వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 12వ వారం
పంచవర్ష ప్రణాళికలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ భవిష్యత్తు బాగుండాలని అభివృద్ధి కోసం జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికలు. నెహ్రూ ప్రణాళికా సంఘం ను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూ ను పితామహుడిగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం ఇంతవరకు మనదేశంలో 10 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 11 వ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్దమైన పద్దతి లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. 1938 లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944 లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు.
మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగం మీదనూ, రెండోది పారిశ్రామిక రంగం మీదనూ ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల మీద, మూడవ దాంట్లో స్వయంసంవృద్ధి మీద, నాలుగు, ఐదవ ప్రణాలికల్లో సుస్థిర అభివృద్ధి, ఆరవ ప్రణాళికలో పేదరిక నిర్మూలన... ఇలా ఒక్కో ప్రణాళికలో ఒక్కో అంశం మీద దృష్టి సారిస్తూ వచ్చారు. .... పూర్తివ్యాసం పాతవి