Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 42వ వారం

వికీపీడియా నుండి
డైనోసార్

డైనోసారియా క్లాడ్‌లోని వివిధ సరీసృపాల సమూహమే డైనోసార్లు. అవి భూమిపై మొదటగా 24.3 - 23.323 కోట్ల సంవత్సరాల క్రితం (కోసంక్రి), ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిణామానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది, ఖచ్చితమైన సమయం ఏది అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. 20.13 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ట్రయాసిక్-జురాసిక్ విలుప్తి ఘటన తర్వాత అవి, నేలపై జీవించే సకశేరుకాలుగా మారాయి. నేలపై వాటి ఆధిపత్యం జురాసిక్, క్రెటేషియస్ పీరియడ్లలో కొనసాగింది. పక్షులు, ఆధునిక కాలపు రెక్కల డైనోసార్‌లే అని శిలాజ రికార్డును బట్టి తెలుస్తోంది. చివరి జురాసిక్ యుగంలో, అంతకు మునుపు ఉనికిలో ఉన్న థెరోపోడ్‌ల నుండి ఇవి ఉద్భవించాయి. దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటి క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్తి ఘటనలో డైనోసార్ వంశానికి చెందిన జీవుల్లో ఇవి మాత్రమే వినాశనం నుండి తప్పించుకున్నాయి. కాబట్టి డైనోసార్‌లను ఎగిరే డైనోసార్‌లు లేదా పక్షులుగాను, అంతరించిపోయిన ఎగరని డైనోసార్‌లు (పక్షులు కాకుండా ఇతర డైనోసార్‌లు) గానూ విభజించవచ్చు.
(ఇంకా…)