టార్పెడోకు విద్యుత్ చోదక శక్తిని సమకూర్చారు. 250 కిలోవాట్ల సిల్వర్ ఆక్సైడ్+జింకు బ్యాటరీలు అవసరమైన విద్యుత్తును అందిస్తాయి.[12] 1.25 టన్నుల బరువున్న ఈ టార్పెడో, 250 కిలోల వార్‌హెడ్‌ను మోసుకుని 74 కి.మీ./సె వేగంతో ప్రయాణిస్తుంది. 95 శాతం దేశీయ వస్తువులతో దీన్ని తయారుచేసారు. కన్ఫర్మల్ ఎర్రే ట్రాన్స్‌డ్యూసరు  సాయంతో వారుణాస్త్ర ఇతర టార్పెడోల కంటే విస్తృతమైన కోణంలో చూడగలదు. జిపిఎస్-ఆధారిత మార్గదర్శకత్వం కలిగిన టార్పెడో ప్రపంచంలో ఇదొక్కటే.[13]

అభివృద్ధి

[మార్చు]

వారుణాస్త్రను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది.

భవిష్యత్తు

[మార్చు]

కిలో తరగతి జలాంతర్గాముల నుండి ప్రయోగించగల వారుణాస్త్రను డిఆర్‌డివో అభివృద్ధి చేస్తోందని 2017 ఏరో ఇండియాలో వార్తలు వెలువడ్డాయి.[14][15]

వినియోగదారులు

[మార్చు]
  •  భారతదేశం - కోల్‌కతా తరగతి డిస్ట్రాయరు -రాజ్‌పుత్ తరగతి డిస్ట్రాయరు, ఢిల్లీ తరగతి డిస్ట్రాయరు, కమోర్తా తరగతి కార్వెట్, తల్వార్ తరగతి ఫ్రిగేట్, జలాంతర్గామి విధ్వంసక ఓడలు.[16]

ఎగుమతి

[మార్చు]
  • వియత్నామ్- వారుణాస్త్రను వియత్నామ్‌కు అమ్మేందుకు భారత్ ముందుకొచ్చింది.[17]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Weapon of Water: India gets its first indigenous torpedo, Varunastra". NewsX. 29 June 2016. Archived from the original on 30 జూన్ 2016. Retrieved 30 June 2016.
  2. "Varunastra joins the Navy 9 things you must know". news. Rediff News. 30 June 2016. Retrieved 1 July 2016. {{cite web}}: Cite has empty unknown parameter: |authors= (help)
  3. "Varunastra missile handed over to Indian navy". Retrieved 2016-06-30.
  4. "Varunastra to undergo evaluation trials soon". The Hindu. 1 March 2014. Retrieved 30 June 2016.
  5. 5.0 5.1 5.2 5.3 "The DRDO's triad of laboratories supply the Indian Navy with high-potential weapons systems". frontline.in. 23 March 2014. Retrieved 30 June 2016.
  6. http://indiatoday.intoday.in/story/varunastra-drdo-defence-research-and-development-organisation-torpedo-submarines-mtcr-lca-tejas/1/883780.html
  7. "Anti-submarine torpedo Varunastra inducted in Navy". 2016-06-29. Retrieved 2016-06-30.
  8. "India joins elite group of eight with anti-submarine Varunastra in arsenal". Archived from the original on 2016-09-06. Retrieved 2016-06-30.
  9. "Indian Navy inducts indigenous heavyweight torpedo Varunastra". Retrieved 2016-06-30.
  10. "Indian Navy inducts indigenous heavyweight torpedo 'Varunastra' - The Economic Times". Archived from the original on 2016-11-29. Retrieved 2016-06-30.
  11. "Varunastra missile handed over to Indian navy". Retrieved 2016-06-30.
  12. "Indian Navy's most powerful ships rely on DRDO technology". indiastrategic.in. Archived from the original on 16 జూలై 2016. Retrieved 30 June 2016.
  13. "V5 things to know about the lethal DRDO torpedo for Indian Navy". news. The Financial Express. 30 June 2016. Retrieved 6 July 2016. {{cite web}}: Cite uses deprecated parameter |authors= (help)CS1 maint: Uses authors parameter
  14. "India to fire self-made torpedo VARUNASTRA from our submarines, says DRDO". Retrieved 2017-02-20.
  15. "India To Test Fire Home-Made Torpedo From Russian EKM Class Submarine". www.defenseworld.net. Archived from the original on 2017-02-20. Retrieved 2017-02-20.
  16. "Hon'ble RM hands over Varunastra to Indian Navy | Indian Navy". www.indiannavy.nic.in. Retrieved 2016-06-30.
  17. "Eye on China, Delhi offers heavy torpedoes to Vietnam". The Times of India. 3 July 2016. Retrieved 3 July 2016.