వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 30వ వారం
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఒక చిన్న ద్వీపం, దేశం, నగరం కూడాను. 704 చదరపు కిలోమీటర్లతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశం. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 1819వ సంవత్సరములో అడుగుపెట్టినప్పుడు ఇది జాలర్లు నివసించు గ్రామం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాను ఆక్రమించింది, 1945 సంవత్సరములో తిరిగి బ్రిటిష్ వారి పరమయ్యింది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత, సగటు సింగపూర్ నివాసి జీవనశైలి గణనీయంగా మెరుగుపడింది. ఒక ఆధునిక ఆర్ధికరంగం ఉద్భవించింది. స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశము. ధనవంతమైన జీవన శైలి ప్రకారముఆసియాలో అతి ఉత్తమమైనది, ప్రపంచములో 11వ స్థానంలో ఉంది. సింగపూరులో పూర్వీకులైన మలాయ్ ప్రజలు, మూడవ తరానికి చేరుకున్న చైనీయులు, విదేశీనివాసులైన ఇండియనులు, అరేబియనులు, యూరేషియనులు నివసిస్తున్న కారణంగా మిశ్రమ సంప్రదాయాలు కలిగి ఉంది. కులాంతర, మతాంతర వివాహాలు ఇక్కడ సహజంగా సంభవిస్తూ ఉంటాయి
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్ధిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. పర్యాటకులకు నైట్ సఫారీ , పక్షుల పార్క్, వంటి ఎన్నో ఆకర్షణలున్నాయి. సెంటోసా ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ సీ వరల్డ్, లిటిల్ ఇండియా, చైనాటౌన్, సారంగన్ రోడ్ కూడా ప్రధానమైనవి.
......పూర్తివ్యాసం: పాతవి