వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 20వ వారం
స్వరూపం
ఎం. హరికిషన్ |
---|
ఎం. హరికిషన్ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న ప్రముఖ రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తుడు. కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ రింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్ప ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ. నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు... ఇలా అనేక పుస్తకాలు వెలువరించాడు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో "ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు" సృష్టించాడు. కోడుమూరు మండలంలోని అమడగుంట్లలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న హరికిషన్ పోస్టుగ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు వారి అధ్యాపకుడు, కథా రచయిత అయిన డా॥ తుమ్మల రామకృష్ణగారి సహచర్యం వల్ల సాహిత్య రచనపట్ల ఆసక్తి పెంపొందించుకున్నాడు. అప్పుడప్పుడే కర్నూలులో కథాసాహిత్యాన్ని, సామాజిక స్పృహ గలిగిన రచయితల్ని పెంపొందించాలనే ఆశయంతో ఆవిర్భవించిన సాహితీసంస్థ 'కథాసమయం'లో సభ్యునిగా చేరాడు. రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాసమూర్తి, వెంకటకృష్ణ, శేఖర్, ఉమామహేశ్వర్ విం సాహితీమిత్రుల సహకారంతో, చర్చాగోష్టులతో కథారచనలో మెళకువలను అందిపుచ్చుకున్నాడు. (ఇంకా…) |