వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 12వ వారం
చౌమహల్లా పాలస్ హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం యొక్క నివాసము. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం యొక్క నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ యొక్క ఆస్తిగా పరిగణింప బడుచున్నది.పర్షియన్ భాషలో "చహర్" అనగా నాలుగు, అరబీ భాషలో "మహాలత్" అనగా సౌధాలు (బహువచనం), అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడినది. ఉన్నత స్థాయి ప్రభుత్వ మరియు రాజరిక కార్యక్రమాలన్నీ ఈ పేలస్ లోనే జరిగేవి. ఈసౌధానికి, యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ ప్రదేశ అవార్డును మార్చి 15, 2010 న ప్రదానం చేయబడినది. సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750 లో ప్రారంభించాడు మరియు ఆసఫ్ జాహ్ 5, ఐదవ నిజాం దీనిని 1857 మరియు 1869 మధ్యలో పూర్తి చేసాడు. ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని షాహే ఇరాన్ సౌధం యొక్క నమూనాగా భావిస్తారు. ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో ప్రారంభింపబడిన దీని నిర్మాణం పూర్తి గావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ కాలంలో నూతన ఒరవడులకు చవిచూసింది. ఈ సౌధంలో రెండు ప్రాంగణాలు వున్నాయి, దక్షిణ ప్రాంగణం మరియు ఉత్తర ప్రాంగణం. వీటిలో సుందర సౌధాలున్నాయి. ఒక ఖిల్వత్ (మహాదర్బారు) మరియు నీటి ఫౌంటెన్ మరియు ఉద్యానవనాలు కలవు.
(ఇంకా…)