కోణార్క్‌లోని సూర్య దేవాలయం శిల్ప కళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రధాకారము కలిగి ఉంటుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంతుంది.