వికియానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముగ్గురు మంత్రగత్తెలను బాడెన్, స్విట్జర్లండ్ లో దహనం చేయుట (1585).

వికియానా 16వ శతాబ్ది నాటి వార్తలు, సంఘటనల గురించిన వార్తానివేదికలు, పత్రాల సంగ్రహం. వీటిలో ఒక ఆకు, బొమ్మలతో కూడిన పెద్ద షీట్లు, కరపత్రాలు, ముద్రించిన పత్రాలు, చేతిరాత పాఠ్యాలు, బొమ్మలు ఉన్నాయి. ఈ కాలనాళికను స్విట్జర్లాండ్లో పరివర్తనకు సంబంధించిన ప్రముఖ భాండాగారములలో ఒకటిగా పరిగణిస్తారు. జొహాన్ జాకబ్విక్ (1522-1588) పేరున ఈ సంగ్రహం ఏర్పడింది. అతడు 1552 లో ప్రిడిగర్క్రిషే, దాని అనుబంధ ఆసుపత్రికి మతాధికారిగా పనిచేశాడు. ఆ తరువాత జ్యూరిచ్ లో గ్రాస్మున్స్టర్ లో మతాధికారిగా పనిచేశాడు. 1559, 1588 మధ్యకాలంలో ఆ నాటి వార్త వివరాలను కాలరేఖానుక్రమంలో పేర్చడమే కాక, తరువాత 1505 నుండి 1559 వరకు గలవాటిని కూడా చేర్చాడు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • M. Senn, Die Wickiana. Johann Jakob Wicks Nachrichtensammlung aus dem 16. Jahrhundert, Zürich 1975.
  • Franz Matthias Mauelshagen, Wunderkammer auf Papier. Die Wickiana zwischen Reformation und Volksglaube, Diss. Univ. Zürich, Zürich 2008.
  • Wolfgang Harms, Michael Schilling (eds.), Die Wickiana. Die Sammlung der Zentralbibliothek Zürich, Tübingen 1997–2005.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వికియానా&oldid=2884667" నుండి వెలికితీశారు