Jump to content

వికీపీడియా:ప్రచురణ కోసం/వికీపీడియాలో రచనలు చేయుట

వికీపీడియా నుండి

వికీపీడియాలో రచనలు చేయుట

అంతర్జాల విజ్ఞానసర్వస్వములో విషయాలను అభివృద్ధి చేయుటకు మార్గదర్శిని

నమస్తే - నాపేరు వైజా సత్య - 2005 నుండి స్వచ్ఛందంగా వికీపీడీయాలో పనిచేస్తున్నాను - ఇప్పుడు వికీపీడియా గురించి నేను మీకు వివరించబోతున్నాను.

తెలుగు కంటే ఆంగ్లంలో బాగా పట్టు ఉన్నా, మాతృభాషపై అభిమానంతో తెలుగు వికీపీడియాలోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. మంచి పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాయటం ఇష్టం. మరుగునపడిపోయిన వ్యక్తులు, ఘటనల గురించి వెలికితీసి అందరికీ అందించటం నాకు సంతృప్తినిస్తుంది. అందుకే సాధారణంగా విస్మృత చారిత్రక వ్యక్తులను నా వ్యాసాలకు వస్తువులుగా ఎంచుకుంటూ ఉంటాను. వృత్తి రీత్యా పరిశోధకుణ్ణి, ప్రవృత్తి రీత్యా శోధకుణ్ణి. ఇవి రెండూ కలిసి నన్ను వికీపీడియన్‌ని చేశాయి.

ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉచితంగా, స్వేచ్ఛగా, సమస్త జ్ఞానాన్ని పంచుకోవడాన్ని ఊహించండి. అదే మా సంకల్పం -

2001 నుండి ప్రపంచం నలుమూలలకు చెందిన సభ్యుల కృషితో ముందుకు సాగుతున్న వికీపీడియా, సోదర వికీమీడియా ప్రాజెక్టుల లక్ష్యం ఇదే. సమస్త విజ్ఞానాన్ని ఒకచోట చేర్చేందుకు చాలా మంది మానవుల విజ్ఞానం కావాలి, మీదికూడా!

దీనిలో వున్నవి:

ఈ మార్గదర్శిని మీరు వికీపీడియాలో ఎలా కృషి చేయొచ్చో క్రమంగా తెలుపుతుంది.

ఇందులోని ప్రధాన విషయాలు -

  • వికీపీడియా అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది
  • వికీపీడియా రూపం గురించి
  • వికీపీడియాలో ఎలా కృషి చేయగలరు
  • వికీపీడియాను నమ్మదగ్గ సమాచార భాండాగారంగా నిలిపే పాలసీలు
  • వికీపీడియాలో విజువల్ ఎడిటర్ లేక వికీ మార్కప్‌తో సులభంగా మార్పులు చేయడం
  • సమాచారాన్ని ఎలా చేర్చవచ్చు
  • సహసభ్యులతో సంప్రదించేందుకు నడవడి.

వికీపీడియా అంటే ఏమిటి?

సహకార పద్ధతిలో కృషిచేసే ప్రాజెక్టుల్లో వికీపీడియా అతిపెద్దది. వందలాది భాషలలో, లక్షల వ్యాసాలతో గల వికీపీడియాను కోట్ల మంది ప్రతిరోజు చదువుతుంటారు.

వికీపీడియాలో ఇప్పటికే పలువ్యాసాలు ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలపై వికీపీడియాల వ్యాసాలు అంతంతమాత్రంగా ఉన్నాయి, కొన్నిటిపై అసలే లేవు. చిన్న వ్యాసాలను విస్తరించడం, కొత్త వ్యాసాలు సృష్టించడం, పాత సమాచారాన్ని ప్రస్తుత సమాచారంతో మార్చడం వంటివి మీరు చేయొచ్చు, ఇటువంటివాటికై వికీపీడియా మీలాంటివారిపై ఆధారపడుతుంది. మీ వికీ కృషి వందలూ, వేలూ, ఒక్కోసారి లక్షలాది ప్రజలకు అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది.

మీరు ఎప్పుడైతే వికీపీడియాలో మార్పు చేయడం ప్రారంభిస్తారో అప్పటి నుండి లక్షల మంది ఉన్న - వికీపీడియా సభ్యుల సముదాయంలో ప్రవేశిస్తున్నారన్నమాట. వీరంతా తమ విజ్ఞానాన్ని స్వేచ్ఛగా, ఉచితంగా వికీపీడియా ద్వారా ప్రపంచ ప్రజలకు అందిస్తున్నారు.


వికీపీడియాలో మీ కృషి అంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దానిని సహ సభ్యులు దిద్దుబాట్లు చేసేందుకు, స్వేచ్ఛా ఉచిత లైసెన్సుల ఆధారంగా తిరిగి ఉపయోగించేందుకు వీలుంటుంది

WP:STATS

వికీపీడియా ప్రస్తుత గణాంకాలు చూడాలనుకుంటున్నారా? బొమ్మలో చూపినట్లు వెతుకుపెట్టెలో WP:STATS టైపు చేసి ఎంటర్ కీ నొక్కండి . WP:STATS అన్నది వికీపీడియాలో దగ్గరి దారి అనమాట . ఇలాంటి దగ్గరిదారులను వెతుకుపెట్టెలో వాడి కావలసిన పేజీలను సులువుగా చేరుకోవచ్చు. ఈ కరపత్రంలో దగ్గరి దారులను | దగ్గరిదారి WP:STATS లాగా చూపిస్తాం.

వికీపీడియా రూపం

అరటి వ్యాసం తొలి భాగం

వికీపీడియాలో కృషి ప్రారంభించేందుకు వికీపీడియా రూపం గురించి తెలుసుకోవడం ఉపకరిస్తుంది.

చర్చ ప్రతి పేజీకి చర్చా పేజీ వుంటుంది. దీనిలో సభ్యులు పేజీకి సంబంధించిన వ్యాఖ్యలు, సలహాలు, చర్చలు చేయవచ్చు. త్వరగా సహాయం పొందాలంటే మీ వ్యాఖ్యతో పాటు {{సహాయం కావాలి}} అని చేర్చాలి లేక సంబంధిత సభ్యుల పేర్లకు వికీలింకులివ్వాలి.

  • రచ్చబండ

ఇక్కడ స్థానిక వికీపీడియాకు సంబంధించిన చర్చలు, ప్రకటనలు వంటివి ఉంటాయి.

  • సహాయసూచిక

వ్యాసరచనలో పనికివచ్చే మార్గదర్శక వ్యాసాలకు లింకులు ఉంటాయి. వ్యాసాల్లాగా వీటిని కూడా వికీపీడియా సభ్యులే రాశారు.

  • ఇటీవలి మార్పులు

వికీపీడియాలో ఎక్కడ, ఏ మూల అయినా ప్రస్తుతం జరుగుతున్న మార్పులు, చేర్పులు ఇక్కడ చూడొచ్చు. నిర్వహణ, సహకారం వంటివాటి కోసం వికీపీడియన్లు దీన్ని చూస్తూంటారు.

  • సంప్రదింపు పేజీ

ఇక్కడ వికీ సంస్థతో సంప్రదింపులు చేయడానికి అవసరమైన అంశాల వివరణ ఉంటుంది.

  • పరికరాల పెట్టె

ఈ విభాగంలో పేజీ గురించి, దాని చరిత్రను గురించి అదనపు సమాచారాన్ని పొందటానికి ఉపకరణాలుంటాయి.

  • దస్త్రం ఎక్కింపు

బొమ్మలు ఫైళ్లు చేర్చేందుకు

  • ముద్రించండి/ఎగుమతి చెయ్యండి

ఒక పుస్తకాన్ని సృష్టించండం, పి.డి.ఎఫ్ క్రింద దిగుమతి చేసుకోవడం వంటివాటికి పనికివస్తుంది

  • భాషలు

ప్రస్తుత పేజీ ఇతర భాషల - 280 పైగా - వికీపీడియాల్లో పేజీ ఉంటే, వాటికి లింకులు

  • భాషల అమరిక

ఈ అమరిక ద్వారా వికీపీడియాలో మెనూలకు, సందేశాలకు వాడే భాషనీ, టైపు చేయుటకు కీ బోర్డు నమూనానీ ఎంపికచేయవచ్చు

అరటి తొలి భాగం (WP:STATS మానవీయంగా చేర్చాలి)
  • సవరించు

చాలామంది పాఠకులు దీనిని గమనించరు, కానీ వ్యాసానికి ఇది చాలా ముఖ్యమైనది. పైనవున్న సవరించు బటన్ నొక్కి వ్యాసం మొత్తాన్ని కానీ, కింద విభాగం శీర్షిక పక్కన కనబడే సవరించు బటన్ నొక్కి ఆ ‌విభాగాన్ని కానీ సవరించండి.

  • చరిత్రను చూడండి

వికీపీడియా వ్యాస చరిత్రలో సృష్టించినప్పటినుండి జరిగిన ప్రతిమార్పు వుంటుంది. ఎవరు ఎప్పడు దేనిని మార్చారో చూడొచ్చు, ఎంచుకున్న మార్పుల మధ్య తేడాలూ చూడొచ్చు.

  • ఖాతాను తెరువు

మీరింకా తెరవకుంటే, ఖాతాను తెరవండి. ఖాతాతో, మీరు చేసే కృషిని, పురోగతిని గమనించడం సులభం, మీ కృషికి తోడ్పాటుగా సహ సభ్యులు ప్రత్యుత్తరమిచ్చినప్పుడు సూచనలు అందుతాయి

  • వెతుకు

ఏదైనా పేజీని వెతకడానికి దాని పేరును కానీ, వ్యాసంలో ఉండే పదాన్ని గానీ ఇక్కడ టైప్ చేసి వెతకండి. ఇక్కడ దగ్గరదారుల ద్వారా కూడా పేజీకి చేరుకోవచ్చు. ఉదాహరణకు WP:HELP అన్న దగ్గరదారి మీకు ఉపకరిస్తుంది

    • తెలుగులో వెతుకేందుకు

భాషా అమరికలపై నొక్కి కీ బోర్డు నమూనాను లిప్యంతరీకరణకు (బొమ్మ కొరకు పే. 12 చూడండి) మార్చుకోండి. ఆ తరువాత ఆంగ్ల అక్షరాలు టైపు చేస్తే తెలుగులోకి మారతాయి (ఉదా te టైపు చేస్తే తె గా కనబడుతుంది). వ్యాసాల్లో కనపడే లింకులు (నీలి అక్షరాల్లో), కింద ఉండే వర్గాలపై నొక్కినా మీరు కావాల్సిన వ్యాసాన్ని వెతకొచ్చు. మరింత సహాయం కొరకు | దగ్గరి దారి WP:TH

కృషి రకాలు

వికీపీడియా పేజీ అభివృద్ధి కృషి

స్వచ్ఛంద కార్యకర్తలు రకరకాలుగా వికీపీడియాలో పనిచేస్తారు. వికీపీడియా ఇలా వుండడానికి అవసరమైన పనులు అవి చేయడంలో కొందరు సీనియర్ వికీ సభ్యులను చూడండి

వికీలో విశేష కృషి చేయుచున్న మహిళా వికీపీడియన్లు

  • టి.సుజాత - అనువాద వ్యాసాలపై కృషి
  • విజయా విశ్వనాధ్ - జీవ శాస్త్ర వ్యాసలు
  • మీనా గాయత్రి - అనువాద వ్యాసాలు, ప్రాజెక్టులు


వికీపీడియాలో మన తోడ్పాటు ఎందుకు ? - వికీ ప్రముఖుల అభిప్రాయాలు

డా.రాజశేఖర్ -


సి.చంద్రకాంత రావు -

నలుగురితో కలిసి పనిచేస్తూ, నలుగురితో పంచుకుంటూ, నలుగురుకి సహాయపడుతున్నామన్న సంతృప్తిని పొందుతూ, మనకు తెలిసిన విజ్ఞాన విషయాలను చేర్చడానికి ఇంతకన్నా అనువైన వేదిక మరేది లేదు.

అర్జునరావు -


వీవెన్ -

వికీపీడియాలోని సమాచారం స్వేచ్చాయుతమయినది. సమాచారానికి విలువ అది స్వేచ్చగా ఉన్నపుడే. నేను ఇందులో తోడ్పడే ప్రధాన కారణం ఇదే.

చదువరి -

నాకు అన్నిటికంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎంతో స్వేచ్చ ఉంది ఇక్కడ, ఎవరైనా రాయచ్చు. వెంటనే రాయడం మొదలు పెట్టాను

కట్టా శ్రీనివాసరావు -

ఒక్కడిగా చేసే కృషి నలుగురి దగ్గరకు చేరుకోవడమే కాకుండా, మరో నలుగురు మన ప్రాజెక్టులోనే చేదోడుగా నిలుస్తారనే భరోసా నాకు వికీపిడియాలో దొరకింది. పైగా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ బ్లాగులకంటే ఎక్కువగా వుండటంతో కావలసిన వారికి త్వరగా చేరుతుంది.

వేమూరి వెంకటేశ్వరరావు -

నిఘంటువు నిర్మించినవాడిని కనుక వికీపీడియా మీద దృష్టి పడడం సహజం. మొదట్లో తెలుగు వికీపీడియాలో తరచుగా కనిపించే దోషాలు (భాషాదోషాలు, వర్ణక్రమ దోషాలు, విరామస్థానాల వాడుకలో దోషాలు) పంటికింద రాయిలా కనిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేక సవరించడం మొదలు పెట్టేను. తరువాత వికీపీడియాలో రాయడం ఒక వ్యసనంలా మారిపోయింది.

కశ్యప్ పలివెల -

వికీపీడియాలోని వ్యాసాలు మామూలు విజ్ఞాన సర్వస్వ వ్యాసాల కంటే ఉన్నతంగా, సౌక్ర్యవంతంగా విజ్ఞానదాయకంగా ఉంటాయి.ఇలా మన అందరిఅవసరం వికీపీడియాలో చురుగ్గా పాల్గొనవలసిన అవసరం ఉంది. భావి తరాల తెలుగువారికి తెలుగులో విజ్ఞానాన్ని అందించేందుకు అందరూ నడుం కట్టాల్సి ఉంది

నిడదవోలు మాలతి -

తెవికీ అందిస్తున్న సమాచారంలో పొరపాట్లు ఉన్నాయని కొందరి అభియోగం. వారికి నా సమాధానం - పొరపాట్లు రావడానికి అనేక కారణాలు. తెవికీ నిర్మాణం ప్రారంభదశలో ఉంది ఇంకా. చెయ్యవలసింది చాలా ఉంది. తప్పులు చూసినవారు తెవికీ నిర్వాహకులకు సరైన సమాచారం సప్రమాణంగా అందిస్తే వారు సరి దిద్దగలరు. ఇది ఒక్కరి కానీ ఒక చిన్న గుంపువారి కానీ పని కాదు. తెలుగువారందరూ యథాశక్తి పాల్గొని విజయవంతం చేయవలసిన బృహత్కార్యం. నామటుకు నేను గట్టిగా చెప్పగలను తెవికీ నా సాహిత్యకృషికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపకరించిందనీ, అందుకు నిర్వాహకులు అభినందనీయులనీ.

సవరణకు సిద్ధమవడం

వికీపీడియా సమాచారం నమ్మదగ్గదిగా, ఉపయోగకరంగా ఉండడానికి చాన్నాళ్ళ నుంచీ చర్చల ఆధారంగా పాలసీలను, మూల సూత్రాలను అభివృద్ధి చేశాం.

వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చు. అలా చేసేప్పుడు అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలు ఉన్నాయి. మీరు దిద్దుబాట్లు చేసే ముందు అతిముఖ్యమైన అంశాలలో కొన్నిటిని గమనించండి:

నిష్పక్షపాత ధోరిణి

వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయాలి. ఏ పక్షం ప్రధానంగా భావించక, పక్షపాతం లేకుంటా మరియు ఖచ్చితమైన విశ్వసనీయమైన మూలాలు ఆధారంగా విషయంపై అన్ని దృక్కోణాలు వివరించాలి. పిడివాదనలు లేక ఒక దృక్కోణాన్ని సమర్థించేలా వ్రాయడం వికీపీడియా వ్యాసాల్లో వుండదు.

మౌలిక పరిశోధనలకు స్థానంలేదు

తేలికగా చెప్పాలంటే, వికీపీడియా మౌలిక ఆలోచనలు చేర్చేందుకు తగిన స్థలం కాదు. ఇప్పటికే విశ్వసనీయ మూలాల్లో పేర్కొన్నదాన్ని సంగ్రహంగా వికీపీడియాలో రాయాలి. వ్యాసాలలో కొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు. ఇప్పటికే ప్రచురితమైన సమాచారన్ని కలపడం, విశ్లేషించి మూల వనరుల్లో ఉన్నదానికి మించి మరో సారాంశానికి చేరుకునేలా రాయకూడదు.

కాపీ హక్కులు, గ్రంథచౌర్యము

సభ్యులు చేర్చినది ఏదైనా స్వేచ్ఛా లైసెన్స్‌తో విడుదలవుతాయి కాబట్టి ఎవరికీ ఏ వ్యాసంపై హక్కులు లేవు. మీ కృషిపై నిరంతరం దిద్దుబాట్ల చేయడం, స్వేచ్ఛగా పంచుకోవడం జరుగుతుంది. కాపీహక్కులు ఉన్న వనరుల నుంచి కొన్ని క్లుప్త వ్యాఖ్యలు తప్పించి వికీపీడియాలో చేర్చకూడదు. నేరుగా కాపీ చేయడం కానీ, చాలా పోలికలున్న రీతిలో చేర్చటం, గ్రంథ చౌర్యం, కాపీ హక్కుల వుల్లంఘన వికీపీడియా కృషిని చెడగొడతాయి. వికీపీడియాలో చేర్చవలసిన సమాచారం మీ స్వంత పదాలలో వ్రాయాలి. (ప్రజోపయోగ పరిధిలోనూ, స్వేచ్ఛగా లైసెన్స్ లోనూ ఉన్న విషయాలు వికీపీడియాలో సరియైన మూలాలను పేర్కొంటూ వాడవచ్చు)

విశ్వవసనీయమైన వనరులు

వికీపీడియాలో గల సమాచారం విశ్వసనీయమైన, ప్రచురితమైన వనరుల నుంచి ధృవీకరించేందుకు తగినదై వుండాలి. మీరు వాడే వనరుల వివరాలు వ్యాసంలో పేర్కొనాలి. అలా అయితే ఇతరులు వాటిని పరిశీలించగలగుతారు. మూలాలుగా పేరొందిన థర్డ్ పార్టీ వనరులు (అంటే ఎవరి గురించి రాస్తున్నామో వారే ఇచ్చిన వివరాలు కాకుండా) అంటే విద్యాపరమైన ప్రచురణలు, సోదర సమీక్ష (పీర్ రివ్యూ) కల జర్నల్స్, ప్రాధాన్యత కల దృక్కోణాలన్నీ ప్రచురించే పత్రికలు, పుస్తకాలు వంటివి వాడితే మంచిది.

వైరుధ్యాసక్తులు

మీరు పనిచేయుచున్న సంస్థ లేక మీకు ఉపాధి కల్పించినవారి గురించిన విషయాలపై పై మూలసూత్రాలకు, మీ ఆసక్తులకు వైరుధ్యం ఉన్నప్పుడు, వాటి గురించి వ్యాసాలను వ్రాయవద్దు.

విజువల్ ఎడిటర్ తో సవరణలు

విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ -చొప్పింత అదేశాలవరుస
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూలము సవరించు
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూస వాడుక సవరించు

‌విజువల్ ఎడిటర్‌తో స్వరణలు అప్పటికప్పుడే తెలిసేలా జరుగుతాయి. మీరు చేసే సవరణలు చేసేటప్పుడే కనబడతాయి కాబట్టి , విషయం పై ధ్యాస పెట్టవచ్చు. ఏ భాగాలను మార్చాలో వాటిపై నొక్కి సవరణ ప్రారంభించండి.

సవరణల పనిపట్టీ

ఈ పనిపట్టీ ద్వారా రూపం మార్చటము, వనరులు బొమ్మలు చేర్చటం మరియు పేజీలో ప్రత్యేక లక్షణాలుగలవైన మూసలను (వ్యాస ప్రారంభంలో వుండే సమాచారపెట్టెలు లాంటివి) మార్చడం చేయవచ్చు. సవరణ పూర్తయిన తర్వాత పేజీ భద్రపరచు రెండు సార్లు నొక్కడం ద్వారా రాసినది భద్రపరచబడుతుంది.

ప్రవేశిక

మొదటి వాక్యం విషయానికి నిర్వచనం ఇస్తుంది మరియు ప్రవేశిక వ్యాసంలోని విషయాలను సంగ్రహంగా తెలుపుతుంది. ఈ ఒక్క విభాగానికే శీర్షిక వుండదు.

సమాచారపెట్టె

చాలా వ్యాసాలకు సమాచారపెట్టెలలో వ్యాసానికి సంబంధించిన ముఖ్యాంశాలు చేర్చుతారు. ఉదాహరణకు దేశం, నగరాలు, గ్రామాలు వంటి వ్యాసాలకు కొన్ని గణాంక వివరాలను, ప్రదేశ వివరణా మ్యాపులు, చిహ్నాలు, ఛాయాచిత్రాలు, ఇతరవివరాలు వుంటాయి.

బొమ్మలు

ఉచిత లైసెన్స్ లో విడుదల చేసిన బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళను వికీమీడియా కామన్స్ లేక స్థానిక ప్రాజెక్టు నుండి చేర్చవచ్చు.

వ్యాసంలో విషయ వివరణల భాగం

శీర్షికలు, కొన్ని సార్లు ఉపశీర్షికలు వ్యాసాన్ని విభాగాలుగా విభజిస్తాయి, వాటితో విషయసూచిక తయారవుతుంది. ఒక్కో విభాగం సాధారణంగా ఆ విభాగంలోని ముఖ్యాంశం తెలుపుతుంది. అందువలన చదువరులు వారికి కావలసిన సమాచారం కొరకు నేరుగా ఆయా శీర్షికలకు వెళ్లవచ్చు.

మూలాలు

వ్యాసంతో పాటుగా వరుసలలో మూలాల గుర్తులు, ఆ పాఠ భాగానికి మూలం తెలుపుతాయి. మూలాల వివరాలు వ్యాసం చివరలో మూలాల విభాగంలో వ్యాసానికి పాదసూచికలుగా కనబడతాయి.

మూస

మూసలనబడే తిరిగి వాడగలిగే భాగాలు, సమాచారాన్ని ప్రామాణికంగా ప్రదర్శించడానికి, వ్యాస సమస్యలను వీక్షకులను హెచ్చరిక సూచన ద్వారా తెలుపడానికి వాడతారు.

అనుబంధాలు మరియు పాదసూచికలు

వ్యాసంలో ముఖ్య భాగాల తరువాత విభాగాలలో అదనపు సమాచారంగా సంబంధిత ఇతర వ్యాసాల లింకులు (ఇవీ చూడండి) మరియు మూలాలు వివరాలు( మూలాలు) మరియు మరింత సమాచారానికి ఇతర లింకుల జాబితా వుంటాయి.

వికీ కోడ్ (మార్కప్) తో సవరణ

వ్యాస తొలిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
వ్యాస మధ్యభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
వ్యాస చివరిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)

వికీపీడియా వ్యాసాలను దిద్దుబాటు చేయడానికి తొలినుంచీ వాడే రూపం వికీ కోడ్(మార్కప్) . కొన్ని బ్రౌజర్లలో ఇదొక్కటే పనిచేస్తుంది . ఒక వ్యాసానికి వికీ మార్కప్ క్రింద చూపించబడింది. దీనిలోని కనబడే ఆప్షన్లు ఎన్ని విజువల్ ఎడిటర్‌లో కనబడతాయో చూడండి.

బొమ్మ

వికీ కామన్స్ లో కానీ, స్థానికంగా కానీ ఉన్న ఫొటో పేరుకు ఇరువైపులా రెండు స్క్వేర్ బ్రాకెట్లు పెట్టి వ్యాసంలో చేరిస్తే బొమ్మ చేరుతుంది. పైప్ చిహ్నం (|) ఉపయోగించి బొమ్మ ప్రదర్శితమయ్యే తీరుని మార్చవచ్చు. సామాన్యంగా thumb అని వాడితే బొమ్మల చిన్నరూపంలో, క్రింద ఒక వివరంతో ప్రదర్శితమవుతాయి. [[File:Example.jpg|thumb|వివరం]]

బొద్దు పాఠ్యం

పాఠ్యానికి ముందు, తరువాత మూడు సింగిల్ కొటేషన్ మార్కులు పెడితే బయటకు బొద్దుపాఠ్యం కనిపిస్తుంది. వ్యాస ప్రారంభంలో వ్యాసం పేరుకి సాధారణంగా బొద్దు పాఠ్యం వాడుతారు. '''బొద్దు పాఠ్యం'''

వాలు పాఠ్యం

పాఠ్యానికి ముందు, తరువాత రెండు సింగిల్ కొటేషన్ మార్కులను పెడితే బయటకు వాలుపాఠ్యం కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి వాలుపాఠ్యం వాడతారు ''వాలు పాఠ్యం''

అంతర్వికీ లింకులు

ఒక పదబంధం ముందు వెనక రెండు స్క్వేర్ బ్రాకెట్లు పెడితే ఆ పేరుతో ఉన్న వ్యాసానికి లింకు ఏర్పడుతుంది. మూసే స్క్వేర్ బ్రాకెట్ ముందు పైప్ పెట్టి తరువాత పదబంధం చేరిస్తే లింక్ కనబడే పాఠ్యం మారుతుంది. [[ వ్యాసం పేరు| లింకుగా కనబడే పాఠ్యం]]

మూస

మూసలను వాడేందుకు రెండు బ్రేసులను మూస పేరుకి ముందు వెనుక వాడతారు. తిరిగి తిరిగి వాడే భాగాలు, విస్తృత ప్రయోజనాలకు మూసలు ఉపయోగం. మూసపేరు తరువాత పైప్ తో వేరు చేస్తూ పరామితులను ప్రవేశ పెట్టవచ్చు. వీటిని వాడితే మూస పనిచేసే విధానం లేక ప్రదర్శించే సమాచారాన్ని మార్చుతుంది. {{మూస పేరు|పరామితి}}

శీర్షిక

రెండు ఈక్వల్ టూ చిహ్నాల మధ్య ఉన్న పదబంధం రెండవ స్థాయి శీర్షిక అవుతుంది. మూడు ఈక్వల్ టూ చిహ్నాల మధ్య ఉంటే దానికి ఉపశీర్షిక అవుతుంది. ==రెండవ స్థాయి శీర్షిక==

మూలాలు (Citation)

<ref></ref> టాగ్ ల మధ్య మూలాలు చేరుస్తారు. అప్రమేయంగా వరుససంఖ్యతో ఇది పై సూచికలాగా కనబడుతుంది. మూలాల విభాగంలో వివరం కనబడుతుంది. <ref> మూలం</ref>

మూలాలజాబితా

మూలాల జాబితా టాగ్ లేదా సమానమైన మూస ఈ పాద సూచికలు కనపడాల్సిన చోట పెట్టాలి. సాధారణంగా వ్యాసం చివరిలో గమనికలు లేక మూలాల విభాగంలో వుంటుంది. <మూలాలజాబితా/>

వెలుపలి లింకులు

తెరిచే ఒక స్క్వేర్ బ్రాకెట్ తర్వాత యు.ఆర్.ఎల్‌(URL) చేర్చి తరువాత ఖాళీ అక్షరం మరియు సూచించేపాఠ్యం మరియు మూసే ఒక స్క్వేర్ బ్రాకెట్ సాధారణ హైపర్ లింకు తయారవుతుంది. సాధారణంగా వ్యాసంలో ముఖ్య భాగాలలో వాడరు. పాదసూచికలలో గాని బయటి లింకులు విభాగంలో వాడతారు. [http://www.example.com సూచించే పాఠ్యం]

వర్గాలు

వ్యాసానికి చివరగా వర్గం: తో ప్రారంభమయ్యే పదబంధం చుట్టూ రెండు స్క్వేర్ బ్రాకెట్లను చేర్చితే వ్యాసం ఆ వర్గంలోకి చేరుతుంది. ఒక విషయానికి సంబంధించిన వ్యాసాలను సమితులుగా నిర్వహించడానికి ఇవి ఉపకరిస్తాయి. [[వర్గం:వర్గం పేరు]]

మరింత మార్కప్ సహాయానికి, వికీ మార్కప్ పేజీ 15 లో చూడండి లేక వనరుల పేజీ చూడండి| దగ్గరిదారి WP:MARKUP

విషయాలను చేర్చుట (మెట్టు తరువాత మెట్టు విధంగా)

ఈ బొమ్మలలో వాడుకరి:Navvula bullodu సవరణలు ఏ విధంగా కొత్త సమాచారాన్ని నిమ్మ వ్యాసంలో చేర్చాడో వివరిస్తుంది.

వ్యాసం నవ్వుల బుల్లోడు మార్చటానికి ముందు....
...సవరణలను భద్రపరచిన తరువాత

ఈ బొమ్మ లో నవ్వుల బుల్లోడు చేర్చిన విషయం వాడిన వికీకోడ్(మార్కప్) కనబడుతుంది.

వ్యాస సవరణ చిత్రం

ఈ మెట్లు వాడి మీరు వికీపీడియా వ్యాసానికి విషయం చేర్చవచ్చు.

మెట్టు 1: మీరు అదనపు సమాచారం ద్వారా విస్తరించటానికి ఆసక్తి ఉన్న వ్యాసాన్ని ఎంచుకోండి.

మెట్టు 2: ప్రస్తుత వికీపీడియా వ్యాసం కంటే ఎక్కువగా వివరమున్న విశ్వసనీయమైన మూలాన్ని వెతకండి. దీనికి అంతర్జాలం శోధనా యంత్రం, స్థానిక గ్రంథాలయాలు, ఆంగ్ల భాషలో వ్యాసం(వున్నట్లైతే) యొక్క మూలాలు సహాయపడవచ్చు.2

మెట్టు 3: ఇప్పడు మొదలవుతుంది తమాషా భాగం. సవరించు అన్న బటన్ నొక్కండి! 3

మెట్టు 4: ఇప్పటికే లేని వివరాలను చేర్చండి. మీరు తెలుసుకున్న వనరులనుండి వ్యాసంలో చేర్చాలనుకున్న సమాచారాన్ని సంగ్రహరూపంలో మీ స్వంతపదాలకూర్పుతో చేర్చండి. 4

మెట్టు 5: మీరు కొత్తగా చేర్చిన పాఠ్య భాగానికి చివరలో, ఆధారమైన మూలపు వివరాన్ని చేర్చండి. సవరణ పనిముట్ల పట్టీ లో (వికీమార్కప్ లేక విజువల్ ఎడిటర్) మూలము అనే బొమ్మని నొక్కుటద్వారా మూలం వివరాన్ని చేర్చవచ్చు. శాశ్వతంగా వుండే అంతర్జాల వనరులైతే చిరునామా(URL)తో పాటు శీర్షిక, పరిశీలించిన తేదికూడా చేర్చండి. దినపత్రికలలో ప్రచురించే ప్రముఖ విషయాలైతే పత్రిక పేరు,ప్రచురణ తేది, సంచిక వివరాలు, విషయం శీర్షిక వివరాలు చేర్చాలి 5

మెట్టు 6: " సారాంశం" క్రింద ఉన్న పెట్టెలో మీ సవరణకు శీర్షిక వ్రాయండి. దీనిలో సమాచారం చేర్చినప్పడు +, తొలగించినప్పుడు - వాడడం సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశం సహాయంతో ఇతర సభ్యులు మీరు చేసిన దిద్దుబాటు గురించి సులభంగా తెలుసుకుంటారు.6. (విజువల్ ఎడిటర్ అయితే భద్రపరచు (మెట్టు 7 చూడండి) నొక్కిన తరువాత సారాంశం చేర్చాలి)

మెట్టు 7:ఇప్పుడిక భద్రపరిచే సమయం ఆసన్నమైనట్లే. పేజీని భద్రపరచు బటన్ నొక్కండి. (వికీమార్కప్)

ఒకవేళ పై అంశాలు చేసే క్రమంలో పొరపాటు ఏదైనా జరిగితే ఆందోళన పడకండి. తరువాత మీరు అదనపు దిద్దుబాట్లతో వాటిని సరిదిద్దవచ్చు లేకుంటే వ్యాసపు పూర్వపు స్థితికి తీసుకురావచ్చు.

వాడుకరి పేజీ మరియు వాడుకరి చర్చ పేజీలు

ఖాతా తెరచుట
కీబోర్డు నమూనా ఎంపిక
వాడుకరి ఆదేశాల వరుస
వాడుకరి పేజీ సృష్టించునప్పుడు కనబడే సందేశం
వాడుకరి పేజీ

ఖాతా తెరచునప్పుడు వచ్చే పెట్టెలో చేర్చవలసిన వివరాల బొమ్మ చూడండి. దీనిలో వాడుకరి పేరుని ఆంగ్లంలో వుంచుకోవటం (సంతకం తెలుగులో కనబడేటట్లు తరువాత అభిరుచులలో అమరిక ద్వారా చేసుకోవొచ్చు), ఈమెయిల్ చేర్చటం మంచిది. ఖాతా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా చేయటం లేదని నిర్ధారించటానికి కేప్చా అనగా వ్యక్తి మాత్రమే సులభంగా అర్ధం చేసుకోగల బొమ్మలోని అక్షరాలు సంబంధిత పెట్టెలో చేర్చాలని గమనించండి.

ఆ తరువాత భాష అమరికలలో మీకు కావలసిన కీబోర్డు నమూనా (ఆంగ్ల టైపు అనుభవమున్న వారికి లిప్యంతరీకరణ సులభంగా వుంటుంది.) దీనిలోకి మరియు ఆంగ్లంలోకి కంట్రోల్+M వాడి మారవచ్చు. కంప్యూటర్ పై తెలుగు కనబడితే వికీపీడియాలో అంతర్గత కీ బోర్డు విధానం వుంది. మీరిప్పటికే కంప్యూటర్ లో తెలుగు కీ బోర్డు వాడుతుంటే అదే కొనసాగించవచ్చు. మరింత సమాచారానికి దగ్గరిదారి WP:TH చూడండి.

వికీపీడియాలో వ్యాసాలే కాక ఇతర పేజీలు కూడా ఉంటాయి. మీరొక సారి దిద్దుబాట్లు ప్రారంభించిన తరువాత ఇతర సభ్యులు మీ గురించి కొంత తెలుసు కోవడానికి, మీరు మీ వాడుకరి పేజీ తయారు చేసుకోవాలనుకోవచ్చు. పుట పైభాగంలో కుడి వైపున ( ఒకవేళ మీరు ప్రవేశించి ఉంటే) మీరు మీ వాడుకరి పేరును చూడవచ్చు. మీరు మీ పేరుపై నొక్కి మీ వాడుకరి పేజీ చేరుకోవచ్చు. మీరు మీ వాడుకరి పేజీని సృష్టించుకోని పక్షంలో మీ పేరు నీలి రంగు కాక ఎర్ర రంగులో కనిపిస్తుంది.

ఇంకా సృష్టించక పోతే మీకు ఖాళీ పేజీ కనబడుతుంది. మీ గురించి మీరు రాసుకోవచ్చు. మీ ఆసక్తులు ఏమిటి ? మీకు సంబంధిచిన ఇతరవివరాలు ఇందులో వ్రాయవచ్చు. మీరు పేజీని భద్రపరచగానే మీ పేరు నీలి లింకుకు మారుతుంది.

మీతో ఇతరులు చర్చిండానికి అనువుగా మీకు ఒక చర్చా పేజి ఉంటుంది. దీనిలో ఇతర సభ్యులు మీకు సందేశాలివ్వవచ్చు. మీరు ఇతర సభ్యులతో సంప్రదించాలని అనుకుంటే వారి చర్చా పేజీలో ఒక సందేశం వ్రాయండి. మీరు తప్పక చర్చా పేజీలో మీ సందేశం తరువాత సంతకం చేయాలి. సవరణ పెట్టెలో వికీ సంతకం చేయడానికి ఉపకరించే చిహ్నంను గమనించండి. మీరు ఈ బటన్ నొక్కినటైతే (~~~~) ఇలా వరుసగా నాలుగు టిల్డేలు చేర్చబడతాయి. భద్రపరచిన తరువాత సందేశం తరువాత మీ పేరు, పంపిన తేదీ మరియు సమయం కనబడుతుంది.

గమనిక: వ్యాసానికి సంబంధించిన చర్చలు వ్యాస చర్చా పేజీలోనే చేస్తూ, సంబంధింత సహ సభ్యుల వాడుకరి పేజీలకు లింకులివ్వడం ద్వారా వారికి ఎకో వ్యవస్థ ద్వారా సందేశాలు చేరే విధానం వాడుకొనట మంచి పద్ధతి. వాడుకరి చర్చ పేజీలలో ఒక్కవాడుకరికి మాత్రమే సంబంధించిన విషయాలు చర్చించటం, చర్చ అంతా ఒకే చోట వుండడానికి చర్చ ప్రారంభించిన పేజీలో స్పందన వ్రాసి, ఎవరికైతే స్పందన రాస్తున్నారో వారి వాడుకరి పేజీని స్పందనలో లింకుగా చేర్చటం మంచి పద్ధతి.

చరిత్ర

వర్ణన

ఉత్పాదన

తెలుగు వికీపీడియాలోని మరో  వ్యాసానికి లంకె (అంతర వికీ లింకు)

[[విజయవాడ]]

విజయవాడ

శీర్షికకు భిన్నమయిన పాఠ్యంతో లంకె

[[హైదరాబాదు|రాజధాని]]

రాజధాని

వికీపీడియా వెలుపల పేజీలకు లంకె వేయడం (బయటి లింకులు)

[http://andhrabharati.com ఆంధ్రభారతి జాలగూడు ]

ఆంధ్రభారతి జాలగూడు

బుల్లెట్ జాబితా

*కృష్ణా

*గోదావరి

  • కృష్ణా
  • గోదావరి

క్రమ జాబితా

#ఆసియా

#యూరప్

  1. ఆసియా

  2. యూరప్

శీర్షికతో కూడిన బొమ్మ

[[Image:Example.png|thumb| బొమ్మశీర్షిక]]

బొమ్మశీర్షిక

చర్చల్లో సంతకం

~~~~

వాడుకరిపేరు (చర్చ) 04:50, 1 నవంబరు 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చేర్చడం

<ref>[http://example.org/ వివరణ పాఠ్యం. </ref>

[1]

మూలాలను వ్యాసం చివర చూపించడం

<references />

  1. వివరణ పాఠ్యం.

సముదాయం తో సంప్రదింపులు

వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్యలో సహ సభ్యునికి సందేశం పంపటానికి వారి వాడుకరి పేజీ కి లింకు ఇవ్వడం
వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్య (పై చిత్రంలో సవరణ కనబడేతీరు)

చూడండి! కొత్త సందేశం! ఎవరైనా మీ వాడుకరి పేరుని పేర్కొన్నప్పుడు, మీ సవరణకు కృతజ్ఞతలు తెలిపినప్పుడు, లేక మీ వాడుకరి చర్చా పేజీలో సందేశం చేర్చినప్పడు సందేశాల హెచ్చరిక ఎర్రరంగులో కనబడుతుంది.

ప్రతివ్యాసానికి దాని చర్చాపేజీ వున్నది. ఈ చర్చాపేజీని, అభిప్రాయాలు ప్రకటించుటకు,కొత్త వనరులను సూచించుటకు, సమస్యలను ఉదహరించుటకు, సభ్యులకు అంగీకారం కాని మార్పుల గురించి చర్చించుటకు వాడవచ్చు.

సూచనల వ్యవస్థ తెరపట్టు

ఒక ముఖ్యమైన మార్గదర్శకం ఏమంటే, వికీపీడియా సముదాయ చర్చలలో గౌరవపూర్వకంగా మరియు మర్యాదతో వ్యవహరించాలి. ఒకవేళ మీరు ఒక విషయం పట్ల విభేదించే పక్షంలో, మీలాగే సహ సభ్యులు వికీపీడియా లక్ష్యానికి కట్టుబడి మంచి ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని అనుకోవాలి. చర్చలలో సభ్యుని వ్యక్తిత్వంపై కాక చర్చావిషయం పట్ల ప్రాధాన్యత చూపండి,

వికీపీడియా వ్యాసం నాణ్యత అంచనావేయటం

వికీపీడియా వ్యాసాల నాణ్యతలో చాలా తేడాలుంటాయి. కొన్ని వ్యాసాలు చాలా బాగా ఉంటాయి, కానీ కొన్ని లోతు మరియు స్పష్టత లేకుండా వుంటాయి, లేదా పక్షపాతంతో కూడిన దృక్కోణాలను కలిగి వుంటాయి, లేదా పాతవై వుంటాయి. సాధారణంగా, అధిక నాణ్యత రచనలు ఈ లక్షణాలు కలిగి వుంటాయి:

  • ప్రవేశికలో సులభంగా అర్ధమయ్యే వ్యాస సారాంశం,
  • ఒక స్పష్టమైన నిర్మాణం,
  • విషయం గురించి సమతుల్యత
  • తటస్థ దృక్కోణం, మరియు
  • విశ్వసనీయమైన మూలాలు

వ్యాసం నాణ్యత గురించి అదనపు సమాచారం కొరకు " వికీపీడియా నాణ్యత అంచనా" (Evaluating Wikipedia) కరపత్రం చూడండి ( తరువాతి విభాగం చూడండి)

అదనపు వనరులు

వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version)

Evaluating Wikipedia :వికీపీడియా నాణ్యత అంచనా: వ్యాస మార్పుల క్రమం మరియు వ్యాసాల నాణ్యతను అంచనా చేయడం వ్యాసాలు ఎలా పరిణామం చెందుతాయి, మంచి నాణ్యత గల వ్యాసాల యొక్క అంశాలు, మరియు నాణ్యత లేని వ్యాసాల సంకేతాలు అన్ని ఈ మార్గదర్శి లో ఇవ్వబడ్డాయి. http://education.wikimedia.org/evaluating

Illustrating Wikipedia:వికీపీడియాకు బొమ్మలు చేర్చడం : వికీమీడియా కామన్స్ లోని విషయాల కొరకు దోహదపడే మార్గదర్శి. వికీమీడియా కామన్స్, వికీపీడియా లో వాడే దస్త్రాలనిల్వ గురించిన ఈ పుస్తకానికి తోడుగా వున్న పుస్తకం. ఈ కరపత్రం కామన్స్ ఏమిటి, ఫైళ్ళను ఏవిధంగా ఎక్కించాలి, ఫైళ్ళను ఏవిధంగా ఉపయోగించాలి మరియు ఉచిత లైసెన్స్ ల ప్రాథమిక అంశాలను తెలుపుతుంది. http://education.wikimedia.org/illustrating

Instructor basics -బోధకుడి కొరకు మూలాంశాలు : వికీపీడియాను బోధనోపకరణముగా ఎలా మార్చాలి. ఈ పుస్తకం విద్యాబోధకులకు వికీపీడియాలో కృషికి విద్యార్ధులను భాగస్వామ్యం చేయటానికి మంచి పద్ధతులను తెలుపుతుంది. తమ పాఠ్యప్రణాళికలో భాగంగా వికీపీడియా వాడడానికి వివరాలు తెలుపుతుంది. http://education.wikimedia.org/instructorbasics

వికీమార్కప్ మార్గదర్శిని

ఈ క్రిందనివ్వబడిన ఉదాహరణలు వికీపీడియాలో వికీమార్కప్ వాడి వ్యాస సవరణలు చేస్తున్నప్పుడు అవసరమయిన దృశ్యరీతులకి సంబంధించినవి. మరింత సహాయానికి , చూడండి | దగ్గరిదారి WP:MARKUP

వివరణ

మీరు టైపు చేసేది

భద్రపరిచిన తదుపరి కనిపించేది

వాలు

‘’వాలు పాఠ్యం'’

వాలు పాఠ్యం

బొద్దు అక్షరాలు

‘’’బొద్దు పాఠ్యం'’’

బొద్దు పాఠ్యం

విభాగ శీర్షికలు

==చరిత్ర==
===వర్ణన===
====ఉత్పాదన====


వికీపీడియా పదావ‌ళి

ఉచిత లైసెన్స్

వికీపీడియాలోని విషయాలను ఎవరైనా ఎటువంటి లక్ష్యానికైనా వాడుకోవడానికి అధ్యయనం చేయడానికి, నకలు చేయటానికి మరియు అటువంటి నకళ్లు పంపిణీ చేయడానికి , సవరణలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి మరియు అటువంటి తద్భవాలను పంపిణీ చేయడానికి అలాగే బొమ్మలు మరియు ఇతర విషయాలు ఏవైనా ఎక్కడైనా ఉచితంగా వాడుకోవడానికి మార్పులు చేయడానికి అభివృద్ధి చేసి ప్రచురిచి ప్రతులను పంచిపెట్టడానికి అనుమతి ఇవ్వడమేగాక వాటిని ఏలాంటి ఉపయోగానికైనా ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే కాపీ హక్కుల లైసెన్స్. వికీపీడియా మరియు దానిలోని ప్రతి కృషి " క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ 3.0 " అనే ఉచిత లైసెన్స్ కు కట్టుబడి జరుగుతుంది. | మరింత సమాచారానికి దగ్గరి దారి WP:CC-BY-SA

చరిత్ర

ఇక్కడ సభ్యులు చేసిన మార్పుల వివరాల జాబితా ఉంటుంది. వికీపీడియా వ్యాస మార్పుల నమోదు పేజీ చరిత్రను చూడండి అనే బటన్ ద్వారా చేరవచ్చు. లంకెలను చూడవచ్చు. దానిలో (ప్రస్తుత - గత) బటన్ లను నొక్కడం ద్వారా ఏ రెండు రూపాల మధ్యగల తేడాలను చూడవచ్చు. పాత రూపాలను తిరిగి ప్రదర్శితమయ్యే రూపంగా చేయవచ్చు.

చర్చాపేజీ

ఒక వ్యాసానికి లేక ఇతర వికీపీడియా పేజీల చర్చలకు కేటాయించిన స్థలం. మీరు ఇతర సభ్యులతో సంబంధిత పేజీలో విషయం గురించి చర్చించవచ్చు.

పరామితి

ఒక పైపు చిహ్నం (|) ఉపయోగించి పదబంధాలను వేరు చేసేది. దీని ద్వారా బొమ్మలు, మూసలు మరియు ఇతర వికీ మార్కప్, వ్యాస పేజీలో ప్రదర్శితమవటాన్ని నిర్దేశించేది.

మార్కప్(చిహ్నాలు)

వికీపీడియా పుటను తయారుచేయడానికి ఉపయోగించే ప్రత్యేక సాంకేతిక చిహ్నాలు. ప్రాథమికాంశాలకు మార్కప్ మార్గదర్శిక (పేజి 15) లేక మరిన్ని వివరాలకు| దగ్గరిదారి H:MARKUP

మూస

ఒకపేజీలో ఉన్న విషయాన్ని మరొకపేజీలో చేర్చడానికి సులభమైన పద్ధతి. ఒకే తరహావిషయ వివరణలను పలుపేజీలలో చేర్చ వలసిన అవసరం ఏర్పడి నప్పుడు మూసలను తయారు చేసి వాటిని వాడుతూ ఉంటారు. వాడుటకు సూచనల కొరకు , చూడండి| దగ్గరి దారి H:T

మొలక

విస్తరణకు బాగా అవకాశమున్న చిన్న వ్యాసం. మొలకలకు విషయం చేర్చడం కొత్త సభ్యులు వికీపీడియాలో రచనలు చేయడం ప్రారంభించేటప్పుడు చాలా మంచి పని.

వాడుకరి పేజీ

ఇది వికీపీడియా సభ్యునికి వ్యక్తిగత పేజీ. ఇది వాడుకరి: అనే పదంతో ప్రారంభమయి తరువాత వాడుకరి పేరుని కలిగివుంటుంది. వికీపీడియా సభ్యులు తమ వివరాలు మరియు ఆసక్తులను అవసరమని భావించినంత వరకు చేర్చవచ్చు మరియు పనిచేసిన లేక చేయబోయే వ్యాసాలు మరియు ఇతర వివరాలు చేర్చవచ్చు.

వికీకామన్స్

వికీపీడియా మరియు దాని అనుబంధ ప్రాజెక్టులలో విషయాన్ని వివరించడానికి అవసరమైన ఛాయాచిత్రాలను, వీడియోలను మరియు ఇతర ఫైళ్లను మీరు ఉచిత అనుమతితో భద్రపరిచగల భాండాగారం.

వికీపీడియన్

వికీపీడియాఅభివృద్ధికి కృషి చేసే వ్యక్తి. సామాన్య పర్యాయపదాలు: సంపాదకుడు, వాడుకరి, రచయిత, సముదాయ సభ్యుడు

సమాచారపెట్టె

విషయాన్ని గురించిన ముఖ్య మైన సమాచారంతో తరచు వ్యాసం మొదటి భాగంలో వాడే పెట్టె. మూసలకు సామాన్య రూపమే సమాచార పెట్టెలు.

సారాంశం (సవరణ)

వికీపీడియా వ్యాసంలో మార్పు గురించిన వివరణ, ఇతర వాడుకరులు వ్యాస సవరణల క్రమమును గమనించడానికి మరియు సవరణ ఉద్దేశ్యాన్ని తెలుపుతుంది.

గుర్తింపులు
  • ఆంగ్ల మూల పాఠ్యం: Sage Ross(WMF)
  • ఆంగ్ల రూపలావణ్యం:<TBD>
  • తెలుగుసేత:టి.సుజాత,అహ్మద్ నిసార్, రహ్మనుద్దీన్, అర్జున, విశ్వనాధ్, తదితరులు
  • తెలుగు వికీపీడియా సంచికకు మార్పులు మరియు సంపాదకత్వం: అర్జున
  • సహకారం:తెలుగు వికీపీడియా మరియు వికీసోర్స్ సభ్యులు

వికీమీడియా భారతదేశం చాప్టర్ ( నమోదు చేయబడిన పేరు వికీమీడియా చాప్టర్) ఒక స్వలాభాపేక్ష లేని సంస్థ. సంఘాల నమోదు కార్యాలయం, బెంగుళూరు పట్టణ జిల్లా వద్ద 3 జనవరి 2011 రిజిస్టర్ చెయ్యబడింది. భారతీయులకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం మరియు అటువంటి సాధనాలకు తోడ్పాడటానికి ప్రజల నైపుణ్యాలను మెరుగు పరచేలా చేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఇది వికీపీడియా మరి ఇతర ప్రాజెక్టులు నడిపే వికీమీడియా ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తునంది. వికీమీడియా చాప్టర్‌కు వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో చేర్చే విషయాలపై ఏ విధమైన నియంత్రణ లేదు. అలాగే ఈ ప్రాజెక్టుల నడిచేసర్వర్లకు పై నేరు ఆధిపత్యం లేదు.

వికీమీడియా ఫౌండేషన్ 149 న్యూ మోంట్గోమరీ స్ట్రీట్, థర్డ్ ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94105, యుఎస్ఎ. వికీమీడియా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర ఉచిత విషయాలు గల వెబ్సైట్లను నడుపుతుంది.

వేరేగా పేర్కొనకబోతే అన్ని బొమ్మలు వికీమీడియాకామన్స్ నుండి సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) లేక ఇతర సార్వజనీయమైన లైసెన్సులతో విడుదల చేయబడినవి. పాఠ్యము క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్ ఎలైక్ లైసెన్స్ v.3.0 లేక దాని తరువాత రూపం(Creative Commons Attribution-ShareAlike License v.3.0) లింకు విడుదలచెయ్యబడింది.

వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇలాంటి ఇతర సంస్థల వ్యాపార చిహ్నాలు మరియు గుర్తులు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు లోబడవు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, కామన్స్, మీడియావికీ, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీన్యూస్, వికీఖోట్, వికీవర్శిటీ, వికీస్పిసీస్ మరియు మెటా వికీలు నమోదు చేయబడిన లేక నమోదు చేయబడుతున్న వ్యాపార చిహ్నలు.

మరింత సమాచారానికి, మా వ్యాపార చిహ్నల విధానం లింకు చూడండి: ఇతర ప్రశ్నలకు మరియు లైసెన్స్ షరతులకు లేక వ్యాపార చిహ్నల విధానానికి వికీమీడియా ఫౌండేషన్ న్యాయశాఖకు ఈమెయిల్ (legal@wikimedia.org ) చేయండి. వికీమీడియా భారతదేశం గురించి మరియు ఈ తెలుగు పుస్తకం గురించి సూచనలు చేయదలిస్తే వికీమీడియా భారతదేశానికి ఈ మెయిల్ (chapter@wikimedia.in ) చేయండి.