Jump to content

వార్తల వెనుక కథ

వికీపీడియా నుండి
వార్తల వెనుక కథ
"వార్తల వెనుక కథ" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: పలువురు పత్రికా సంపాదకులు, పాత్రికేయులు
సంపాదకులు: కె.రామచంద్రమూర్తి, కట్టా శేఖరరెడ్డి
ముద్రణల సంఖ్య: 2
ముఖచిత్ర కళాకారుడు: రఘు మోతే, కెవిఆర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): ఆత్మకథాత్మకం
ప్రచురణ: న్యూ మీడియా కమ్యూనికేషన్స్
విడుదల: మార్చి 2007
పేజీలు: 373

వార్తల వెనుక కథ పుస్తకం ప్రముఖ పత్రికా సంపాదకులు, పాత్రికేయులు తమ వృత్తిజీవితంలో ఎదురైన విశేషాలు మలచిన వ్యాసాల సంకలనం. సంకలనానికి కె.రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి సంపాదకులుగా వ్యవహరించారు. మొత్తం 44మంది పాత్రికేయులు, సంపాదకులు రచించిన వ్యాసాలు ఈ సంకలనంలో చోటుచేసుకుంది.

రచన నేపథ్యం

[మార్చు]

న్యూ మీడియా కమ్యూనికేషన్స్ సంస్థ ప్రచురించిన ఈ గ్రంథం మార్చి 2007లో తొలి ముద్రణ పొందింది. సాహిత్యంలో విలేకరులు వార్తాసేకరణలోనూ, సేకరించిన వార్తను ప్రజలకు అందించడంలోనూ, ఆపై పత్రికల్లో ప్రచురణ అయ్యాకా వచ్చే ప్రతిస్పందనలోనూ ఉండే విషయాలను గ్రంథస్థం చేయడం ఉన్నదే. ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ తమ విలేకరులు వార్తాల సేకరణ మొదలుకుని వివిధ సందర్భాల్లో పొందే అనుభవాలను గ్రంథస్థం చేయించి వర్కింగ్ ప్రెస్ పేరిట ప్రచురించింది. అయితే తెలుగులో మాత్రం జర్నలిస్టుల వృత్తిపరమైన అనుభవాలు అంతగా రాలేదు. ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎం.నాగేశ్వరరావు జర్నలిస్టు కరదీపిక గ్రంథం ఆవిష్కరణ సందర్భంగా తెలుగులో యువ పాత్రికేయులకు ఉపయోగపడే శిక్షణ మాన్యువల్స్ ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని చేసిన సూచనే ఈ పుస్తకానికి నాంది పలికిందని సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కొందరు పాత్రికేయులతో కొత్తగా వ్యాసాలు రాయించి, మరికొందరి వ్యాసాలు తెలుగులోకి అనువదించి పుస్తకాన్ని రూపొందించారు.

రచయితలు

[మార్చు]

ఈ పుస్తకం కోసం పత్రికారంగంలో అనుభవమున్న పలువురు పాత్రికేయులు, సంపాదకులు కొన్ని వార్తల రచనలో పొందిన అనుభవాలను వ్యాసాలుగా రాశారు. ఆ రచయితల జాబితా ఇది:

మూలాలు

[మార్చు]