వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/నాణ్యతాపరమైన అభివృద్ధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలోని గ్రామాల అభివృద్ధిలో జనగణన సమాచారాన్ని చేర్చడం ఒక దశ అనుకుంటే, ఒక్కో గ్రామాన్నీ విశిష్టంగా తీర్చిదిద్దే సమాచారంతో నాణ్యతాభివృద్ధి చేయడం మరో దశ అనుకోవచ్చు. ఈ క్రమంలో గ్రామ నామ విశేషాలు, చరిత్ర వంటి విభాగాలు చేర్చి అభివృద్ధి చేయడం, ఫోటోలు చేర్చడం ద్వారా వీటికి దేనికి దానికి ప్రత్యేకత, లోతు ఏర్పడతాయి.

గ్రామ నామాలు[మార్చు]

గ్రామాల పేర్ల గురించి ప్రామాణికమైన పరిశోధనలు జరిగాయి. పీహెచ్‌డీ థీసిస్‌లుగానూ, పరిశోధన గ్రంథాలుగానూ ఒక్కో జిల్లాలోని గ్రామాల పేర్ల పరిశోధన ప్రత్యేకంగా వెలువడ్డాయి. ఈ పరిశోధన గ్రంథాల్లో ఆయా జిల్లాల గురించే కాక కొంతమేరకు మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఊళ్ళకు ఉపయోగపడగల సమాచారం ఉంటుంది. ఉదాహరణకు పల్లి అనే పదానికి సాధారణంగా ఉండే మూలం ఏమిటో వివరిస్తే పల్లి అన్న ఉత్తర పదంతో వచ్చిన అన్ని ఊళ్ళకూ ఆ సమాచారం పనికివస్తుంది. అదలా ఉంచగా ప్రత్యేకించి ఆయా జిల్లాల గురించే ఉండే సమాచారం సూటిగా ఆ గ్రామం పేరుకు పరిశోధకులు ఇస్తున్న వివరణ పేర్కొంటుంది. మూలాల సహితంగా, ఇంటర్నెట్‌లో ఇంకెక్కడా ఇంత తేటగా దొరకని సమాచారం గ్రామాల్లో చేరితే వ్యాసానికి చాలా విలువ పెరుగుతుంది.

ఉపయోగపడే మూలాలు[మార్చు]

  • ఉగ్రాణం, నరసింహారెడ్డి. నెల్లూరు జిల్లా గ్రామనామాల భాషా సామాజిక పరిశీలన. Retrieved 2 July 2018.

చరిత్ర సమాచారం[మార్చు]

అన్ని గ్రామాలకూ చరిత్ర ఉంటుంది. మనం ఈరోజు సాధారణమని భావించే గ్రామానికి ఏ క్విట్ ఇండియా ఉద్యమంలోనో మంచి ఆందోళన చేసిన చరిత్ర ఉండివుండొచ్చు, శతాబ్దాల క్రితం చారిత్రక యుద్ధం జరిగిన స్థలం కావచ్చు. ఇటువంటి సమాచారం కూడా పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుంది.

ఉపయోగపడే మూలాలు[మార్చు]