Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 26వ వారం

వికీపీడియా నుండి

ఐరావతేశ్వర దేవాలయం

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడినది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు. ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శివాలయం. ఈ దేవాలయంలోమూలవిరాట్టు మహాశివుడు. ఈ దేవాలయం లోని ప్రధాన దైవాన్ని దేవతల రాజైన ఇంద్రుని యొక్క ఐరావతం పూజించినట్లు పురాన గాథ. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులోని నీటిలో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది. ఈ ఇతిహాసం దేవాలయం లోని అంతర్గత మందిరంలో ఇంద్రుడు ఐరావతంతో కూర్చుని ఉండే చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ గాథ కారణంగా ఈ దేవాలయాన్ని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం నరకాధిపతి యముడు కూడా శివుణ్ణి ఇచట అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఒక మహర్షి శాపం మూలంగా తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది.


(ఇంకా…)