వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం
Jump to navigation
Jump to search
వికీపీడియా అన్నది విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వం అంటే అన్ని విభాగాల్లోనూ వివిధ అంశాలకు సంబంధించిన విజ్ఞానపరమైన అంశాల సారాంశం. ఒక్కో అంశంలోనూ విజ్ఞానపరమైన సంగతులను సంగ్రహంగా వ్యాసాలుగా రాస్తారు. విచక్షణారహితంగా సమాచారం చేర్చడానికి వీలైన చోటు కాదు, అలానే డైరీనో, డిక్షనరీనో, బ్లాగో, గ్రంథాలయమో కాదు. ఏ అంశం మీద రాస్తున్నామో దానిలో విజ్ఞానపరమైన సంగతులు మాత్రమే అంశానికి సంబంధించిన మేరకు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాయాలి. ఉదాహరణకు ఒక ఊరి గురించి రాసేప్పుడు ఆ ఊరిలో జన్మించి, జీవించి పేరొందిన వ్యక్తుల గురించి ప్రస్తావించవచ్చు. కానీ ఆ వ్యాసంలో మన గురించో, మనకు తెలిసినవారి గురించో, లేక ఊరి అందచందాలను వర్ణనాత్మకంగా రాయడమో చేయకూడదు.
పనిపట్టండి
[మార్చు]మీరు చదివిన ఈ అంశాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే కొంత పనిచేసి చూడాలి. ఈ కింది టాస్కు చేసిచూడండి.
- ఒక పట్టణానికి సంబంధించిన వ్యాసంలో పర్యాటక ప్రదేశాల వివరాలు, లాడ్జిల ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకుందాం. ఆ రెంటిలో ఏది ఉండదగినది? ఏది ఉండరానిది? ఆలోచించుకుని, జవాబు ఇక్కడ చదివి చూసి తెలుసుకోండి.