వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 46వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మవరపు సుబ్రహ్మణ్యం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (1954 సెప్టెంబరు 20 - 2013 డిసెంబరు 7) తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం .వామపక్షభావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజా నాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర వేశాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేసాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగాడు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో మరణించాడు.
(ఇంకా…)