వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్ట్ పర్సన్స్
[మార్చు]వికీమీడియా ఫౌండేషన్‌తోనూ, ఇతరులతోనూ సంస్థ తరఫున ప్రాథమికంగా వ్యవహరించేందుకు కనీసం ఇద్దరు కాంటాక్ట్ పర్సన్స్ అవసరం. వికీమీడియా ఫౌండేషన్ గుర్తింపు కోసం తప్పనిసరి అయిన అంశాల్లో ఇది ఒకటి. ఈ కాంటాక్ట్ పర్సన్ల ఎంపిక వేరు, సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మొదలుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక వేరు. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక తర్వాత విధివిధానాలు ఏర్పటయ్యాకా జరుగుతుంది. కాంటాక్ట్ పర్సన్స్ ఎంపికపై ఇక్కడ చర్చించగలరు. పవన్ సంతోష్ (చర్చ) 07:01, 28 డిసెంబరు 2022 (UTC)
- ఈ గ్రూప్ ఏర్పాటు వ్యవహారాల గురించి బాగా తెలిసిన @Pavan santhosh.s గారే ఈ పనులన్నీ నిర్వహించాలని నా అభిప్రాయం. ఫౌండేషను కోసం రెండవ వ్యక్తి కూడా అవసరమైతే ఎవరినైనా పెట్టుకోవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 09:24, 30 డిసెంబరు 2022 (UTC)
- నాదీ అదే అభిప్రాయం.రెండవ వ్యక్తిగా చదువరి గారు సరిపోయిన వ్యక్తి అని నా అభిప్రాయం.దీనికి చదువరి గారు అంగీకరించవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 10:51, 30 డిసెంబరు 2022 (UTC)
ఈ అంశంపై చదువరి గారితో మాట్లాడాను. ఆ రెండో కాంటాక్ట్ వ్యక్తిగా ఆయన తాను కాకుండా ఎవరైనా యువకులకు ఆ బాధ్యత ఇస్తే బావుంటుందని చెప్పారు. అందు మీదట NSK గారు అయితే బావుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 09:15, 1 జనవరి 2023 (UTC)
- మొదటి కాంటాక్ట్ పర్సన్ గా చదువరి గారు ప్రతిపాదించిన పవన్ సంతోష్ గారికి, రెండవ కాంటాక్ట్ పర్సన్ గా పవన్ సంతోష్ గారు ప్రతిపాదించిన సాయికిరణ్ గారికి నా మద్దతు తెలుపుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Tal:::k2Me|Contribs) 02:17, 2 జనవరి 2023 (UTC)
- నేనూ మద్దతు తెలుపుతున్నాను.ఈ విషయంలో సాయికిరణ్ గారు అంగీకారం తెలుపవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:44, 2 జనవరి 2023 (UTC)
- మొదటి కాంటాక్ట్ పర్సన్ గా చదువరి గారు ప్రతిపాదించిన పవన్ సంతోష్ గారికి నా మద్దతు తెలుపుతున్నాను,అలాగే పవన్ గారు ఇంకా ఇతరులు ప్రతిపాదించిన విధంగా రెండవ కాంటాక్ట్ పర్సన్ గా ఉండటానికి నాకు ఏటువంటి అభ్యంతరము లేదు. NskJnv 21:07, 3 జనవరి 2023 (UTC)
- నేనూ మద్దతు తెలుపుతున్నాను.ఈ విషయంలో సాయికిరణ్ గారు అంగీకారం తెలుపవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:44, 2 జనవరి 2023 (UTC)
- పవన్ సంతోష్ గారు చాలా కాలంగా తెలుగు, తెలుగు సంభందిత సంస్థలలో ఆశక్తిపరంగా పనిచేసారు. వ్యక్తిగతంగా భాషా ప్రేమికుడు, వికీపీడియాలో నిబద్దత, భాద్యత కలిగిన వ్యక్తిగా అయనకు నా మద్దతు తెలియచేస్తున్నాను. ఆయనతో పాటూ మరెవరైనా అలాంటి భాద్యతాయుతమైన సభ్యుని ఎన్నుకోగలిగితే సంతోషం .B.K.Viswanadh (చర్చ) 09:48, 20 జూలై 2023 (UTC)
రెండవ కాంటాక్ట్ పర్సన్ ప్రతిపాదన
[మార్చు]తెలుగు వికీపీడియా రచ్చబండలో యూజర్ గ్రూప్ విషయమై రచ్చబండలో జరిగిన ఈ రెండు చర్చల - తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటు గురించి సంప్రదింపు, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటు గురించి అన్న రెండు చర్చల ఆధారంగానూ, పై చర్చలో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగానూ - రెండవ కాంటాక్టు పర్సన్‌ని నేను ప్రతిపాదిస్తున్నాను. ప్రతిపాదిత తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపుకు రెండవ కాంటాక్టు పర్సన్‌గా వాడుకరి:రవిచంద్ర గారిని ప్రతిపాదిస్తున్నాను. సుదీర్ఘకాలంగా వికీపీడియాలోనూ, బయటా (ఆర్కైవ్.ఆర్గ్ తెలుగు పుస్తకాల విషయంలో ఆయన చాలా మంచి కృషి చేశారు) అవకాశం ఉన్నంత మేరకూ తెలుగులో స్వేచ్ఛా విజ్ఞానం అభివృద్ధి చెందేలా కృషిచేస్తున్నారు. వికీమీడియా స్ఫూర్తిని తాను చేపట్టే కార్యక్రమాలన్నిటిలోనూ, చేసే పనులన్నిటిలోనూ ఆయన ప్రతిబింబిస్తూంటారు. కనుక, ఆయన ఈ బాధ్యతకు న్యాయం చేస్తారని విశ్వసిస్తూ ప్రతిపాదిస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 13:16, 4 ఆగస్టు 2023 (UTC)
- తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటు గురించి సంప్రదింపులకు రెండవ కాంటాక్టు పర్సన్ గా పవన్ సంతోష్ గారు ప్రతిపాదించిన రవిచంద్ర గారిని గురించి వికీపీడియాలో చురుకుగా ఉన్న వాడుకరులు అందరికి ప్రత్వేకంగా చెప్పవలసిన పనిలేదు.సుదీర్ఘకాలంగా వికీపీడియా అభిపృద్ధిలో అయన గణనీయమైన సేవలు నిరంతరం అందిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆయన అర్హుడుగా భావించి నా మద్దతు తెలుపుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:21, 4 ఆగస్టు 2023 (UTC)
- రవిచంద్ర గారు రెండవ కాంటాక్టుగా ఉండడం నాకు సమ్మతమే. __చదువరి (చర్చ • రచనలు) 15:35, 4 ఆగస్టు 2023 (UTC)
- రెండవ కాంటాక్టు పర్సన్ గా రవిచంద్ర గారిని ప్రతిపాదించిన దానికి నా మద్దతు తెలుపుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:45, 4 ఆగస్టు 2023 (UTC)
- రెండవ కాంటాక్ట్ పర్సన్ గా రవిచంద్ర గారికి నా మద్దతు తెలుపుతున్నాను. NskJnv 15:49, 4 ఆగస్టు 2023 (UTC)
- తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటు గురించి సంప్రదింపులకు రెండవ కాంటాక్టు పర్సన్ గా రవిచంద్ర గారికి నా మద్దతు తెలుపుతున్నాను.--VJS (చర్చ) 17:48, 4 ఆగస్టు 2023 (UTC)
- నా పేరును ప్రతిపాదించిన వారికీ, సమర్ధించిన వారికీ ధన్యవాదాలు. రెండవ కాంటాక్ట్ పర్సన్ గా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు. - రవిచంద్ర (చర్చ) 18:58, 5 ఆగస్టు 2023 (UTC)
- ప్రతిపాదనను అంగీకరించిన @రవిచంద్ర గారికి, సమర్థించిన సముదాయ సభ్యులకు ధన్యవాదాలు. యూజర్ గ్రూప్ ఏర్పాటు పనులు ముందుకుతీసుకువెళ్తాము. పవన్ సంతోష్ (చర్చ) 01:26, 7 ఆగస్టు 2023 (UTC)
యూజర్ గ్రూప్ ఏర్పాటు, గుర్తింపు కోసం దరఖాస్తు
[మార్చు]మెటాలో పేజీ సృష్టించి ఇప్పటికి మొత్తం 25 మందిమి గ్రూపులో సభ్యులుగా చేరాము. దీనితో వికీమీడియా ఫౌండేషన్ వారి ఆఫ్‌కామ్ (అఫ్లియేషన్స్ కమిటీ)కి మన యూజర్ గ్రూప్‌ని గుర్తించమని దరఖాస్తు చేశాను. దరఖాస్తు ఫారంలో కనీసం ముగ్గురు సభ్యులు ఉండాలని ఉండడంతో కాంటాక్ట్ పర్సన్లు ఇద్దరి పేరుతో పాటుగా విజె సుశీల గారి పేరు ఇచ్చి ఈ దరఖాస్తును పూర్తిచేశాము. ఆఫ్‌కామ్ (AffCom) నుంచి ఏదైనా సమాచారం అందితే తెలియజేస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 13:54, 24 ఆగస్టు 2023 (UTC)
- తెలుగు వికీపీడియాలో చురుకుగా పాల్గొంటున్న సుశీల గారిని చేర్చి మహిళలకు కూడా గుర్తింపుతెచ్చారు. తప్పకుండా అధికారిక గుర్తింపు వస్తుంది. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 06:03, 30 ఆగస్టు 2023 (UTC)
- @Rajasekhar1961 ధన్యవాదాలు, రాజశేఖర్ గారూ! పవన్ సంతోష్ (చర్చ) 06:39, 1 సెప్టెంబరు 2023 (UTC)
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తొలి ఆన్లైన్ సమావేశం
[మార్చు]అందరికీ నమస్కారం,
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పడ్డాకా తొలి ఆన్లైన్ సమావేశాన్ని సెప్టెంబర్ 17 తేదీ (ఆదివారం) ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ నిర్వహించనున్నాం. ఈ సమావేశం అజెండా, మిగిలిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 10:58, 6 సెప్టెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Pavan santhosh.s గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:14, 6 సెప్టెంబరు 2023 (UTC)