వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 39వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్ఫ్యూషియస్

కన్‌ఫ్యూషియస్ (సెప్టెంబరు 28, క్రీ.పూ 551 – క్రీ.పూ. 479) చైనా కు చెందిన శోధకుడు, మరియు సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు మరియు తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవానీస్ మరియు వియత్నామీస్ ఆలోచనలు, తత్వము మరియు జీవితం. ఇతడి తత్వము, ప్రభుత్వ-నీతి పై, సామాజిక-సంబంధాలపై, న్యాయంపై, మరియు ప్రామాణికతపై తన ప్రభావంచే నొక్కివక్కాణించగలిగినది. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. ఇతర తత్వాలు దాదాపు మరచిపోయేంత ప్రభావం చూపగలిగింది, ఉదా: హాన్ సామ్రాజ్యం నాటి చైనీయుల న్యాయవాదం లేదా టావోయిజం (206 క్రీ.పూ. – 220 క్రీ.శ.). కన్‌ఫ్యూషియస్ ఆలోచనలు ఆతరువాతి కాలంలో అభివృద్ధి చెంది కన్‌ఫ్యూషియానిజం అనే కొత్త తత్వానికి ఊపిరిపోసాయి. ఈ తత్వము యూరప్ కు జెసూట్ సంఘం మాట్టియో రిక్కీ చే మొదటిసారిగా పరిచయం గావింపబడినది, దీని లాటిన్ నామం "కన్‌ఫ్యూషియస్". ఇతని బోధనలు అనలెక్‌ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ లో కానవస్తాయి. ఈ బోధనలన్నీ కన్‌ఫ్యూషియస్ మరణించిన తరువాత క్రోడీకరించబడ్డాయి. నవీన చరిత్రకారులు ఈ క్రోడీకరణలను అంగీకరించడంలేదు. ఈ బోధనలు, కన్‌ఫ్యూషియస్ చేతి దస్తూరీ కాదని వీరి వాదన. కానీ దాదాపు 2,000 యేండ్ల తరువాత, ఐదు క్లాసిక్‌లు ఇతడి రచనలు లేదా వీటికి ఇతను సంపాదకుడు, అవి క్లాసిక్ ఆఫ్ రైట్స్ (సంపాదకుడు), మరియు స్ప్రింగ్ అండ్ ఆటమ్న్ ఆన్నల్స్ (రచయిత) మొదలగునవి అని విశ్వసిస్తున్నారు.


(ఇంకా…)