వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 34వ వారం
స్వరూపం
తిరువళ్ళూరు |
---|
తిరువళ్ళూరు తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి. 1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రికార్డు అయింది. ఏనుగుల వీరాస్వామయ్య ఆ గ్రంథంలో వ్రాస్తూ: తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని అనే తీర్థమున్నది. అందులో ప్రార్థనలవారు (భక్తులు) బెల్లము వేయిచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహాప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది పేట స్థలము. అన్ని వస్తువులు దొరకును అన్నారు. (ఇంకా…) |