వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 48వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
DowntownLosAngeles.jpg

లాస్ ఏంజలెస్ (లాస్ ఏంజిల్స్) అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరము. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో న్యూయార్క్ తరవాత అత్యధిక జనాభా కల్గిన పెద్ద నగరము. పడమటి తీర నగరాలలో ఇది అతి పెద్దది. ఎల్.ఎ. (LA) సంక్షిప్త నామము కల్గిన ఈ పట్టణము ప్రపంచ నగరాలలో ఆల్ఫా నగరముగా గుర్తించబడినది. ఈ నగరము 469.1 చదరపు మైళ్ళ విస్తీర్ణము కల్గి 2006 నాటి అంచనా ప్రకారము 38,49,368 జనసంఖ్యను కల్గి ఉంది. కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంలో పసిఫిక్‌ మహాసముదపు తీరాన ఉన్న ఈ నగరము మద్యధరా ప్రాంతపు శీతోష్ణస్థితిని కల్గి ఉంటుంది. గ్రేటర్ లాస్ ఏంజలెస్ అనబడే నగరపాలిత ప్రాంతమైన లాస్ ఏంజలెస్, లాంగ్ బీచ్, శాంటా అన్నా ప్రాంతము లో ఒక కోటీ ముప్పది లక్షల మంది నివాసము ఉంటారు. ప్రపంచము నలుమూలల నుండి వచ్చి చేరిన ఇక్కడి ప్రజలు షుమారు నూరు విభిన్న భాషల వరకు మాట్లాడుతుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లోనే పెద్ద జిల్లా(కౌంటీ)అయిన లాస్ ఏంజలెస్ జిల్లాకు ఈ నగరము కేంద్రము. ఏంజలాన్స్ అనబడే పూర్వీకులు ఇక్కడ నివసించినట్లు గుర్తించారు. ఈ నగరానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమున్న ముద్దుపేరు సిటీ ఆఫ్ ఏంజల్స్(దేవతల నగరము). (ఇంకా…)