వికీపీడియా:వాడుకరులకు సూచనలు/మరణ వివరాలను చేర్చేటపుడు
Jump to navigation
Jump to search
మరణ వివరాలను చేర్చేటపుడు
[మార్చు]వ్యక్తులు మరణించినపుడు వారి వికీపీడియా వ్యాసాల్లో ఏయే మార్పులు చెయ్యాలో ఈ విభాగం తెలియజెబుతుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
- ముందుగా మరణ వివరాలను పేజీలో తగిన చోట చేర్చండి. ఎలా మరణించారు, ఎప్పుడు మరణించారు, ఎక్కడ మరణించారు (ఊరు పేరే కాకుండా, ఇల్లా, ఆసుపత్రా, మరేదైనా స్థలమా అనే వివరం కూడా రాస్తే బాగుంటుంది). కింద చూపిన సమాచారం చేర్చేముందు దీన్ని తప్పనిసరిగా చేర్చాలి.
- ప్రవేశికలో పేరు పక్కనే బ్రాకెట్లో ఉండే జనన తేదీ పక్కనే మరణ తేదీని చేర్చాలి.
- వర్గాలు
- ఆ సంవత్సరంలో జరిగిన మరణాలు ఆనే వర్గం లోకి చేర్చాలి. ఉదాహరణకు వర్గం:2021 మరణాలు (పనిలోపని.. పేజీలో "జననాలు" వర్గం ఉందో లేదో చూసి, లేకుంటే అది కూడా చేర్చండి)
- మరణం అసహజమైతే మరణ కారణ వర్గాన్ని కూడా చేర్చాలి. దీనికి సంబంధించిన వివిధ వర్గాల కోసం వర్గం:మరణాలు చూడండి.
- సంవత్సరం, తేదీ పేజీల్లో మరణ వివరాన్ని చేర్చండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 2021 మే 14 న మర్ణించి ఉంటే మరణ వివరాన్ని 2021 పేజీ, మే 14 పేజీ - రెండిట్లోనూ చేర్చాలి.
- సమాచారపెట్టెలో మార్చాల్సినది:
- మరణ తేదీని చేర్చాలి. ఇందుకోసం {{Death date and age}} అనే మూసను చేర్చాలి. దానిలో మరణించిన సంవత్సరం, నెల, తేదీ, పుట్టిన సంవత్సరం, నెల, తేదీ - ఈ ఆరు పరామితులను ఇవ్వాలి. ఉదా: {{Death date and age|2021|05|14|1965|10|9}} అని చేర్చినపుడు 2021 మే 14 (వయసు 55) అని చూపిస్తుంది. {{Death date}} అనే మూసను (దీనికి మూడు మరణ పరామితులు ఇస్తే చాలు) కూడా వాడవచ్చు గానీ, ఇది వయసును చూపించదు.
- జననతేదీని మార్చాలి: జనన తేదీలో {{Birth date and age}} అని వాడి ఉందేమో చూడాలి. జీవించి ఉన్న వాళ్లకు ఇది వాడతాం. దీన్ని వాడినపుడు పుట్టిన తేదీతో పాటు, బ్రాకెట్లో వర్తమాన తేదీ నాటికి వయసెంతో కూడా బ్రాకెట్లో చూపిస్తుంది. జీవించి ఉన్నవారికి ఇది వాడడం మామూలే. అయితే వ్యక్తి మరణించాక ఇక అది అక్కరలేదు కాబట్టి (వయసు మారదు కదా), {{Birth date and age}} అనే మూసని తీసేసి దాని స్థానంలో {{Birth date}} అనే మూసను చేర్చాలి. దీనికి పుట్టిన సంవత్సరం, నెల, తేదీ అనే మూడు పరామితులు ఇవ్వాలి.