వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/కార్యక్రమ ప్రణాళిక 2023

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ 2023లో నిర్వహించబోయే కార్యక్రమ ప్రణాళిక చిత్తుప్రతి ఇది. దీనిపై దీని చర్చాపేజీలో చర్చించగలరు.

కార్యక్రమాలు, కార్యకలాపాలు[మార్చు]

  • ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశవ్యాప్తంగా, ఉన్న యూజర్ గ్రూప్స్ నిర్వహణలోని మంచి చెడ్డలు, ఎదురుకాగల సమస్యలు, చేయగల మంచి పనులు, వాటికి అనుసరించదగ్గ బెస్ట్ ప్రాక్టీసుల గురించి తన్వీర్ హాసన్‌తో ఆన్లైన్ సెషన్ - జనవరి 2023 మొదటి/2వ వారం (తేదీ నిర్ధారణ కాలేదు)
  • తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ విధి విధానాల నిర్ధారణ, ఎన్నికలు, వగైరా
  • పత్రికా సంబంధాల విషయంలో నిపుణులను ఆహ్వానించి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌కి శిక్షణ ఏర్పాటుచేయడం.
  • తెలుగు స్థాయిలో వికీమీడియాలో మరింత మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన అడ్వాన్స్డ్ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం.
  • జనగణన డేటా ఉపయోగించి గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేయడం గురించి తోటి భారతీయ భాషల వికీపీడియాలకు జాతీయ స్థాయి వర్క్‌షాప్.
  • తెలుగు వికీపీడియా వార్షికోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడం.
  • భారతీయ భాషల వికీపీడియాల విషయంలో అవసరమూ, అవకాశమూ గమనించుకుని జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహణ.
  • 2024 వార్షిక ప్రణాళిక నిర్ణయించుకోవడానికి యూజర్ గ్రూప్ విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు గాను కార్యకలాపాలు.
  • వికీమీడియా ఫౌండేషన్నుండి పొందదగ్గ గ్రాంటులేమిటి, వాటిని ఎలా పొందాలి, విధి విధానాలు, అర్హతలు, ప్రామాణికమైన/ఆమోదనీయ పద్ధతులేమిటి.. వగైరాల గురించి తెలుగు వికీమీడియన్లకు శిక్షణ
  • తెలుగు వికీమీడియన్ల ప్రయోజనం కోసం ఇతర ఇండిక్ భాషల వికీమీడియా ప్రాజెక్టులలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మూణ్ణెల్లకో, ఆర్నెల్లకో ఒక నివేదిక తయారు చెయ్యడం.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల పురోగతి లోని ఎన్నదగ్గ విశేషాలేమైనా ఉంటే, వాటి గురించి మెటా లోనో, మరోచోటో అన్ని భాషల వికీలకూ తెలిసేలా చర్యలు తీసుకోవడం

మార్గదర్శకాలు[మార్చు]

  • తెలుగు వికీమీడియన్లు, వికీమీడియా సముదాయం తమ స్థాయిలో తాము చేసుకోగలిగిన పనులను చేపట్టడం వికీమీడియా సముదాయానికి నష్టదాయకం. అందుకుబదులుగా చేస్తున్న పనినే మెరుగుపరచడంలో, ఇంకా మెరుగ్గా చేయడంలో శిక్షణ ఏర్పాటుచేయడం వంటివి చేపట్టాలి. ఉదాహరణకు ఎడిటథాన్లు, పోటీల నిర్వహణ సముదాయం చేసుకోగలదు. కానీ, వాటి గురించి ప్రచారం చేయడానికి తగిన సామర్థ్యం ఇంతవరకూ కనబరచలేదు కాబట్టి ఆ పని "సహ నిర్వాహకులు"గా యూజర్ గ్రూప్ చేపట్టవచ్చు.
  • యూజర్ గ్రూప్ సభ్యులు వ్యక్తిగతంగా చేసిన ప్రతీ పనీ యూజర్ గ్రూప్ చేసినట్టు కాదు. అలా చేసినట్టు రాసుకోవడం ప్రారంభిస్తే సముదాయానికి, యూజర్ గ్రూప్‌కి అభేదం వచ్చి అనారోగ్యకరమైన ధోరణి ఏర్పడుతుంది. ఆ భేదాన్ని సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యదర్శిపై ఉంటుంది.
  • అన్ని కార్యక్రమాలకూ హైదరాబాద్‌నే కేంద్రంగా చేయకూడదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉన్న వివిధ నగరాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నపూర్వకంగా కృషిచేయాలి. లాజిస్టిక్స్, ఫైనాన్స్ విషయాల్లో తప్పనిసరి పరిమితులు, సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని చేయాలి.
  • అన్ని కార్యకలాపాలను కేవలం ఒకరిద్దరు సభ్యులే చేపట్టడం కూడా అనారోగ్యకరం. దీనివల్ల ఆ ఒకరిద్దరు బర్న్ అవుట్ అయ్యే అవకాశమూ ఉంది, మిగిలిన సభ్యుల్లో నిరుత్సాహమూ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి, కార్యకలాపాలకు నేతృత్వం వేర్వేరు సభ్యులు స్వీకరించగలిగేలా చూడాలి.