Jump to content

వికీపీడియా:తెలుగు మహిళల ఆసక్తి జట్టు

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా 50,000 వ్యాసాలను దాటి భారతీయ భాషా వికీపీడియాలలో గుర్తించ తగినంత అభివృద్ధి చెందినా తెలుగు వికీపీడియాలో మహిళల ప్రాతినిధ్యం మాత్రం ఆశించిన విధంగా అభివృద్ధి చెందలేదు. అందుకు కుటుంబ బాధ్యతల బరువు ఒక కారణమైతే మహిళలు అంతర్జాలానికి దూరంగానే ఉండడం ఒక కారణం. నేను గమనించిన వరకు బ్రాండ్ బాండ్ అందుబాటులో ఉన్న గృహాలలో కూడా అంతో ఇంతో భాషాజ్ఞానం ఉన్న వారు కూడా ఇందుకు దూరంగానే ఉన్నారు. మనరాష్ట్రంలో కంప్యూటరు పరిజ్ఞానం ఉన్న అనేకమంది స్త్రీలు ఉన్నారు. వారిలో చాలా మందికి తెలుగు వికీపీడియా ఒకటుందని దానిలో ఎవరైనా వ్యాసరచన చెయ్యవచ్చని తెలియజేసినట్లైతే వారి పరిస్థితి కొంత మెరుగుపడవచ్చు. ఉద్యోగినులు వికీపీడియాకు దూరంగా ఉండడానికి కారణం వారికి ఉండే రెండింతల పనిభారం కూడా ఒక కారణమే కదా ! అయినప్పటికీ గృహిణులనూ, ఉద్యోగినులనూ తెలుగు వికీపీడియాలోకి తీసుకురాగలిగితే స్త్రీలకు ఉపయుక్తమైన వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు. అంతే కాదు సాధారణ గృహిణులకు కంప్యూటరు మరియు అంతర్జాల పరిజ్ఞానం కలిగించినట్లైతే తెలుగు వికీపీడియాను వారికి ఉపకరించేలా మార్చవచ్చు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలి. మీ కుటుంబంలో మీ అమ్మగారికి అలాగే మీ ఆప్తులకు కంప్యూటరు పట్ల రచనల ఆసక్తి ఉన్నట్లైతే అది గుర్తించి వారికి కంప్యూటరు జ్ఞానం కలిగించి తెలుగు వికీపీడియాలో సభ్యత్వం తీసుకోవడానికి సహకరించండి. ప్రవేశించిన తరువాత వారికి రచనలు చెయ్యడంలో సహ సభ్యులు సహాయసహకారాలు అందించి వారిని మరింత ముందుకు నడిపిస్తారు.

వికీపీడియాలో స్త్రీల ప్రవేశం కారణంగా సంప్రదాయం, తెలుగు వంటలు, సామెతలు, పొడుపు కథలు చిట్కా వైద్యం, నోములూ వ్రతాలు, ఉపయుక్తమైన చిట్కాలు వంటివి అందరికీ సహకరించే విషయాలు తెలుగు వికీపీడియాలో చేరడానికి అవకాశం కలుగుతున్నది. అంతే కాదు అమ్మకు అమ్మమ్మలకు తెలిసిన సాంప్రదాయక విజ్ఞానం సజీవతను సంతరించుకుంటుంది. ఉద్యోగినులు వారి ఉద్యోగ రంగానికి సంబంధించిన వైవిధ్యమైన వ్యాసాలను అందించవచ్చు. ఇతర ఆసక్తి కరమైనవి, విజ్ఞాన సంబంధిత వ్యాసాలను కూడా వ్రాయవచ్చు.

మహిళా ఆసక్తి జట్టు

[మార్చు]

తెలుగు వికీపీడియాలో ఆసక్తి కలిగిన స్త్రీలు ఇక్కడ మీ పేరు నమోదు చెయ్యండి.

ఆసక్తి ఉన్న విషయాలు

[మార్చు]

ఇక్కడ మీకు ఆసక్తి ఉన్న విషయాలు జాబితాగా వ్రాయండి.