వికర్ణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికర్ణుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు.

ద్రౌపదిని కురుసభకు తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతికామిని పంపినపుడు, ఆమె 'నేను ధర్మ విదితయా, అధర్మ విదితయా' కనుక్కొని రమ్మని సభకు తిరిగి పంపిస్తుంది. దానికి సభలో ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. దుశ్శాసనుడు ఆమెను సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చెను. ఈ దురంతాన్ని ఎదిరించిన ఏకైన వీరుడు వికర్ణుడు. కాని ఇతని మాటలను ఎవరు వినలేదు.