వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 14వ వారం
సూపర్ స్టార్ కృష్ణ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత మరియు భారత పార్లమెంటు సభ్యుడు. ఈయన 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు జన్మించాడు. బి.యస్.సి. వరకు చదువుకున్నారు. సినీ పరిశ్రమలో మంచి మనిషిగా కూడా పేరు పొందాడు. 1962 లో ప్రారంభమైన తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమారంగంలో 350 చిత్రాలలో నటించారు. 2008 లో, అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందాడు. 2009 లో, భారతదేశం ప్రభుత్వం భారతీయ సినిమా తన సేవలకు గాను పద్మ భూషణ్ గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఏలూరు నుండి పార్లమెంట్ సభ్యత్వానికి ఎన్నికయ్యారు. రాజకీయ రంగ ప్రవేశం కూడ చేసి, 1989 లో 9వ లోక్‌సభ కు ఏలూరు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ఇతడు ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.యస్సీ చదువుతుండగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కు పౌరసత్కారం జరిగింది. అక్కడ అక్కినేనికి అభిమానులు పట్టిన నీరాజనాలు, అందించిన గౌరవ సత్కారాలు చూసి, తను కూడా ఒక మంచి నటుడిగా ఎదిగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు.
(ఇంకా…)