వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/ఫలితాలు
స్వరూపం
2014 జూన్ 21న తెలుగు వికీపీడియాలో ప్రారంభమైన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు 2015 మార్చి నాటికల్లా తొలిదశను పూర్తిచేసుకుంది. ప్రాజెక్టులో భాగంగా తెవికీ ప్రాజెక్టులకు(వికీపీడియా, వికీసోర్స్, విక్ష్నరీ తదితరాలు) లభించిన ఫలితాలు, ప్రాజెక్టులో పాల్గొన్న సభ్యులు, ప్రాజెక్టు కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు మొదలైన వివరాలు ఈ పేజీలో పొందిపరిచాము.
పాల్గొన్న వ్యక్తులు
[మార్చు]ప్రాజెక్టులో భాగంగా చేసిన కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు అందరూ ఈ కొలమానం కిందికి వస్తారు.
- డిజిటల్ గ్రంథాలయ అవగాహన కార్యక్రమం : ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 46 మంది వ్యక్తులు నిర్వాహకులుగా, సభ్యులుగా పాల్గొన్నారు.
- తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంలో నిర్వహించిన ఎడిట్-అ-థాన్లో 8 మంది వికీపీడియన్లు పాల్గొన్నారు. జూన్ 22, 2014న జరిగిన తెవికీ నెలవారీ సమావేశంలో 5గురు వికీపీడియన్లు(పైన తెలిపిన ఎడిట్-అ-థాన్లో పాల్గొన్నవారు కాక లెక్కిస్తే) అక్టోబర్ 19, 2014న జరిగిన నెలవారీ సమావేశంలో పైన వివరించిన వారు కాక మరొకరు ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు.
- విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలకు వెళ్ళి చేసిన అవగాహన కార్యక్రమం, శిక్షణలో తెవికీపై చేసిన ప్రసంగంలో(క్లాసులో కోలాశేఖర్ సహకారంతో) 30మంది సభ్యులు, శిక్షణలో 20మంది సభ్యులు పాల్గొన్నారు.
- en:swatantra 2014లో తెలుగు వికీలో జరుగుతున్న ఈ ప్రాజెక్టును ఉదాహరణగా చూపి ఇటువంటి ప్రయత్నాలు చేయడానికి సూచనలు తెలియజేస్తూ చేసిన ప్రెజంటేషన్లో దాదాపుగా 25 మంది పాల్గొన్నారు.