వాలర్ బ్రిడ్జ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫోబ్ వాలర్ బ్రిడ్జ్
2023లో వాలర్ బ్రిడ్జ్
జననం
ఫోబ్ మేరీ వాలర్-బ్రిడ్జ్

(1985-07-14) 1985 జూలై 14 (వయసు 38)
హామర్స్మిత్, లండన్, ఇంగ్లాండ్
విద్యాసంస్థరాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్
వృత్తి
  • నటి
  • స్క్రీన్ రైటర్
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామికోనర్ వుడ్‌మాన్
(m. 2014; sep. 2017)
భాగస్వామిమార్టిన్ మెక్‌డొనాగ్ (2017–ప్రస్తుతం)
బంధువులుఇసోబెల్ వాలర్ బ్రిడ్జ్ (సోదరి)

ఫోబ్ మేరీ వాలర్ బ్రిడ్జ్ (ఆగ్లం: Phoebe Mary Waller-Bridge; 1985 జూలై 14) ఆంగ్ల నటి, స్క్రీన్ రైటర్, నిర్మాత. ఫ్లీబాగ్ (2016–2019) అనే హాస్య ధారావాహిక సృష్టికర్తగా, ప్రధాన రచయితగా, స్టార్‌గా, ఆమె మూడు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ అవార్డులను గెలుచుకుంది.[1][2] కిల్లింగ్ ఈవ్ (2018–2022) అనే స్పై థ్రిల్లర్ సిరీస్‌కు కథ అందించి, నిర్మించినందుకు ఆమె మరిన్ని ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌లను అందుకుంది.[3]

క్రాషింగ్ (2016) అనే హాస్య ధారావాహికను ఆమె రూపొందించింది. దీనికి కథా రచనతో పాటు ఆమె నటించింది. ఆమె కామెడీ సిరీస్ ది కేఫ్ (2011–2013), బ్రాడ్‌చర్చ్ (2015) రెండవ సీజన్‌లో, ఆల్బర్ట్ నోబ్స్ (2011), ది ఐరన్ లేడీ (2011), గుడ్‌బై క్రిస్టోఫర్ రాబిన్ (2017), సోలో: ఎ స్టార్ వార్స్ స్టోరీ (2018) చిత్రాలలో కూడా నటించింది.

ఆమె జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై (2021) స్క్రీన్‌ప్లేకు సహకరించింది. అడ్వెంచర్ ఫిల్మ్ ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (2023)లో కూడా ఆమె నటించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె 1985 జూలై 14న లండన్‌లోని హామర్స్‌మిత్‌లో జన్మించింది,[4][5] ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ట్రేడ్‌పాయింట్ వ్యవస్థాపకుడు మైఖేల్ సిప్రియన్ వాలర్ బ్రిడ్జ్, 12వ బారోనెట్, సర్ జాన్ ఎడ్వర్డ్ లాంగ్విల్లే క్లర్క్ కుమార్తె థెరిసా మేరీ దంపతుల కుమార్తె ఆమె.[6][7][8]

ఆమెకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు: ఒక అక్క, ఐసోబెల్ వాలర్ బ్రిడ్జ్, స్వరకర్త, ఒక తమ్ముడు, జాస్పర్.[9] వారి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.[10] ఆమె సెయింట్ అగస్టిన్ ప్రియరీ, క్యాథలిక్ ఇండిపెండెంట్ స్కూల్‌లలో చదువుకుంది,[11] ఆ తర్వాత డిఎల్డీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో చదువుకుంది.[12] ఆమె రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి డిగ్రీ పట్టా పుచ్చుకుంది.[13]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వాలర్ బ్రిడ్జ్ వాళ్లది లండన్‌లోని షోరెడిచ్ ప్రాంతం. ఆమె 2014లో ఐరిష్ ప్రెజెంటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కోనార్ వుడ్‌మాన్‌ని వివాహం చేసుకుంది.[14] 2017లో వారు విడిపోయి విడాకుల కోసం దాఖలు చేశారు. 2018 ప్రారంభం నుండి, ఆమె నాటక రచయిత మార్టిన్ మెక్‌డొనాగ్‌తో సంబంధం కలిగి ఉంది.[15] తాను నాస్తికురాలినని ఆమె ప్రకటించుకుంది.[16]

మూలాలు[మార్చు]

  1. Turchiano, Danielle (23 September 2019). "Emmys Surprise: Phoebe Waller-Bridge Wins Lead Actress in a Comedy". Variety. Retrieved 23 September 2019.
  2. Horton, Adrian (6 January 2020). "The full list of Golden Globes 2020 winners". The Guardian. ISSN 0261-3077. Retrieved 7 January 2020.
  3. Waller-Bridge, Phoebe (2013-09-05). "Fleabag". Fleabag. doi:10.5040/9781784601942.00000002.
  4. "Phoebe Waller-Bridge". Empire. Retrieved 30 November 2019.
  5. "Index entry". FreeBMD. ONS. Retrieved 1 June 2022.
  6. Burke's Peerage, Knightage and Baronetage. Vol. 1 (107th ed.). Burke's Peerage Limited. 1 December 2003. p. 819. ISBN 978-0971196629.
  7. Hattenstone, Simon (8 September 2018). "Phoebe Waller-Bridge: 'I have an appetite for transgressive women'". The Guardian. Retrieved 28 April 2019.
  8. "Engagements: Mr C. T. P. Woodman and Ms P. M. Waller-Bridge". The Daily Telegraph. 18 January 2014. Archived from the original on 27 సెప్టెంబర్ 2016. Retrieved 25 September 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  9. "5 things you didn't know about Phoebe Waller-Bridge". Vogue. 6 November 2019.
  10. Day, Elizabeth (7 July 2016). "Fleabag star Phoebe Waller-Bridge on female anger, emotional honesty -and fancying Barack Obama". The Daily Telegraph. Archived from the original on 11 January 2022. Retrieved 25 September 2016.
  11. "Priory Post 47 – Playwright to Watch". St Augustine's Priory, Ealing. 21 August 2015. Retrieved 14 May 2017.
  12. "Academic Prospectus v. 17" (PDF). DLD College London. 2015. p. 29. Archived from the original (PDF) on 27 September 2016. Retrieved 25 September 2016.
  13. Barnett, Laura (19 January 2014). "Phoebe Waller-Bridge: sex, laughs and a packet of Wotsits". The Guardian. Retrieved 25 September 2016.
  14. Tate, Gabriel (7 January 2016). "Crashing writer Phoebe Waller-Bridge talks up her new Channel 4 sitcom". London Evening Standard. Retrieved 19 January 2016.
  15. Hattenstone, Simon (8 September 2018). "Phoebe Waller-Bridge: 'I have an appetite for transgressive women'". The Guardian. Retrieved 28 April 2019.
  16. "Phoebe Waller-Bridge finds God and naughty glee in 'Fleabag's' second season". Los Angeles Times. 24 May 2019. Retrieved 15 April 2020.