Jump to content

వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/కార్యక్రమ ప్రణాళిక 2023

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చేపట్టదగ్గ కార్యక్రమాలు

[మార్చు]

యూజర్ గ్రూప్ చేపట్టదగ్గ కార్యక్రమాల్లో కింది వాటిని కూడా పరిగణించవలసినది. వీటిలో సముచితమైనవాటిని వీలైతే 2023 లో చెయ్యవచ్చు. లేదంటే ఆ తరువాతి సంవత్సరాల్లోనైనా చెయ్యవచ్చు:

  1. వికీమీడియా ఫౌండేషన్నుండి పొందదగ్గ గ్రాంటులేమిటి, వాటిని ఎలా పొందాలి, విధి విధానాలు, అర్హతలు, ప్రామాణికమైన/ఆమోదనీయ పద్ధతులేమిటి.. వగైరాల గురించి తెలుగు వికీమీడియన్లకు శిక్షణ
  2. తెలుగు వికీమీడియన్ల ప్రయోజనం కోసం ఇతర ఇండిక్ భాషల వికీమీడియా ప్రాజెక్టులలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మూణ్ణెల్లకో, ఆర్నెల్లకో ఒక నివేదిక తయారు చెయ్యడం.
  3. తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల పురోగతి లోని ఎన్నదగ్గ విశేషాలేమైనా ఉంటే, వాటి గురించి మెటా లోనో, మరోచోటో అన్ని భాషల వికీలకూ తెలిసేలా చర్యలు తీసుకోవడం

__చదువరి (చర్చరచనలు) 09:18, 30 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]