Jump to content

వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక/భవిష్యత్ కార్యాచరణపై చర్చ/నోట్స్

వికీపీడియా నుండి

నోట్స్

[మార్చు]

తెలుగు భాషపై కృషిచేస్తున్న ఇతరులతో చర్చ

[మార్చు]

మామిడి హరికృష్ణ బృందం

[మార్చు]
  • అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలు (మూలాలను మామిడి హరికృష్ణ అందిస్తారు):
    • సైన్స్ సంబంధించిన వ్యాసాలు
    • పాపులర్ సైన్స్‌కి సంబంధించిన వ్యాసాలు
    • తెలంగాణకు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన వ్యాసాలు
    • అన్‌సంగ్ హీరోల జీవితచరిత్ర వ్యాసాలు
    • సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు
  • కొత్తవాళ్ళకు భాషాపరమైన శిక్షణ అందించాలి. అలా చేయడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సిద్ధంగా ఉంది.
  • విద్యా సంస్థల్లో డిగ్రీ పీజీల్లో తెలుగుకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సంస్థల్లో వికీపీడియా కార్యక్రమాలు నిర్వహించడానికి మధ్యలో సహకారిగా ఉండడానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సిద్ధంగా ఉంది.
  • 850 సాంస్కృతిక సంస్థలు తెలంగాణలో ఉంది. వాళ్ళ గురించిన డేటా భాషా సాంస్కృతిక శాఖ వద్ద ఉంది. వాళ్ళతో కలసి పనిచేసే ప్రయత్నం చేయడానికి మామిడి హరికృష్ణ గారు సాయం చేయగలరు.
  • సీనియర్ సిటిజన్స్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళని కూడా మొబిలైజ్ చేయగలం.
  • జర్నలిస్టులకు కూడా శిక్షణా కార్యక్రమాలు చేయడానికి సాయం చేయొచ్చు.

ఎం.వి.రాయుడు బృందం

[మార్చు]
తక్షణం చేయాల్సినవి
  • ట్వింకిల్ టెంప్లేట్‌ని సరిదిద్దడం
  • ఎర్రలింకులకు రీడైరెక్టులు సృష్టించినప్పుడు సృష్టించినవారికి మెయిల్ వెళ్ళేలా ఏర్పాటు.
  • వికీపీడియా కార్యక్రమాలకు మీడియా కవరేజ్ పెంచుకోవడం
  • వికీపీడియా, విక్షనరీ, వికీసోర్సు, కామన్స్, వికీడేటా వంటి అన్ని ప్రాజెక్టులపైనా అవగాహన కల్పించే పుస్తకాలు, ట్రైనింగ్ మెటీరియల్స్ తయారీ.
  • మనసు ఫౌండేషన్ నుంచి సినిమాలు, సినిమా పాటల వివరాలు తీసుకుని వాటితో సినిమా వ్యాసాలను మెరుగుపరచడం.
మధ్యకాలిక అంశాలు
  • భౌగోళిక వ్యాసాలకు (గ్రామాలు, నగరాలు వగైరా) అక్షాంశ రేఖాంశాలు చేర్చాలి.
  • విజువల్ ఎడిటర్ డీఫాల్ట్ ఎడిటర్‌గా వచ్చినప్పుడు కొన్ని ఉపకరణాలు పనిచేయట్లేదు. ఇలాంటి పలు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వీటిని పరిష్కరించాలి.
  • జేఎన్టీయూతో చర్చించి వికీకి సంబంధించిన రెండు క్రెడిట్ల కోర్సు ప్రారంభించాలి.
  • వికీపీడియన్లు అందరూ వ్యాసాలను తమ సోషల్ మీడియాలో పంచుకోవాలి.
  • నిపుణులతో వ్యాసాల ఖచ్చితత్వాన్ని సమీక్షింపజేయాలి.
  • మనసు ఫౌండేషన్ వారు ఆర్కైవ్ చేసే పుస్తకాల్లో పబ్లిక్ డొమైన్‌లో ఉన్నవి వికీసోర్సులో చేర్చాలి. వాటిపై వ్యాసాలు రాయాలి.
దీర్ఘకాలిక అంశాలు
  • సమాచారపెట్టెకు వికీడేటా నుంచి, వికీడేటాకు సమాచారపెట్టె నుండి డేటా ఆటోమేటెడ్‌గా వెళ్ళేలా వ్యవస్థ రూపొందించుకోవాలి.
  • ఎప్పటికప్పుడు మీడియాలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి వస్తూండేలా కృషిచేయాలి.
  • వికీపీడియన్లు తమ దగ్గరలో ఉన్న స్కూళ్ళకు వెళ్ళి వికీ శిక్షణ ఇస్తూండాలి.
  • ఏడాదికి ఒకసారి ఆలిండియా ప్రతీ సోదర ప్రాజెక్టుకూ ఆలిండియా స్థాయిలో ఒక వికీ మీట్ నిర్వహించాలి.
  • ఒక సాహిత్య ప్రక్రియని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక చారిత్రిక విశేషాన్ని కానీ తీసుకుని దాని చుట్టూ సమగ్రమైన వ్యాసాలు అభివృద్ధి చేయాలి.

కాకర్ల సజయ బృందం

[మార్చు]
  • తెలుగులో గ్రామర్లీ లాంటి ఏఐ బేస్డ్ యాప్ అభివృద్ధి చేయాలి.
  • వికీ ఎడిటింగ్ స్కూలింగ్‌లో, విద్యావ్యవస్థలో భాగంగా చేయాలి
  • అవుట్‌రీచ్ కార్యక్రమాలు బాగా చేయాలి.
  • అన్వేషి సంస్థలోని పుస్తకాలను డిజిటైజ్ చేయడానికి సహకరిస్తామన్నారు.
  • అన్వేషి సంస్థ పరిశోధనాంశాలైన సామాజిక శాస్త్రాలకు సంబంధించిన విషయాలపై ప్రాజెక్టులు ఏర్పరిస్తే వాటికి సహకరిస్తారు.

ఆదిత్య కందర్ప బృందం

[మార్చు]
  • గ్రామాలు, నగరాలకు సంబంధించిన వ్యాసాలకు చరిత్ర పేజీలు సృష్టించి అభివృద్ధి చేయాలి. ఉదాహరణకు ధరణికోట, పెదవేగి, విశాఖపట్టణం.
  • వికీ కామన్స్‌లో ఫోటోలకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత ఉపయోగపడింది అన్నది డీఫాల్ట్‌గా అందరికీ తెలిసేలాంటి సమాచారం తెలిపేలా ఉండాలి.
  • విద్యాసంస్థల్లో ఆసక్తి ఉన్న వ్యక్తులకు వికీపీడియాలో వ్యాసాలు సృష్టించడాన్ని నేర్పించేలా ఒక కార్యక్రమం ఏర్పాటుచేయాలి.

వీవెన్ బృందం

[మార్చు]
  • తెలుగువాళ్ళు రెండవ తరగతి పౌరులుగా జీవిస్తున్నారు. ఇంటా బయటా తెలుగులో జనానికి అవసరమైన అంశాలు లభించట్లేదు. బ్యాంకులు, రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు వంటి అన్నిచోట్లా తెలుగువారికి తెలుగులో వివరాలు దొరకాలి. తెలుగులో సమాచారం లభించాలి. సమస్త విజ్ఞానమూ, వినోదమూ తెలుగులోనే లభించాలి.
  • గౌరవవంతమైన భాషను ఉపయోగించాలి.
  • తెలుగు వికీపీడియాలో ప్రామాణిక భాషే వాడాల్సి వస్తోంది. సింపుల్ ఇంగ్లిష్ వికీపీడియాలాగా మాండలికంలోనూ ప్రారంభించవచ్చు.
  • తెలుగు వికీపీడియా గురించి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ ప్రచారం చేయాలి.
  • సాంకేతిక సమాచారాన్ని పెంచాలి.

తెలుగు వికీమీడియా అంతర్గత చర్చ

[మార్చు]

జనవరి 28 తేదీ మధ్యాహ్నం పూట కార్యక్రమానికి హాజరైన తెలుగు వికీమీడియన్లందరికీ తాము ఎలా రాయడం ప్రారంభించాము, ఎలా కొనసాగించాము, ఏ అంశాలపై సమస్యలు ఎదుర్కొన్నాము, భవిష్యత్తులో తెవికీ ఎలా ఉండాలి, వచ్చే ఏడాది తామేం చేద్దామనుకుంటున్నాము వంటి అంశాలపై మాట్లాడే అవకాశమివ్వగా జరిగిన చర్చను వీడియో చూసి రాసిన పాఠ్యం ఇది.

విశ్వనాథ్. బి.కె.

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

గల్ఫ్ లో ఉండేవాడిని. తెలుగు గురించి సాఫ్ట్ వేర్ల గురించి వెతుకుతున్నప్పుడు స్వర్ణాంధ్ర అన్న సాఫ్ట్ వేర్ ఉండేది. జెపిజిలుగానే ఉండేది తప్ప యూనికోడ్ ఉండేది కాదు. ఆ జెపిజిలతోనే బ్లాగ్ ఏర్పాటు చేశాను. ఆ క్రమంలో నేను వికీపీడియాలో ప్రారంభించాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

వైజాసత్య గారు, మాకినేని ప్రదీప్, చదువరి – అలా అక్కడున్న వారంతా సాయపడ్డారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

అన్నీ బావుంటాయి. పరస్పర గౌరవాభిమానాలు వంటివి నేర్చుకున్నాను. ఇప్పట్లో నాకు నచ్చని ఒకే ఒక్క అంశం టూల్స్ ఎక్కువగా డిజైన్ చేయబడ్డాయి. అదంతా కాస్త ఇబ్బందికరంగా ఉంది. రాయటం మొదలు పెడతాను. కొత్తగా టూల్స్ కనిపిస్తుంటాయి. పది పదిహేను అంశాలు కనిపిస్తున్నప్పుడు మొత్తం నేర్చుకోవాల్సి వస్తోంది. అది కూడా సమస్యగానే ఉంది.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ఇలాంటి మీటింగ్ జరిగితే 200-300 వికీపీడియన్లు హాజరయ్యేలా ఉండాలి. కొత్త, పాత, చిన్నా కొత్తా రావాలి. అంతగా తెలుగు వికీపీడియా సముదాయం పెరగాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

సాధ్యమైనంత పని చేద్దామనుకుంటున్నాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చలో హాజరు కావడానికి ఏ సమస్య లేదు.

రవిచంద్ర

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఎన్‌ఐటి వరంగల్‌లో ఎమ్‌టెక్ చేస్తూండగా ప్రారంభించాను. నాకొక ప్రత్యేక స్థానం ఉంది. నాకు సాంకేతికత తెలుసు, తెలుగు మీదా అభిమానం ఉంది. విజ్ఞానమూ, సాంకేతికత తెలిసినవారు రాయాలి. నాకు ఇలాంటివాటికి నేను సరైనవాడిని అనిపించి రాయడం మొదలుపెట్టాను. చర్చలు చూసినప్పుడు ఇదేమీ ఐలాండ్ కాదు, ఇంకా వేరేవారున్నారని తెలిసింది.

ఎలా పరిచయమైంది?

గూగుల్ సెర్చ్ చేసేప్పుడు ఇంగ్లిష్‌ వికీపీడియా వ్యాసాలు వచ్చేవి. ఎడమచేతి వైపు ఇతర భాషలు ఉండేవి. మన భాష మీద అభిమానంతో లింకు మీద క్లిక్ చేసి అరె తెలుగులోనూ వికీ ఉందా అని కనిపెట్టాను. అప్పుడు రాయడం మొదలుపెట్టాను.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

రాస్తూంటే రవి వైజాసత్య, సుధాకర్, చదువరి, రాజశేఖర్ వంటివారు ప్రోత్సహించారు. అది నా తొలి అడుగులు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వికీలో కొన్ని వ్యాసాలు మంచి నాణ్యతతో ఉంటాయి. కొన్ని ఉండవు. కొంతమంది అదే పనిగా ఏరి వికీలో వ్యాసాలు బాలేదన్నది స్ప్రెడ్ చేశారు. పైసా సంపాదన లేకుండా రాస్తూంటే ఎందుకింత బురద జల్లుతారని అనిపించింది. మా నాయకుల గురించి లేదు, ఇది బాలేదు అని అన్నారు. మానేద్దామనుకున్నాను. కానీ, మనకున్న ఉన్నత లక్ష్యం ముందు ఇవేమీ పెద్దవి కాదనిపించి విరామంతో మళ్ళీ వచ్చేవాడిని.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

  • ఎక్కువమంది భాగస్వామ్యం లేదు. అది పెంచుకోవాలి.
  • సామాజిక అంశాల గురించి రాస్తున్నాం గానీ సైన్స్ విషయాలు లేవు. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అంటారు. ఈవెన్ ఎ బెగ్గర్ ఇన్ అమెరికా నోస్ వాట్ న్యూట్రియంట్స్ ఆర్ ఇన్ యాపిల్ అంటారు. చదువుకున్నవారికి కూడా మన విజ్ఞానాన్ని సాధారణంగా వాడే అలవాటు లేదు.
భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ఎక్కువమందికి వికీని పరిచయం చేయాలనకుకుంటున్నాను. దానికి నేను సీఐఎస్‌తో కూడా కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులు:

  • చర్చల్లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. ఆ సమయంలో వ్యాసాలే రాసుకోవచ్చనిపిస్తుంది.
  • చర్చల్లో మంచి భాష మాట్లాడట్లేదు. వ్యక్తుల మీదకి వెళ్ళకూడదు.
  • చర్చల్లో విషయాలు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. వ్యాసం గురించి చెప్తే మనిషి గురించి చెప్పినట్టు భావిస్తున్నారు.

యర్రా రామారావు

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2012లో లాగినయ్యాను. కొంతకాలం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాను. వికీలో మా ఊరి గురించి తెలుసుకోవటానికి పొనుగుపాడు అని కొడితే మా ఊరి వ్యాసం గురించి ఒక వాక్యం వచ్చింది. రెండు రామాలయాలు, రెండు శివాలయాలు ఉన్నాయని వచ్చింది. తర్వాత మా గ్రామంలో ఆలయం గురించి రాయడం మొదలుపెట్టాను. అలా 20-30 సవరణలు చేస్తూంటే పవన్ సంతోష్‌ గారు గమనించి మెయిల్ పెట్టారు. మీ గ్రామంలోనే చేస్తారా ఇంకేమైనా చేస్తారా అన్నారు. మెయిల్ చూసి నేను వేరే చేయటానికి నాకు సంతోషమే అన్నాను. గ్రామాల్లో నేను పనిచేశాను కనుక గ్రామాల ప్రాజెక్టు చేస్తానన్నాను. అలా 2017లో మెల్లిగా నడవడం మొదలుపెట్టాను. దిగిపోయాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

సాయపడ్డవారు: పవన్ సంతోష్‌, చదువరి ఇద్దరి ప్రోత్సాహం వల్లనే కంటిన్యూగా చేయగలుగుతున్నాను.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

నాకు వికీయే కాలక్షేపం. అసలు నేను చూసినవన్నీ రాయాలంటే నా జీవితకాలం సరిపోదేమోనన్న బెంగగా ఉంది. ఓపిక ఉన్నంతవరకూ పనిచేస్తాను. నా వరకూ నాకు శపథం ఏమిటంటే - ప్రతీరోజూ గంటకు తగ్గకుండా ఎడిట్ చేస్తానని శపథం చేస్తున్నాను. 2-3 బయటకెళ్ళినప్పుడు ఏం చెయ్యలేం. ఇప్పుడు అలానే చేస్తాను. లో

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -
ఒక గ్రామం తీసుకున్నామనుకోండి. జిల్లాకు ఒక శీర్షిక ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొక శీర్షిక ఉంటుంది. చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది. చర్చకు పెట్టినప్పుడు అందరూ పాల్గొని నిర్ణయిస్తే సరైన పేరు వస్తుంది. ఎవరూ స్పందించకపోతే కరెక్టు కాదని ఎలా తెలుస్తుంది?

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

వ్యాసాలు ఉన్నవాటికి రెడ్ లింకులు ఉంటే వాటికి లింకులు కలపటం, అవకాశం ఉన్న ముఖ్యమైన రెడ్ లింకుల వ్యాసాలకు పేజీలు సృష్టించటం, అవకాశం లేని రెడ్‌లింకులు తొలగించాలని నా ఉద్దేశ్యం.ఆ రకంగా ఒక ప్రాజెక్టు ద్వారా సవరించగోరు చున్నాను.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -
మనం చేసిన తప్పులన్నీ స్పెషల్ పేజీల్లో రికార్డవుతుంది. ఆ స్పెషల్ పేజీలన్నిటినీ పరిశీలించి ఖాళీ చేసి వికీని నాణ్యంగా చేయాలి.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

నిర్వాహకులు 12 మంది. 2-3 మాత్రమే పాల్గొంటున్నారు. అదే సమస్య.

పాలగిరి

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఎప్పుడు రాసిందో తెలుసు కాబట్టి చిన్న మార్పు చేశాను. వెంటనే రాజశేఖర్ గారు లైన్‌లోకి వచ్చారు. ఆయనతో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాను.

ఎలా పరిచయమైంది?

2011లో విచిత్రంగా పరిచయమైంది. వికీలోకి రావాలని నేనెప్పుడు అనుకోలేదు. మా అమ్మాయి చదువుకుంటూ ఇంగ్లిష్‌ వ్యాసాలు తెలుగులోకి తర్జుమా చేసి పంపమంది. అసలు ఇలాంటి సమాచారం తెలుగులో కనపడుతుందా అని వెతికాను. అలా తెవికీ కనబడింది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

రాజశేఖర్ గారు

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వ్యక్తిగత కారణాల వల్ల

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -
ప్రస్తావించలేదు

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

2014లో కూడా 20మందే వచ్చారు. ఇప్పుడూ అంతమందే. పదేళ్ళలో వ్యాసాలు పెరిగాయి కానీ మనుషులు పెరగలేదు. పెరగాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -
ఓషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆ ఓషధాల గురించి వ్యాసాలు రాయడం మొలుపెడతాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల విషయంలో ఇబ్బందులు లేవు.

రహ్మానుద్దీన్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

కాలేజ్ గురించి ఇంగ్లిష్ వికీపీడియాలో రాస్తే 24 గంటల్లో డిలీట్ అయింది. అలా ప్రారంభించాను.

ఎలా పరిచయమైంది?

తెలుగు బ్లాగులు అన్న గూగుల్ గ్రూపు చూస్తూండేవాడిని. అప్పుడప్పుడు తెవికీపీడియన్లు వ్యాసాల గురించి మాట్లాడేవారు. అప్పుడు తెలుగులో వికీపీడియా ఉందని అర్థమైంది. తర్వాత చావా కిరణ్ వల్ల తెవికీలో ప్రారంభించాను. కినిగెలో పనిచేసేప్పుడు విక్షనరీ, వికీపీడియాలో పనిచేయాల్సి వచ్చేది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

వీవెన్ గారు

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

అప్పుడప్పుడు వచ్చేవాడిని

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -
సీసీ బై ఎస్‌ఎ రిస్ట్రిక్టివ్. సిసి0 ఐడియల్ లైసెన్స్. ఏ పరిధులూ లేని పూర్తి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమవుతుంది.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?
  • రాబోయే రోజుల్లో లక్షల పేజీలు వచ్చిపడతాయి. వాటిని ఎలా మార్చుకోవాలన్నది మన ముందున్న ప్రధాన సమస్య.
  • రాబోయే తెలుగు తరాలకు తెలుగు చదవడం రాదు. వికీ వ్యాసాలన్ని కూడా వినదగిన విధంగా, అడిగి వెతకగలిగేలా చేర్చుకోగలిగితే. వికీ పాఠకులు పెరిగుతారు. (శ్రోతలు)
వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

  • చాలా మూసలు తెలుగు వికీపీడియాలో చేర్చాల్సి ఉన్నవి. ట్వింకిల్ వంటి గాడ్జెట్లు. ట్యుటోరియల్స్ తయారుచేస్తాను.
  • వికీసోర్సులో మల్లింపల్లి సోమశేఖర శర్మ గారివీ, శ్రీపాదవీ వికీసోర్సులో చేరుస్తాను.
చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు

మీనాగాయత్రి

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

పవన్ సంతోష్‌ వల్లనే తెవికీలోకి వచ్చాను. 2014లో నాకు బీటెక్ అయిపోయింది. ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో తెవికీలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్టు గురించి చేసేదాన్ని. పొద్దున్న 8 గంటలకు అమ్మ ప్లేట్లో టిఫెన్ పెట్టేది. తింటూ మొదలుపెట్టేదాన్ని 3 గంటలకు మానాన్న గారు వార్తలు పట్టుకుని వచ్చేవారు. 3-12 రాత్రి పన్నెండువరకూ చేసేదాన్ని.
వికీ పుట్టిల్లుగానూ, మెట్టిల్లుగానూ కూడా ఉంది. రాజశేఖర్, సుజాత, శ్రీరామమూర్తి, వైజాసత్య, చదువరి, కశ్యప్ - ఏం చేసినా చెయ్యకపోయినా బావుందనేవారు. పవన్ 100 వికీడేస్ చేసినప్పుడు అందరూ ఈ అబ్బాయిని గుర్తించారు. మనం కూడా చేద్దాం అని మొదలుపెట్టాను. రాయడం ఎలా కష్టమన్నది అనుభవించాను. నెట్‌ దొరికేది కాదు. రాసే సమయం ఉండేది కాదు. ఎలాగోలా పూర్తిచేశాను. విమెన్ మంత్ వచ్చిందన్నారు విమెన్ రాయాలన్నారు. విమెన్ వికీడేస్ చేశాను. వందరోజులు వందమహిళల గురించి చేశారు. పంజాబ్ ఎడిటథాన్ అన్నారు. భాష, తిండి తర్వాత ప్రదేశాలు నాకు పిచ్చి. పంజాబ్ వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయడం నచ్చేది. అలా పాల్గొన్నాను. ఇలా ఎందుకు చేశాను కాలరెత్తుకుని చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో హంబుల్‌నెస్ నేర్పిస్తారు, సమాజంలో వినయంగా ఉండకపోయినప్పుడు తగ్గించడానికి చూస్తారు. మనల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళూ ఉంటారేమో కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను.
టిటిటిలో నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను చేయలేదు అనుకున్నారు. అప్పుడు ఇవేం పట్టించుకోవద్దు అని సాయం చేసినవారు చదువరి, వైజాసత్య, రాజశేఖర్, సుజాత వంటివారు బయటపడ్డారు.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

రాజశేఖర్, సుజాత, వైజాసత్య, చదువరి.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

పెళ్ళయ్యాకా, మళ్ళీ ఉద్యోగంలో మొదలవడంతో మానేయాల్సి వచ్చింది.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -
తప్పు చేస్తే తప్పని చెప్పగలరు. తప్పు లేకుండా తప్పంటే నిలబడగలిగినవారు ఉన్నారు. మనల్ని నిలబెట్టగలిగేది సమూహమే. నచ్చినది అదే.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రత్యూష గారి ప్రెజంటేషన్‌లో లోటు చెప్పింది భాష. వాక్య నిర్మాణంలో, ఒత్తుల్లో ఇలాంటివాటిలో లోటు ఉంటుంది. నేను కృషి చేస్తాను. నాతో కలిసి చేసేవారుంటే పనిచేస్తాను.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -
ప్రస్తావించలేదు

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు

సుశీల

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఎం.ఎ. ఎం.ఎల్. పిహెచ్‌డీ లైబ్రెరీ సైన్సెస్‌లో చేశాను. 2014లో ఒక సర్కులర్ మా యూనివర్శిటీలో వచ్చింది. గోల్డెన్ థ్రెషోల్డ్ లో కార్యక్రమాలు జరిగేవి. ఆన్‌లైన్ వర్కు బాగానే చేసేదాన్ని. నమోదుచేసుకున్నాను. మా లైబ్రెరీ గురించి నాలుగు లైన్లు రాసి ఊరుకున్నాను. 2020లో ఆంధ్రప్రదేశ్‌ లైబ్రెరీ అసోసియేషన్‌లో శారద గారు ఉన్నారు. నన్ను, మరొకావిడను పిలిచారు సోషల్ మీడియా పనులకు. నేను వికీలో అకౌంట్ ఉంది రాస్తానన్నాను. పవన్ సంతోష్‌ గారిని అప్రోచ్ అయ్యాను. బయట రాసినట్టుండదన్న విషయంలో టిప్స్ ఇచ్చారు. మొదలుపెట్టగానే భాస్కరనాయుడు గారు వెల్కమ్ చేసి ఫోన్ నెంబర్ కాంటాక్టు చేస్తే చాలా సంతోషించారు. ప్రోత్సహించారు. చదువరి గారు నేను చదివిన వ్యాసం చూసి మొదటి పేజీలో ఈవారం వ్యాసం కింద వేశారు. మార్పుచేర్పులు సూచించారు. ఏదైనా రాస్తే ఆయన ఇంగ్లిష్‌లోనూ చేయమని సూచించడమో, ఇంకోటో చేసేవారు. ఆయన నాకు ఎప్పుడూ వెనకాలే ఉంటూ సాయంచేసేవారు. నాకు కొంచెం కామన్స్‌లో ఎదురుదెబ్బ తగిలింది. చిరాకు వచ్చింది. రాజశేఖర్ గారు నాకు వికీసోర్సులో మెంటర్‌గా గైడ్ చేశారు. దాసు శ్రీరాములు గారనే మా తాత గారి పుస్తకాలు అక్కడ డిజిటలైజ్ చేసి చదువుకోగలిగాను.
డీప్ ఫేక్ అంటే దాని గురించి రాశాను. ఇంకేదైనా వార్తల్లో వస్తే దాని గురించి రాస్తూంటాను. ఇంతలో రామారావు గారు నాకు కాల్ చేసి వికీకాన్ఫరెన్స్ ఇండియా గురించి రచ్చబండలో పెట్టానన్నారు. అదే నాకు రచ్చబండ చూడడం. వికీకాన్ఫరెన్స్ ఇండియాకి వెళ్ళాను. ఒక్కసారిగా నా మెంటల్ హొరైజాన్ అన్నది విస్తృతమైంది. చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి మారినట్టు అయింది.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

పవన్ సంతోష్‌, భాస్కరనాయుడు, చదువరి, రాజశేఖర్

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -
ఎలా ఉంటే బావుంటుందంటే - డు అనేది రాయడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది చాలామంది ఫేస్ చేశారు. కానీ, పద్ధతి అనుసరించకతప్పదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

సహాయం పేజీలు తెలుగులో ఉండాలి. పేజీలో లేని చాలా సహాయాలు ఉన్నాయి. మనం ఒక వస్తువు గురించి ఒక దగ్గరే వెతుకుతాం. ఎక్స్‌ప్లోరింగే చాలా టైం పడుతుంది. వర్గాలు ఇర్రిగ్యులర్‌గా ఉన్నాయి. క్యాటగరైజేషన్ చాలా ముఖ్యం. మొదటిపేజీ కొంత సింపుల్‌గా ఉండాలి. విక్షనరీ మొదటిపేజీ చాలా డిస్టర్బ్ అయిపోయింది. వికీవ్యాఖ్య మాత్రం వికీకోట్ అన్న పేరుతో ఉండదు. వ్యాఖ్య అన్న పేరు బ్రాండింగ్ విషయంలో కన్ఫ్యూజింగ్‌గా ఉంది. వికీకోట్ లాంటి సోర్సే తెలుగు ఆన్‌లైన్‌లో లేదు. ఆన్‌లైన్‌లో మట్టుకు తెలుగులో సరైన రీసోర్సులేదు. మనం పనిని విభజించుకుందాం.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -
వికీలో నా అవసరం ఎంతుంటే అంత పనిచేస్తాను. ఎక్కడంటే అక్కడ పనిచేస్తాను. నేర్చుకుంటాను. నేర్పగలను. టార్గెట్లు లేవు. ఆ వయసు కాదు. ఎవరితోనూ పోటీపడను. వాళ్ళు బాగా పనిచేస్తారనుకోవడమే తప్ప పోటీపడను. జీవితకాలం నేర్చుకునే ప్రాసెస్ ఇది.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల్లో పాల్గొనేందుకు ఏమీ ఇబ్బందిలేదు. వివాదాస్పదమైన విషయాలు కాకుండా పాల్గొనడం నాకిష్టం.

మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2021 ఫిబ్రవరి నుంచి వికీజర్నీ మొదలుపెట్టాను

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

కశ్యప్ గారు పూర్తిగా తానే ట్రైన్ చేశారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

మానేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సెప్టెంబరులో మానాల్సివచ్చింది.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

వ్యాసాల పేర్లు తప్పుగా సృష్టిస్తూంటారు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ఒక లైన్ వ్యాసం రాస్తూంటారు. విస్తరణ మూస పెడతారు. విస్తరించాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

గాయత్రి తర్వాత నేను 100 వికీడేస్ చేశాను. హిస్టరీ అంటే ఆసక్తి కాబట్టి చేశాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

167 వ్యాసాలు రాస్తే రవిచంద్రగారు సగం మీకు తెలుసాలో చేర్చారు.

దివ్య

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

మార్చి 2021 నుంచి వికీ ప్రారంభించాను.

ఎలా పరిచయమైంది?

ఐఐఐటీలో కశ్యప్ గారి వల్ల పరిచయం అయింది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రణయ్ రాజ్‌ని అడిగినప్పుడు అనాథ పేజీ అంటే ఏమిటి? ఎలా రాయాలి? ఏం చేయాలి చెప్పారు. నేను రాసే ప్రతీ వ్యాసంలోనూ వాక్య నిర్మాణం గురించి నేర్పారు. ఫోటోలు ఎక్కించడం రానప్పుడూ ప్రణయ్ నేర్పారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వచ్చిన పదిహేను రోజుల్లోనే మానేద్దామనుకున్నాను. అనాథ మూస పెట్టారు. మానేద్దామనుకున్నాను.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

టూల్స్ గురించి చదివినప్పుడు అర్థం అవ్వదు. చెప్తే అర్థం చేసుకోగలను. డబ్ల్యుపి క్లీనర్ వంటివి నేర్చుకున్నాను. రాలేదు. కొన్నాళ్ళలలో సమాధానం చెప్తామని చర్చాపేజీలో కొందరు పెట్టి వెళ్ళారు. కానీ, ఇప్పటికీ సమాధానం చెప్పలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ట్రైనింగ్ ఇస్తాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ఇబ్బందులు లేవు.

భవ్య

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2022 జూన్‌లో వికీపీడియాలో ప్రారంభమయ్యాను.

ఎలా పరిచయమైంది?

ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా పరిచయమైంది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

పనిచేసేప్పుడు మమత, దివ్య వంటివారితో కలసి పనిచేసేదాన్ని. కశ్యప్ గారు వీళ్ళే సాయం చేశారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

మానేద్దామని ఎప్పుడూ అనుకోలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

సోదర ప్రాజెక్టుల గురించి అవగాహన లేకపోవడం నచ్చదు నాకు. సోదర ప్రాజెక్టుల గురించి ఏదైనా వీడియోలా ఉంటే బావుంటుంది.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

ప్రభాకర్ గౌడ్ నోముల

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

నేను బ్లాగర్ని. ఏదో చిన్న బ్లాగ్ చేసుకున్నాను. నా బ్లాగ్‌ని వెతికే క్రమంలో 2010లో వికీపీడియాలో ఖాతా చేశాను. గ్రామాల వ్యాసాలు దొరుకుతున్నాయి ఆంగ్లంలో. కానీ, వెతికితే అక్షరభేదంతో గ్రామవ్యాసం దొరికింది. మండలం పేజీలో ఏదో రాశాను. పాలగిరి గారు నన్ను పలకరించారు. మా ఊరి గురించి ఒకే లైన్ ఉంది. ఒక రెండు గంటలు కష్టపడి మా గ్రామంలోని రుద్రమదేవి కట్టించిన శివాలయం గురించి వ్యాసంలో రాశాను. మళ్ళీ వెతుకుతుంటే వాడుకరి పేజీలో పవన్ సంతోష్ వచ్చి ఫోటో పెట్టమన్నారు. తర్వాత వెంకటరమణ గారు కూడా వచ్చారు. టైం దొరికినప్పుడల్లా చూసేవాడిని. ఇదొక స్వచ్ఛంద సంస్థ అన్నది అర్థమైంది. కానీ, ఇదేదో పెద్ద బ్లాగ్ కావచ్చు అనుకున్నాను. జిల్లాలో గ్రామాల పేజీల్లో వివరాలు లేవు. మీ ఊరి చరిత్ర రాయమని పవన్ గారు మెసేజ్ చేశారు. 2016-17 సమయంలో కొత్తగా ఒక పేజీ పెట్టి రాశాను. ఇంతలో డిలీట్ అయ్యేది. చాలా బాధ కలిగింది. అప్పుడు మొత్తం చదివాకా కానీ వికీపీడియా గురించి తెలియలేదు. ఇందులో ఫోన్ నెంబర్లు ఉండేవి కాదు. ఆశ్చర్యంగా అనిపించేది. రామారావు గారు వచ్చి అందరికీ గారు పెట్టారేమిటి అని అడిగారు. నియమాలు చెప్పారు. ఇంక మానేద్దామనుకున్నాను. కోవిడ్ టైంలో సమయం దొరకడంతో మా చుట్టుపక్కల రాజకీయ నాయకుల గురించి రాయడం మొదలుపెట్టాను. పనికిరాని చెత్త గ్రామాల వ్యాసాల్లోంచి తీసేసేవాడిని. రచ్చబండలో పాల్గొనమని చదువరి గారు సూచించారు. ఐఐఐటీ వారు అప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. సచేతనంగా లేని నిర్వాహకులను తీసేసి కొత్తవారిని చేరిస్తే బావుంటుందేమో అనుకున్నాను. కొంతమందితో వివాదాలు పెట్టుకున్నాను. మన్నించమని కోరుతున్నాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రస్తావించలేదు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

కొత్తగా చేరేవారికి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడానికి వీలుంటుందేమో చూడండి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ఎవరికైనా నేర్పించాలంటే నేర్పిస్తాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

అభిలాష్‌ మ్యాడం

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

వికీపీడియాలో 2021 జనవరిలో ఖాతా తెరిచాను. అంతకుముందు తెలుగు కీబోర్డు వాడి వెతికేప్పుడు ఇంగ్లిష్‌ వికీపీడియాలో ఉన్న వ్యాసాలు ఆటోమేటెడ్ ట్రాన్సలేట్ అయి కనిపించేవి. అలానే తెలుగు వికీపీడియా కూడా ఉందేమో అనుకున్నాను. లోగో చూసినప్పుడు తెలుగులోనూ వికీపీడియా ఉందని అర్థమైంది. తెలుగులో కూడా వ్యాసాలు రాయచ్చనుకుని ఎఫ్బీలో ఇన్‌స్టాలో చేసినట్టు ఖాతా సృష్టించాను.

ఎలా పరిచయమైంది?

వాట్సాప్‌ స్టేటస్‌లలో త్రిపుల్ ఐటీ ట్రైనింగ్ సెషన్లున్నాయని తెలిసింది. అక్కడ చేరాను. కశ్యప్, ప్రభాకర్ గార్లు ట్రైనింగ్ ఇచ్చారు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

సాయికిరణ్‌, రామారావు గార్లు సాయమిచ్చారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

365 రోజులు రోజుకొకటి రాశాను. ఉస్మానియలో ఐపీ అడ్రెస్ బ్లాక్ అయివుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకు ఐపీ అడ్రెస్ బ్లాక్ అయిందని చాలామందిని అడిగాను కానీ సమాధానం లేదు. వేరే దగ్గరకు వెళ్ళి రాయాల్సి వచ్చేది. ఆ సమయంలో రోజుకొక వ్యాసం ఆగిపోయింది.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

రోజుకు ఒక్క వ్యాసంలోనైనా భాషాదోషాలు దిద్దాలి. నెలకు ఇద్దరిని వికీపీడియన్లను చేయాలి.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ఐపీ అడ్రెస్ బ్లాక్ వల్లనే చర్చలు చేశాను.

రమేష్ బేతి

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఐఐఐటీ వికీకి రాసేవాడిని మొదట్లో. 10 రోజుల్లో 30 వ్యాసాలు రాస్తే డిజిటల్ సర్టిఫికెట్ వస్తుందని చెప్పారు. 30 రాశాను. లింకులు పెట్టాలి. ఇంకేదో చేయాలి. మనకు డిజిటల్ సర్టిఫికెట్ రావాలని చెప్పినవన్నీ చేశాను. చివరకు సర్టిఫికెట్ వచ్చింది. ఆ తర్వాత ఐఐఐటీ వికీలో వరంగల్‌లోని సాహిత్యవేత్తల గురించి, సాహిత్య సంస్థ గురించి వెతికాను. అది డైరెక్టు వికీపీడియాకు తీసుకువచ్చింది. నేను రాద్దామనుకున్నది అక్కడే ఉంది. అప్పుడు తెలంగాణలో కొలతలు అన్నది వెతికి రాయడం మొదలుపెట్టాను. వెంటనే బ్యానర్ పెట్టారు. సరే అనుకుని వదిలేశాను. భయం వేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే వెతికి చూశాను. నాకు వాళ్ళు చేసిన సూచనలు కనిపించింది. మూలాలు కరెక్టుగా లేవంటే మూలాలు పెట్టాను, లింకులు లేవంటే లింకులు పెట్టాను. మీరు పై మూసలు తొలగించవచ్చని వచ్చింది. చేశాను. ఆగస్టులో ఫోటో కాంపిటిషన్ జరిగింది. నేను వంద గ్రామాల ఫోటోలు సేకరించి అప్‌లోడ్ చేస్తూంటే 1030 గంటలకు రామారావు గారు ఫోన్ చేశారు. చేసి సలహా ఇచ్చారు. ఆయన చెప్పినదల్లా ఫాలో అయ్యాను. వంద ఫోటోలు పెట్టాను. సాయికిరణ్ నెంబర్ వన్, నేను టెన్. వరంగల్‌లో సాహిత్యవేత్తల గురించి కొందరివి వ్యాసాలున్నాయి. కొందరివి లేవు. నేను రాసి అందులో పెట్టాను. ఐపీ అడ్రెస్ సమస్య వల్లనే కొత్త ఖాతా సృష్టించాల్సి వచ్చింది.

ఎలా పరిచయమైంది?

2021 నుంచే నా వికీ ప్రయాణం మొదలైంది. రాయగలిగేవాడిని కాదు. కరోనా సమయంలో స్కూళ్ళు హాఫ్‌డే ఇవ్వడంతో ఐఐఐటీ వారు పేపర్లో ఇచ్చిన శిక్షణా కార్యక్రమం గురించి తెలిసింది. గూగుల్ ఫాం నింపాను. ఐఐఐటీ శిక్షణా కార్యక్రమం గురించి నేర్చుకున్నాను.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

రామారావు గారు

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

చరిత్రలో ఈరోజులో నీలి రంగులో వ్యాసం ఉన్నట్టే ఉంటుంది కానీ అది ఇంగ్లీష్‌కి వెళ్తుంది అది నాకు నచ్చలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

సాంకేతిక వ్యాసాలు తెలుగులో ఉంటే బావుంటుంది.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ఇక్కడ వికీ గురించి బాగా తెలిసింది. కాబట్టి, లైఫ్‌టైం వర్క్ చేద్దామనుకుంటున్నాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల్లో పాల్గొనడంలో ఇబ్బంది లేదు.

మురళీకృష్ణ

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఫ్రీలాన్సర్‌గా కొన్ని పత్రికలకు వ్యాసాలు రాసేప్పుడు రోజుల ప్రత్యేకతలు చూసేవాడిని. వికీలో కూడా కొన్ని డేస్ కనిపించేవి. ఐపీ అడ్రస్‌తోనే పనిచేసేవాడిని. కోవిడ్ టైంలో ఐఐఐటీ వారి ట్రైనింగ్ కార్యక్రమం చూశాను. ఏప్రిల్ 2021లో ప్రారంభించినట్టున్నారు. అప్పుడు పాల్గొన్నాను. కోవిడ్ నెమ్మదిస్తే ప్రణయ్ గారు ఏర్పరిచిన సమావేశంలో కలిశాను. ప్రణయ్ గారి రికార్డు చూశాను. నేనూ అనుసరించాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

కశ్యప్ గారు, చదువరి గారు, రామారావు గారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వికీలో మానేద్దామని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నాయకత్వ లక్షణాలు లేవు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని కూడా చెప్పలేను. నేను నేనుగా రాసుకోవచ్చు. బత్తిన గారిని చూస్తే రోజుకు పది వ్యాసాలు ఎందుకు రాయలేమని అనిపించింది. బత్తిని గారి స్పీడ్ అందుకోవాలని ప్రయత్నం చేయబుద్ధి వేస్తోంది.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

నాకొకటి ఇష్టం, మీకొకటి. అందరూ అన్నీ చేయాలంటే అందరికీ ఆసక్తి ఉండవు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చలో పాల్గొనడానికి ఇబ్బందీ లేదు. ఇప్పటికీ నేను పాల్గొంటున్నాను. వ్యక్తిగత దూషణలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి. నేను పాల్గొంటూనే ఉంటాను.

సాయికిరణ్‌

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2020లో మొదలుపెట్టాను.

ఎలా పరిచయమైంది?

కశ్యప్ పరిచయం చేశారు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

కశ్యప్ సార్

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వికీలో రాయడం మానేద్దామని చాలాసార్లు అనుకున్నాను. కశ్యప్ సార్ ఈ వ్యాసం ఇట్లా రాయాలన్నప్పుడు ఆయన చెప్పినట్టు రాయలేక మానేసేవాడిని. నాకు తెలంగాణ యాస బోలెడంత వచ్చేది. వ్యాసాలు రాయాలన్నాడు, ట్రైనింగ్ ఇవ్వాలన్నాడు. మానేయాలనిపించింది. రచ్చబండలో జరిగిన చర్చలు, ఆరోపణల వల్ల మానేద్దామని అనుకున్నాను. మానేద్దామని అనుకున్న ప్రతీసారి డబుల్ పనిచేస్తున్నాను.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

వికీకి సంబంధించి అవుట్‌రీచ్ చాలా ఎక్కువగా జరగాలి. అవుట్‌రీచ్‌లో మనం బాగా వెనుకబడి ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు తెవికీ ఉందని తెలియాలి. ఐపీ అడ్రస్ బ్యాన్‌లు ఉన్నాయి. ఐపీ అడ్రస్ బ్యాన్‌లు తీసేయాలి. భాషాపరంగా నాణ్యత పెరగాలి. తెలుగులో చదువుతున్నవారు వికీ అభివృద్ధి కృషిచేయాలి. మార్గదర్శకులు కావాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

పిరమిల్ ఫౌండేషన్‌లో ఫెలోగా చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను. ఫెలోషిప్ చేస్తూండేవారం. ఉద్యోగాలు, జీతాలు ఉండేవి. ఇప్పుడు ఎవరూ ఉద్యోగస్తులు కాదు, ఉపాధి కాదు. కానీ, తెలుగు భాష మీద ప్రేమతో ఇక్కడ కలవడం విశిష్టమైన విషయం. భాగస్వామి కావడానికి గర్విస్తున్నాను.

తిరుమల్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ప్రస్తావించలేదు.

ఎలా పరిచయమైంది?

త్రిపుల్ ఐటీ ట్రెయినింగ్ వల్ల వికీ తెలిసింది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

కశ్యప్ మొదలు ఇందులో చాలామంది సాయపడ్డారు. రామారావు గారు కూడా చాలా వివరించారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వ్యక్తిగత కారణాల వల్ల 100 వికీడేస్ పూర్తిచేయలేదు. ఇప్పుడు చేయాలనుకుంటున్నాను.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

వికీ ఎక్కువమందికి తెలియదు. దాని గురించి పనిచేయాలని అనుకుంటున్నాను.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

ఆత్రం మోతీరామ్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఫేస్‌బుక్ వాడుతుండగా వికీలో శిక్షణా కార్యక్రమం అని ట్రిపుల్ ఐటీ ప్రచారం చేసింది. అప్పుడు కార్యక్రమానికి వచ్చాను. అప్పుడు నా వాడుకరి పేజీ పెట్టాను. కొన్నాళ్ళకు మర్చిపోయాను. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కి వికీ నేర్చుకుందామని 150 రూపాయలు పెట్టుకుని వచ్చాను. హైదరాబాద్ దూరం కావడం వల్ల దూరమైంది. - అప్పుడు కశ్యప్ సార్ శిష్యుడు సాయికిరణ్ నాకోసం వచ్చాడు. గోండి వికీపీడియా గురించి పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఆ కార్యక్రమానికి వెళ్ళేసరికి నన్ను ఛీఫ్‌ గెస్ట్‌గా కూర్చోబెట్టాడు. ఆ ప్రోత్సాహంతోనే కొలామి వికీపీడియాలో ఇంక్యుబేటర్‌లో వ్యాసాలు రాసుకుంటున్నాను. తెలుగులో రాయడమూ ఇష్టమే. మా సంస్కృతి గురించి వికీలో రాయడం మొదలుపెట్టాను.

ఎలా పరిచయమైంది?

2016లో డిగ్రీ సెకండియర్ చదువుకుంటున్నాను. శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌లో రాజ్యాంగం గురించి వెతికాను. అప్పుడే వికీ ఉంటుందని తెలిసింది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రణయ్ రాజ్, రామారావు వంటివారు నాకు సూచనలు, ప్రోత్సాహం ఇచ్చేవారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చా పేజీల్లో నాకు మార్గదర్శనం చేస్తే బాగా రాయగలుగుతాను.

చదువరి

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2005లో రాయడం మొదలుపెట్టాను. ఇంగ్లిష్‌ వికీపీడియాలో దేనికోసమో వెళ్ళాను. తెలుగు ఉందని అక్కడే తెలిసింది. ఇటొచ్చాను. తెలుగులో రాయడం ఎలాగన్నది కూడా పద్మ టూల్ వల్ల అర్థమైంది. ఉత్సాహంగా రాసేవాడిని. ఒక లక్ష్యం ఉండేది. తెవికీ పేజీలో ఇంగ్లిష్‌ ఉండకూడదు తెలుగు ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికన్నా అప్పట్లో చర్చలు బాగా జరిగేవి. 2008లో మానేసి 2016లో వచ్చాను. ఉద్యోగ రీత్యా అడవుల్లో ఉండేవాడిని దాంతో రాసేవాడిని కాదు. 2016లో మళ్ళీ మొదలుపెట్టాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

వైజాసత్య, రవి.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

కొత్తవారికి మనం శిక్షణ ఇవ్వట్లేదు, ఆదరించట్లేదు, చిరాకుపడున్నాం. మనం దాన్ని మార్చాలి. కొత్తవారిని దత్తత తీసుకోవాలి. వాళ్ళే కొత్తవారితో మాట్లాడాలి. మిగిలినవారు మాట్లాడకూడదు. కొన్నాళ్ళు ప్రయత్నించి చూడొచ్చు. ఊరికే ఖాతా సృష్టిస్తారు. ఏం రాస్తే ఏమవుతుందో తెలియదు కాబట్టి రాయరు.

సహాయం పేజీలు, విడియోలు, ఆడియోలు విస్తారంగా రావాలి. నేర్చుకోవడానికి మెటీరియల్ ఉంటే నేర్చుకోవచ్చు. కొత్తవారికి నేర్పే విషయంపై మనం చేసిన కృషి తక్కువ.

నిర్వాహకత్వంలో సగం మంది కొత్తవాళ్లు రావాలన్నది రెండేళ్ళకు టార్గెట్ పెట్టుకోవాలి. 22 మందిలో 11 మంది కొత్తవాళ్ళుండాలి. పగ్గాలు కొత్తవాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి.

నిర్వాహకుల ఎంపిక శాస్త్రీయంగా చేయాలి. నేను నిర్వాహకుడిని అవ్వదలుచుకున్నాను ఏం చేయాలో చెప్పు అంటే చెప్పగలగాలి. ఎవరు నిర్వాహకుడిని అవ్వాలని అడిగినా సాయం చేయగలగాలి. నేను చేస్తాను.

ప్రత్యూష గారు రాసిన రిపోర్టు చాలా బావుంది. మన భాష చాలా ఇంప్రూవ్ అవ్వాలి. వర్గాల క్రమబద్దీకరణ చేయాల్సి ఉంది. అందరం కూర్చుని చేయాలి. చాలా పెద్ద ప్రాజెక్టు.

దుశ్చర్యల నివారణ, నిరోధం పరిష్కారం. ఐపీ అడ్రస్‌ల సమస్య ఎందుకొచ్చింది, పరిష్కారం గురించి ఏం చేయాలన్నదాని గురించి మాట్లాడుకోవాలి. ఏం చేయాలో నిర్ణయించుకుందాం.

రోజుకో వ్యాసం అన్నది బాగా విస్తరించాలి. కొత్త నియమాలు, కొత్త పద్ధతులతో ఛాలెంజులు పెట్టుకోవాలి. ఏడు రోజులు ఏడు వ్యాసాలు వంటివి. ప్రతీరోజూ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. మధ్యలో మిస్సైనా వందరోజుల్లో వంద వ్యాసాలు రాసేలాంటివి చేయాలి.

ఈ నెల వికీపీడియన్లు వంటివి ఏర్పాటుచేయాలి. కొలబద్దలు తయారుచేయాలి.

మంచి వ్యాసాలు తయారుచేయాలి.

బయటి కార్యకలాపాలు చాలా విస్తృతంగా జరపాలి. కనీసంలోకి కనీసం మూణ్ణెల్లకొకటి జరిగితీరాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

ప్రణయ్ రాజ్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2013లో వికీపీడియా కార్యక్రమం నిర్వహించి, అలా వికీపీడియన్‌ని అయ్యాను

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

పెద్ది రామారావు, రాజశేఖర్ గారు, విష్ణువర్థన్ గార్ల వల్ల వికీకి పరిచయం చేశారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

కొత్తవాళ్ళు వాళ్ళ వ్యాసాలు రాసుకోవడానికే వస్తున్నారు. అదొక సమస్య.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?
భవిష్యత్తు
లో వికీ ఎలా ఉండాలంటే వికీలో రాస్తానన్నది గర్వంగా చెప్పుకునేలా ఉండాలి.

అందరికీ వికీ చేరాలన్న ఉద్దేశంతోనే నేను ప్రమోట్ చేశాను.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

యూజర్ గ్రూప్ ద్వారా కార్యక్రమం ప్రారంభిద్దామనుకుంటున్నాము. ప్రతీ ఆదివారం గంట, రెండు గంటల పాటు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిద్దామనుకుంటున్నాను. - వికీలో వ్యాస రచన మీదే కృషి ఉందన్న ప్రశ్న గతంలో వచ్చింది. నేను నిర్వహణా బాధ్యతలు పెంచాలనుకుంటున్నాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

ఆదిత్య పకిడె

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

వికీపీడియాలో 2017లో చేరాను. పుస్తకాలు చదువుతున్న క్రమంలో బ్లాగుల్లో రాసే అలవాటు ఉండేది. అలాంటి సమావేశానికి అటెండ్ అయినప్పుడు ప్రణయ్ రికార్డుకి మామిడి హరికృష్ణ గారు సన్మానించారు. అప్పుడు తెలుగు వికీపీడియాలో రాయడం ఎలా ఉండేదో తెలియదు. సన్మానం అయ్యాకా పవన్ గారిని అడిగాను. నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. రవీంద్రభారతిలో ఖాతా సృష్టించి వికీ గురించి వివరించారు. స్థానిక సంస్కృతిని ఫోటోల రూపంలో భద్రపరచడం ఇష్టం. ఆ క్రమంలో పనిచేస్తున్నాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

పవన్ సంతోష్‌ గారు, కశ్యప్ గారు, రహ్మానుద్దీన్ గారు, వీవెన్‌ గారు సాయపడ్డారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

లక్ష్యాలు ఉండాలి. సీఐఎస్, నిర్వాహకులు, ఫౌండేషన్ ప్రతీవారి లక్ష్యాలకు సహకరించాలి. సోదర ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. ఎంవోయూలు చేసుకుని సంస్థలతో కలసి పనిచేయొచ్చు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

మారౌండ్ టేబుల్లో గ్రామవ్యాసాలకు సమాచారం ఉంది, ఇంకా అభివృద్ధి చెందాలి. నేను ఆ వ్యాసాలు అభివృద్ధి చేయదలుచుకున్నాను. స్థానిక సంస్కృతిని భద్రపరిచే పని కొనసాగిస్తాను.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల్లో పాల్గొనాలని రామారావు గారు చెప్తారు. ఇకపై చేస్తాను.

బత్తిని వినయ్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

మొదట్నుంచి నాకు ప్రణయ్ బాగా సాయం చేశారు. అలానే వచ్చాను. అలానే చేశాను. ఆయన ఒకటి అంటే నేను 5 రాశా. ఇప్పుడు పదికి వెళ్ళాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రణయ్, యర్రా రామారావు గారు

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

కశ్యప్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఇతెలుగు గ్రూపులో నేను 2000 దశకంలో పనిచేసేవాడిని. తెలుగులో వెతికినప్పుడు ఖమ్మం చరిత్ర తప్పుగా ఉంది. అది నా మొదటి ఎడిట్. కానీ, ఏదో సమస్య అంది. సోర్సు సరిగా లేదని ఇబ్బంది అయింది. చర్చ మొదలుపెట్టారు. దానితో పేరు పెట్టడం మానేసి ఐపీ అడ్రస్‌తో రాయడం మొదలుపెట్టాను. ఐఐఐటీలో కన్సల్టెంటుగా ప్రారంభించాను.

ఎలా పరిచయమైంది?

ప్రస్తావించలేదు.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రస్తావించలేదు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?
తెలుగులో మానేద్దామనుకున్నది ఎప్పుడంటే ఐపీ మానేసి నా పేరుతో రాయడం మొదలుపెట్టినప్పుడు ఒకసారి అనిపించింది.
వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ఓపెన్‌నెస్ నేను బాగా ఇష్టపడతాను. తెలుగు వికీపీడియా గురించిన వ్యాసంలో వ్యక్తుల గురించి ఎక్కువ ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

ప్రస్తావించలేదు.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

జనార్దన్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

తెవికీలో నేనే రాసేస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో ఎడిటింగ్ మొదలుపెట్టాను. స్వతాహాగానే ప్రారంభమయ్యాను. నాకేమీ ఇంకా తెలియదు. ఎఫ్బీ, ట్విట్టర్ కూడా వాడను. ఫోన్ ద్వారానే నేను అంతా చేస్తున్నాను. - ఇక్కడ ఉండేవారిలో ఆర్నెల్ల పసిబాలుడిని. ఆగస్టు 5న ప్రారంభించాను. నా ప్రయాణం ఇలా మొదలైంది.

ఎలా పరిచయమైంది?

నేను ఆకాశవాణి అభిమానిని. పాటలు, రచయితలు, హీరోహీరోయిన్ల వివరాలు నాకు ఇష్టం. తెవికీలో ప్రత్యేక రోజుల కోసం వెతుక్కునేవాడిని. ఆకాశవాణిలో గాయకుల వర్ధంతి, జయంతి మెన్షన్ చేసి పాటలు అడిగితే చాలా ఇష్టపడేవారు. అందువల్ల తెవికీ వాడేవాడిని.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

వ్యక్తిగతంగా ఫలానా పేరని కాదు కానీ కొంతమంది మెసేజులు పెట్టారు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

ప్రస్తావించలేదు.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?
నెల్లూరు, కడప, అనంతపురం వంటి ప్రాంతాల వారెవరూ ఇక్కడ లేరు. అక్కడివారిని పరిచయం చేసి విస్తృతంగా కార్యక్రమాలు చేయాలన్నది.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

ప్రస్తావించలేదు.

చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

చర్చల వరకూ ఇంకా ఎదగలేదు.

మహేష్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

ఇంగ్లీష్‌లో ఒక తప్పుతో ప్రారంభించాను. Vin09 అన్న వాడుకరి గ్రామాలు, మండలాలకు సంబంధించి చాలా కృషిచేశారు. మొదట్లో అతనితో గొడవ. అతనెవరో తెలుసుకోవడానికి చాలా ప్రశ్నలు అడిగేవాడిని. చాలా సౌమ్యంగా సమాధానాలు ఇచ్చాడు.

ఎలా పరిచయమైంది?

గూగుల్ అనువాదం వాడుతూ చూస్తే వికీపీడియాలో తెలుగు ఉంది. అనువాద వికీపీడియా అనుకున్నాను. కానీ, చూస్తే చరిత్రలో తేడాలున్నాయి. అప్పుడు ఇది వేరే వ్యాసం అని అర్థమైంది.

మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రస్తావించలేదు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

తెలుగుకు సంబంధించిన వ్యాసాల్లో సమాచారం దొరకదు, మూలాలు దొరకవు. కాబట్టి, స్వంత పరిశోధన చేస్తాం. మూలాలు దొరకాలి.
భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

అవుట్‌రీచ్ కార్యక్రమాలు జరగాలి. నాణ్యత కూడా పెరగాలి. - మంచి వ్యాసాలు ఉండాలి.

వచ్చే సంవత్సరంలో మీరు ఏమేం చేద్దామనుకుంటున్నారు?

(ఒక వంద వ్యాసాలు రాయడం/కనీసం ఒక 20 మంచి వ్యాసాలను "మంచి వ్యాసం" ప్రమాణాలకు చేర్చడం/కనీసం 200 వ్యాసాల్లో భాషా దోషాలను సరిదిద్దడం/.. ఇలాంటివి) -

తెలుగు వ్యాసాలేమైనా ప్రతీదానిలో బొమ్మ ఉండాలన్నది నా టార్గెట్.
చర్చల్లో పాల్గొనేందుకు ఇబ్బందులేమైనా ఎదురౌతున్నాయా? అవి ఏమిటి?

ప్రస్తావించలేదు.

రాజశేఖర్

[మార్చు]
మీ వికీ ప్రయాణం గురించి
ఎప్పుడు మొదలు పెట్టారు?

2007లో మొదలుపెట్టాను.

ఎలా పరిచయమైంది?
పిల్లల హోమ్ వర్కు కోసం వెతుకుంటే దక్షిణ కొరియా గురించి వెతకాల్సి వచ్చింది. ఇంగ్లిష్ వికీపీడియా అలా చూశాను. వెతుకుతూంటే మా ఊరి గురించి వివరాల్లేవు. ఇంగ్లిష్‌లో రాయడం మొదలుపెట్టాను.
మొదట్లో ఎవరైనా సాయపడ్డారా? ఎవరు?

ప్రస్తావించలేదు.

వికీలో రాయడం మానేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు?

ప్రస్తావించలేదు.

వికీలో మీకు ఏమి నచ్చలేదు?

వ్యక్తుల గురించి కాదు, అంశం గురించి మాట్లాడాలి. అవి ఎలా ఉంటే బాగుండేది? (పరిష్కార మార్గం చెప్పాలన్నమాట) -

పది పుస్తకాలు పూర్తిచేశాకా కామన్స్‌లో తీసేశారు. పవన్ సంతోష్‌ సహాయంతో మళ్ళీ కొన్ని పుస్తకాలు స్థాపించగలిగాము.

భవిష్యత్తు
భవిష్యత్తులో వికీలో ఏమి ఉండాలి, ఎలా నడవాలి, ఏం జరగాలి?

మెడికల్ ఫీల్డులో తయారుచేసిన వ్యాసాలు సైంటిఫికల్ వెరిఫైడ్ కాదు. పీర్ రివ్యూ అంటాము. ఆ రంగానికి సంబంధించిన నిపుణులు పరిశీలించి వ్యాసానికి గుర్తింపు ఇవ్వాలి.