వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 44వ వారం
పాలిటానా నగరం భారత దేశం లోని గుజరాత్ నందు గల "భావ్‌నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్‌నగర్ పట్టణానికి నైఋతి దిక్కున కలదు. ఇది జైనులు యొక్క తీర్థయాత్రా ప్రదేశము. గుజరాత్ లోని భావ్‌నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం ‘పాలిటానా’. ఇక్కడికి అతి సమీపంలోని శతృంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి. ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలు ఉండటం విశేషం. అన్నిట్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతం. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా. ఇది 1194 లో రాజరిక రాజ్యంగా స్థాపించబడినది. ఇది అనేక చిన్న రాష్ట్రాలు కలిగిన సౌరాష్ట్ర రాష్ట్రం లోని అనేక ముఖ్య నగరాలలో ఒకటి. పాలిటానా నగరం 777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 58,000 నివాసితులతో(1921 లో) 744,416 రెవెన్యూ కలిగిన 91 గ్రామాలలో ఒకటిగా ఉండెడిది. 1656 లో షాజహాన్ కుమారుడైన మురాద్ బక్ష్ (అప్పటి గుజరాత్ గవర్నర్) ప్రముఖ జైన వ్యాపారి యిన శాంతిదాస్ ఝావేరి కి ఈ గ్రామాన్ని మంజూరు చేశారు.అందలి దేవాలయాల నిర్వహణను 1730 లో "ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్ట్" కు అప్పగించడం జరిగినది. పాలిటానా భారత దేశం లోని బొంబాయి ప్రెసిడెన్సీ యొక్క "కథివార్ ఏజెన్సీ" కి చెందిన రాజరిక రాష్ట్రంగా ఉండెడిది. దీని వైశాల్యం 289 చదరపు మీటర్లు, జనాభా(2011) 150,000. ఈ జనాభా గత దశాబ్దంగా 15 శాతం తగ్గినది. ఈ పట్టణ నాయకుడు "గోహిల్" రాజపుత్రుడు. ఈయనను ఠాకూర్ సాహిబ్ అని పిలుస్తారు.
(ఇంకా…)