వాసుదేవ్ దేవ్‌నానీ
Vasudev Devnani | |
---|---|
18th Speaker of the Rajasthan Legislative Assembly | |
Assumed office 21 December 2023 | |
గవర్నర్ | Kalraj Mishra Haribhau Bagade |
Chief Minister | Bhajan Lal Sharma |
Deputy | Vacant |
అంతకు ముందు వారు | C. P. Joshi |
Member of the Rajasthan Legislative Assembly | |
Assumed office 2008 | |
అంతకు ముందు వారు | New constituency |
నియోజకవర్గం | Ajmer North |
Minister of State for Education, Government of Rajasthan | |
In office 9 డిసెంబరు 2003 – 10 డిసెంబరు 2008 | |
In office 28 అక్టోబరు 2014 – 11 డిసెంబరు 2018 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Ajmer, Ajmer State, India | 1950 జనవరి 11
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Indira Devnani |
నివాసం | Ajmer |
వాసుదేవ్ దేవ్‌నానీ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అజ్మీర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 12న రాజస్థాన్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వాసుదేవ్ దేవ్‌నానీ బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2003లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అజ్మీర్ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నరేన్ షహానీ భగత్‌పై 2,440 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన 2003 డిసెంబరు 9 నుండి 2008 డిసెంబరు 10 వరకు వసుంధర రాజే మంత్రివర్గంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రిగా పనిచేశాడు. వాసుదేవ్ దేవ్‌నానీ 2008 ఎన్నికల్లో అజ్మీర్ నార్త్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రీగోపాల్ బహేతిపై 688 ఓట్ల తేడాతో రెండోసారి, 2013లో కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ రలవతపై 8,630 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వాసుదేవ్ దేవ్‌నానీ 2013 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రీగోపాల్ బహేతీపై 20,479 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2023 ఎన్నికల్లో అజ్మీర్ నార్త్ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేంద్ర సింగ్ రాలవాతాపై 4,644 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2], 2023 డిసెంబరు 12న రాజస్థాన్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Week (13 December 2023). "Meet Diya Kumari and Prem Chand Bairwa Rajasthan's deputy CMs-elect" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ India TV (3 December 2023). "Rajasthan Election Result 2023: Constituency-wise full list of BJP, Congress, BSP and RLP winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ TimesNow (12 December 2023). "Who Is Vasudev Devnani? New Speaker Of Rajasthan Assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ India TV (12 December 2023). "Who is Vasudev Devnani? Facts about Rajasthan Assembly's next Speaker" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.