వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 04వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా
Acute leukemia-ALL.jpg
అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జలోని లాసికాణువు లేదా లింఫొసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వళ్ల ఏర్పడుతుంది. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందడము వలన దీనిని అక్యూట్ అని పిలుస్తారు. ఇది చాలా వరకు పదేళ్ల లోపు చిన్న పిల్లలోనే కనిపిస్తుంది కావున దీనిని బాల్య కాన్సర్ (చైల్డ్-హుడ్ కాన్సర్) అని అంటారు. పెద్దలలో ఈ రకము చాలా అరుదుగా వస్తుంది, ఈ కాన్సర్ బారిన పడే పెద్దల సరాసరి వయస్సు 60 సంవత్సరాలు. కానీ ఇది అన్ని వయస్సుల వారికి రావొచ్చును. అయితే చిన్న పిల్లలలో ఈ వ్యాధిని చాలావరుకు నయం చెయవచ్చును, కానీ పెద్దల్లో 40%-45% మంది మాత్రమే ఈ జబ్బునుండి విముక్తి పొందుతారు. రక్త పరీక్ష చెయడము ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కానీ అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్షలకు నమూనాను ఎముక మజ్జ నుండి సేకరించాలి, దీనిని ఎముక మజ్జ జీవాణుపరీక్ష (బోన్ మేరో బయాప్సీ) అని అంటారు. వెన్నెముక నుండి కేంద్రనాడీమండల ద్రవ్యాన్ని, స్పైనల్ టాప్ లేదా లంబార్ పంక్చర్ అనే పద్ధతి ద్వారా వెలుపలకు తీసి కేంద్రనాడీమండలానికి జబ్బు వ్యాపించిందా అని పరిశోధన చెయ్యలి. సుమారు 10% మందికి రోగాన్ని కనుక్కునే సమయానికి కాన్సర్ కేంద్రనాడీమండలానికి వ్యాపించి వుంటుంది.
(ఇంకా…)