వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 12వ వారం
జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మే 20, 1894 – జనవరి 8, 1994) కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68వ వారు. వారు పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు. ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి. స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి. కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మే, 20,1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20, 1894 నాడు అనూరాధ నక్షత్రములో (చాంద్రమాసానుసారము) జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు. స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. వారికి 1905లో ఉపనయనము జరిగింది. శివన్ సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రిగారు స్వామినాథన్ కి అనుజులు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు.
(ఇంకా…)