Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/C.Chandra Kanth Rao

వికీపీడియా నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (15/02/08) ముగింపు తేదీ :20:28 22 ఫిబ్రవరి 2008 (UTC) C.Chandra Kanth Rao (చర్చదిద్దుబాట్లు)

ప్రియమైన తెలుగు వికీపీడియన్లకు వందనములతో, నేను (సి.చంద్ర కాంత రావు) దాదాపు నాలుగు మాసాల క్రితం తెలుగు వికీపీడియాలో సభ్యునిగా చేరి అప్పటి నుంచి ఉడుతా భక్తిగా తెవికీకి నావంతు సహకారాన్ని అందిస్తున్నాను. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు తెవికీ నిర్వాహక హోదా నియమాలను (వెయ్యి దిద్దుబాట్లు మరియు మూడు మాసాల అనుభవం) నేను పూర్తి చేసుకున్నందున, ఇకపై కేవలం సభ్యునిగానే కాకుండా నిర్వాహకునిగానూ నా సేవలందించాలనే కృతనిశ్చయముతో ఉన్నాను. కాబట్టి నేను నిర్వాహక హోదాకై స్వీయప్రతిపాదన చేస్తున్నాను (ముందుగా నా నిర్వాహక హోదాకై చర్చ లేవనెత్తిన బ్లాగేశ్వరుడు గారికి మరియు మద్దతు పలికిన వైజాసత్య గారికి కృతజ్ఞతలు). నేను తెవికీ వృద్ధికి తోడ్పడుతున్నాననీ, నిర్వాహక హోదాకై ప్రతిపాదిస్తున్న స్వీయప్రతిపాదన సమంజసమేనని మీరు భావిస్తే నాకు మద్దతు తెలపండి. అలా కాకుండా నేను తెవికీ నియమనిబంధలను ఉల్లంఘించినట్లుగాను, నేను నిర్వాహకునిగా పనికి రాను అని మీరు భావిస్తే వివరణలతో సహా నా ప్రతిపాదనను తిరస్కరించనూ వచ్చు.C.Chandra Kanth Rao 20:28, 15 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఓటింగు ఇంతటితో ముగిసింది. తత్ఫలితంగా చంద్రకాంతరావు గారు నిర్వాహకులయ్యారు --వైజాసత్య 18:19, 25 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు ఇచ్చేవారు
  • చంద్రకాంత్ తెలుగు వికీని ఇప్పటికే ఎంతో పరిపుష్టం చేశాడు. నిర్వాహక హోదాను ఒక బాధ్యతగా తలకెత్తుకోవాలని ముందుకు రావడం ముదావహం. అంతదుకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. --కాసుబాబు 08:22, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • చంద్రకాంత్‌గారు, నిర్వహణ భాద్యతలను స్వీకరించడానికి తానుగా ముందుకు రావడానం ఎంతో శుభసూచకం. నేను గమనించినంత వరకూ ఆయన ఏదయినా మొదలు పని పెట్టే ముందు, ఇప్పటివరకూ అందులో జరిగిన దానిని క్షుణ్ణంగా పరిశీలించి, ఏ విధం ముందుకుసాగాలో తెలుసుకుని ఆ తరువాతే, పనులను చేయడం మొదలు పెడుతున్నారు. ఇటువంటివారు తెలుగు వికీపీడియాలో నిర్వహణ భాద్యతలను స్వీకరించడానికి నేను పూర్తిగా అంగీకారాన్ని తెలుపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:44, 16 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  • చంద్రకాంత్ గారు నిర్వాహక భాధ్యతలు సమర్థవంతంగా చేయగలరు.నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. --సభ్యులు: స్వరూప్ కృష్ణ
  • చంద్రకాంత్ గారి అభ్యర్ధనకు నా మద్దతు తెలుపుతున్నాను.ఆయన తేవీకీ కోసం చక్కగా కృషి చేస్తున్నారు.తేవీకీకి మంచి వ్యాసాలను అందించారు.

--t.sujatha 07:32, 19 ఫిబ్రవరి 2008 (UTC)

  • చంద్రకాంత్ గారికి నా మద్దతు తెలియచేస్తున్నాను. రవి వల్లూరి.
  • చంద్రకాంతరావు గారు, చక్కని విచక్షణతో తెలుగు వికీపీడియాను నిర్వహించగలరని నా పూర్తి నమ్మకముతో ఈయన అభ్యర్ధిత్వానికి మద్దతు పలుకుతున్నాను --వైజాసత్య 17:24, 20 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకించేవారు
తటస్థులు