Jump to content

పాలిటానా

వికీపీడియా నుండి
పాలిటానా
Padliptpur
పాలిటానా పాలరాతి గుడులు
పట్టణం
పాలిటానా పాలరాతి గుడులు
పాలిటానా పాలరాతి గుడులు
భారతదేశంమూస:Country data భారత్
గుజరాత్గుజరాత్
భావ్‌నగర్భావ్‌నగర్
Elevation
ఎత్తు
66 మీ. మీ (Bad rounding hereFormatting error: invalid input when rounding అ.)
జనాభా
 (2011)
 • Total1,75,000
భాషలు
 • అధికారగుజరాతీ, హిందీ
Time zoneUTC+5:30 (IST)

పాలిటానా నగరం భారత దేశం లోని గుజరాత్లో గల "భావ్‌నగర్ జిల్లా" లోనిది. ఇది భావ్‌నగర్ పట్టణానికి నైరృతి దిక్కున ఉంది. ఇది జైనుల యొక్క తీర్థయాత్రా ప్రదేశము[1] గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో అతి పురాతన పట్టణం ‘పాలిటానా’. ఇక్కడికి అతి సమీపంలోని శత్రుంజయ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి. ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలు ఉండటం విశేషం. అన్నిట్లో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి. 11వ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం అద్భుతం. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కన్పిస్తాయి. అప్పట్లో జైన, బౌద్ధమతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా.

చరిత్ర

[మార్చు]

ఇది 1194 లో రాజరిక రాజ్యంగా స్థాపించబడింది. ఇది సౌరాష్ట్ర లోని అతి పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఇది 91 గ్రామాలతో కూడి 777 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 58,000 నివాసితులతో (1921 లో) 744,416 రెవెన్యూ వసూళ్ళు కలిగిన అతి పెద్ద రాష్ట్రంగా ఉండెడిది.

1656 లో షాజహాన్ కుమారుడైన మురాద్ బక్ష్ (అప్పటి గుజరాత్ గవర్నర్) ప్రముఖ జైన వ్యాపారి అయిన శాంతిదాస్ ఝావేరికి పాలిటానా లోని ఒక గ్రామాన్ని మంజూరు చేశాడు. అందలి దేవాలయాల నిర్వహణను 1730 లో "ఆనంద్‌జీ కల్యాణ్‌జీ ట్రస్ట్"కు అప్పగించడం జరిగినది[2]

పాలిటానా భారత దేశం లోని బొంబాయి ప్రెసిడెన్సీ యొక్క "కథివార్ ఏజెన్సీ"కి చెందిన స్థానిక రాష్ట్రంగా ఉండెడిది. ఒక దశాబ్దంలో దీని వైశాల్యం 289 చదరపు మీటర్లు, జనాభా (2011) లో 150,000 ఒక దశాబ్దంలో 15 శాతం తగ్గుదలని సూచిస్తుంది. ఈ పట్టణ నాయకుడు "గోహిల్" రాజపుత్రుడు. ఈయనను ఠాకూర్ సాహిబ్ అని పిలుస్తారు. ఈ పట్టణ రెవెన్యూ £42,000; ఇందులో £700 "బరోడా కు చెందిన గేక్‌వార్", "జునాగఢ్ నవాబు"కు సంయుక్తంగా చెందినది. ఈ రాష్ట్ర ముఖ్య పట్టణం పాలిటానా. దీని జనాభా 12,800. ఇది "ఠాకూర్ సాహిబ్" చే పరిపాలింపబడుచుండెడిది.

ఈ ప్రాంతం ఠాకూర్ సాహిబ్ చే పరిపాలింపబడుతుండేది. ఈయన హిందూ గోహిల్ రాజ వంశమునకు గల 9 గన్ వందనాన్ని పొందుతుండేవాడు. ఫిబ్రవరి 15, 1948లో ఈ రాజ్య విలీనానికి ఆయన 180,000 రూపాయల రహస్య సొమ్మును తీసుకున్నాడు.

ఉనికి

[మార్చు]

పాలిటానా 21°31′N 71°50′E / 21.52°N 71.83°E / 21.52; 71.83.[3] ల మధ్య, 67 మీటర్ల లేదా 219 అడుగుల ఎత్తులో ఉంది.

జైన దేవాలయాలు

[మార్చు]

ప్రపంచంలో 900 ఆలయాలు ఒకే దగ్గర ఉన్న ఒకే ఒక పర్వతం పాలిటానా[4] .జైన మతంలో పాలిటానా దేవాలయాలు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలంగా కొనియాడబదుతున్నవి. ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన 3000 ఆలయాలు శత్రుంజయ కొండపై ఉన్నాయి. ఆ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అధినాథ్ (రిషభదేవుడు) కి అంకితం ఈయబడింది. శత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది. దీనిని 11 వ శతాబ్దం నుండి 1900 సంవత్సరంలో జైన తరాలవారు నిర్మించిరి.

ఈ దేవాలయాలు "ఆనంద్‌జీ కళ్యాణ్‌జీ" సంస్థచే నిర్వహింపబడుతున్నవి. ఈ సంస్థ కస్తూరిబాయి లాల్‌ భాయి గ్రూప్ తో కలసి పనిచేస్తుంది. కొండ దిగువ భాగం నుండి పై భాగానికి పోవుటకు 3800 రాతిమెట్లు బేసి స్థానాలలో అమరి ఎక్కుటకు వీలుగా యున్నవి.[5] దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి పాలరాతితో కూడి రాతిపై యధార్థ ప్రార్థనా చిత్రాలు కలిగి ఉన్నాయి. ఒక పరిశీలకునికి ఈ దూరం నుండి అందంగా కనిపించే సూక్ష్మ దంతపు చిత్రాలుగా కనిపిస్తుంది. ఈ దేవాలయాలలో అతి ముఖ్యమైన దేవాలయం మొదటి తీర్థంకరుడైన రిషభదేవుని ఆలయం. ఇది అలంకృతమైన శిల్పకళా ఆకృతులను కలిగియుంది. ఇతర దేవాలయాలలో కుమార్‌పాల్, విమల్‌షా, సంప్రీతి రాజా ముఖ్యమైనవి. కుమారపాల్ సోలంకీ, ఒక గొప్ప జైన్ పోషకుడు, బహుశా అతి ప్రాచీన దేవాలయం నిర్మించారు. ఆలయం ఒక అద్భుతమైన నగల సేకరణ కలిగి ఉంది, దీనిని ప్రత్యేక అనుమతితో చూడవచ్చు. ఈ దేవాలయాల కాలం 11 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం మధ్యకాలం.

నమ్మకం

[మార్చు]

జైన మత విశ్వాసం గల ప్రతి జైనుడు తన జీవిత కాలంలో ఒకసారైనా ఈ పర్వతం పైకి అధిరోహిస్తాడు. ఎందుకంటే ఈ పర్వతం పై గల దేవాలయాలు పవిత్రమైనవి కనుక. ఈ కొండపై అనేక దేవాలయాలున్నాయి. వీటి జైన సాంప్రదాయం ప్రకారం, వీటి పవిత్రత పర్వతం పైనుండి క్రిందికి ఎక్కువ నుండి తక్కువకు ఉంటుంది. ఈ పర్వత ప్రయాణం కఠినమైనది. ఈ పర్వతం పై గల రాళ్ళను మెట్లలా తొలిచి వేసిన రహదారి గుండా ప్రయాణించినపుడు గంటన్నర కాలం పడుతుంది. ఈ పర్వతం పైకి ఎక్కుట సాధ్యం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి స్లింగ్ కుర్చీలు అందుబాటులో గలవు. అధిరోహకుల కోసం జైన మత సంప్రదాయాల ప్రకారం నియమాలు విధించడం కఠిన తరంగా ఉంది. పర్వతారోహణ సమయమందు ఆహారం తినడం గానీ, తనతో తీసుకొని వెళ్లడం కానీ చేయరాదు. ఈ ఆలయ పవిత్రత సాయంత్ర సమయం లోపుగానే ఎక్కువగా ఉంటుందని విశ్వాసం. రాత్రి సమయంలో ఏ ఆత్మ కూడా ఉండదని నమ్మకం. పైన ఉండగా "ఆంగర్ పీర్" అనే ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు. పిల్లలు లేని స్త్రీలు పిల్లల కోసం పీర్ యొక్క దీవెనలు కోరుకుంటారు. వారు పీర్ కు చిన్న ఊయల లను అందించి, వాటిద్వారా చల్లడం ఆచారం.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం [6] పాలిటానాలో సుమారు 1,75,000 జనాభా ఉంది. పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. పాలిటానాలో సగటు అక్షరాస్యతా రేటు 74% ఉంది. ఇది జాతీయ సరాసరి అక్షరాస్యతా రేటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 57%. పాలిటానాలో 6 సంవత్సరాల కంటే తక్కువ గల పిల్లల జనాభా 15% ఉంది.

రవాణా

[మార్చు]

వాయుమార్గం

[మార్చు]

పాలిటానా నుండి 51 కిలోమీటర్ల దూరంలో గల భావ్‌నగర్ వద్ద ఒక విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయంలో ప్రతిరోజూ రెండు విమానాలు బొంబాయికు, అహ్మదాబాద్కు ఉన్నాయి. పాలిటానాకు 215 కి.మీ. దూరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇచట అనేక ప్రాంతాలకు వివిధ విమాన సర్వీసులు ఉన్నాయి. గుజరాత్ పర్యాటక రంగంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 11 కొత్త విమానాశ్రయాలు స్థాపించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పాలిటానాలో విమానాశ్రయం కొరకు భూముల స్వాధీన ప్రక్రియ మొదలుపెట్టింది. భారత దేశ విమానాశ్రయ అథారిటీకి అప్పగించడం జరిగింది.[7]

రైలు మార్గం

[మార్చు]

పాలిటానాలో చిన్న రైల్వే స్టేషను ఉంది. ఇది సొంగథ్, భావ్‌నగర్ లను కలిపే రైలు మార్గం. అనేక రైళ్ళు సిహోర్ వద్ద ఆగుతాయి. ఈ స్టేషను అహ్మదాబాద్, గాంధీనగర్ లను కలిపే మార్గంలో ఉంది.

రోడ్డు మార్గం

[మార్చు]

భావ్‌నగర్ నుండి పాలిటానాకు ప్రతి గంటాకూ బస్ సౌకర్యం ఉంది. అహ్మదాబాద్, టాలాజ, యున, డియు ల నుండి రెగ్యులర్ బస్సులు కూడా ఉన్నాయి. యున లేదా డియు నుండి పాలిటానాకు వెళ్ళుటకు 6 గంటల సమయం పడుతుంది. పాలిటానాకు భావ్‌నగర్, అహ్మదాబాద్ లేదా వడోదర నుండి టాక్సీ సౌకర్యం కూడా ఉంది. పాలిటానా రైల్వేస్టేషను నుండి 800 మీటర్ల దూరంలో బస్ స్టేషను ఉంది.

సూచికలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "Pilgrims flock Palitana for Kartik Poornima yatra". The Times of India. 2009-11-02. Archived from the original on 2012-10-25. Retrieved 2009-11-03.
  2. Yashwant K. Malaiya. "Shatrunjaya-Palitana Tirtha". Retrieved 2011-11-28.
  3. "Falling Rain Genomics, Inc - Palitana". Archived from the original on 2013-05-24. Retrieved 2013-08-02.
  4. http://daily.bhaskar.com/article/JM-world---s-only-mountain-that-has-more-than-900-temples-4225137-PHO.html
  5. R. Krishnamurthy (2004-06-04). "Glistening spires of Palitana temples". The Hindu. Archived from the original on 2004-09-23. Retrieved 2009-11-09.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  7. "Guj to get 11 new airports, renovate 10 defunct strips". The Times of India. 2011-04-10. Archived from the original on 2011-11-06. Retrieved 2012-03-01.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పాలిటానా&oldid=3896726" నుండి వెలికితీశారు