Jump to content

వికీపీడియా:అకౌంటు తొలగింపు

వికీపీడియా నుండి

వికీమీడియా లోని అకౌంట్లను తొలగించము. మార్పు చేర్పులు సమర్పించిన అకౌంట్లను తొలగించటానికి వీలే కాదు, ఎందుకంటే అదే వాడుకరి పేరుతో ఇంకొకరు అకౌంటు ప్రారంభించి, గతంలో చేసిన మార్పు చేర్పులు నావే అనవచ్చు.

మీరు అకౌంటును ప్రారంభించిన తరవాత - ముఖ్యంగా స్వంత పేరుతో - మీరు అజ్ఞాతంగా వుండదలిస్తే, మీరు మీ అకౌంటు పేరు మార్చుకోవచ్చు. దీనికొరకు మీరు వికీపీడియా:వాడుకరి పేరు మార్పుకు వెళ్ళి విజ్ఞప్తి చెయ్యవచ్చు, లేదా ఎవరైనా సమర్ధుడైన డెవలపర్‌ ను కలవవచ్చు. మీరే ఒక కొత్త పేరు ఎంపిక చేసుకోవచ్చు లేదా డెవలపర్‌ నే ఎంపిక చెయ్యమనవచ్చు. ఇది అయ్యాక, మీరు ఇదివరకు సమర్పించినవన్నీ కొత్త పేరుకు బదిలీ అవుతాయి.

మీ మార్పు చేర్పులను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. GNU Free Documentation License ను అతిక్రమించకుండా వుండటానికి వాటిని వేరే దానికి ఆపాదించగలము.

వికీపీడియా:వాడుకరి పేజీ లో వివరించినట్లు, మీ పేరు, మీ చర్చా పేజీ ని తొలగించమని విజ్ఞప్తి చెయ్యవచ్చు.

మీరు పాల్గొన్న చర్చా పేజీలు మీ పాత పేరుతోనే కనబడుతూ వుంటాయి. వీటిని స్వయంగా మార్చవలసి వుంటుంది. మీ పేరు సైటులో కనపడరాదని నిశ్చయంతో వుంటే మీరు స్వయంగా వాటిని మార్చవచ్చు లేదా ఇతరుల సహాయం తీసుకోవచ్చు వికీపీడియా:సాయం కావాలి. మీ వాడుకరి పేజీలో "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లంకెను నొక్కితే ఈ పేజీలను తెలుసుకోవచ్చు. పాత సంచికలలో పేజీ చరిత్ర నుండి వీటిని తీసివేయటానికి ప్రస్తుతానికి ఏ మార్గం లేదు.

ఇంకా చూడండి: MeatBall:RightToVanish