వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/అమిటీ విశ్వవిద్యాలయం నోయిడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమిటీ విశ్వవిద్యాలయం నోయిడా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉన్న ఒక ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం. ఎన్.ఐ.ఆర్.ఎఫ్ 2020 ర్యాంకింగ్ ప్రకారం 32వ స్థానంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది [1].

ప్రవేశం

[మార్చు]

ఈ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం కి జే.ఈ.ఈ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం కి గేట్ పరీక్షలతో ప్రవేశం కల్పిస్తారు.

కోర్సులు

[మార్చు]

ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరములు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరములు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరములు, కోర్సులు ఉన్నాయి[2]. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఫీజు రాయితీ సదుపాయం ఉంది . 2018-2019 సంవత్సర సమాచారం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల ఇంజనీరింగ్ కోర్సులలో 7336 విద్యార్థులు చదువుతున్నారు, వారిలో 5450 మంది అబ్బాయిలు, 1886 మంది అమ్మాయిలు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరములు కోర్సులలో 409 విద్యార్థులు చదువుతున్నారు, వారిలో 183 మంది అబ్బాయిలు, 226 మంది అమ్మాయిలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరములు కోర్సులలో 312 విద్యార్థులు చదువుతుండగా, వారిలో 172 మంది అబ్బాయిలు,140 మంది అమ్మాయిలు. ప్రతి కోర్సులలో అమ్మాయిల, అబ్బాయిల నిష్పత్తి సుమారు 1:2.58 ఉండడం గమనార్హం. విశ్వవిద్యాలములో 1431 పి హెచ్ డి పరిశోధన విద్యార్థులు ఉండగా , వారిలో 1000 మంది పార్ట్ టైం విద్యార్థులు.

ఉద్యోగ నియామకాలు- ఉన్నత చదువులు

[మార్చు]

2018-2019 సంవత్సరములో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల కోర్సుల వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 3.75 లక్షలు. ఉద్యోగ నియామకాలకి సన్నద్ధమైన విద్యార్థులలో 52% సఫలం అయ్యారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల కోర్సుల వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 3.0లక్షలు. ఉద్యోగ నియామకాలకి సన్నద్ధమైన విద్యార్థులలో 34% సఫలం అయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరములు కోర్సుల వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 3.5 లక్షలు,75 శాతం మంది ఉద్యోగం సంపాదించడంలో సఫలీకృతులు అయ్యారు. విశ్వవిద్యాలయములో ఉన్న అన్ని కోర్సులలో మునుపటి సంవత్సరం కంటే మధ్యస్థాయి వార్షిక వేతనం పెరగడం గమనార్హం. 2018-2019 సంవత్సరములో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం నాలుగు సంవత్సరముల విద్యార్థులలో 14%,అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల విద్యార్థులలో 7%, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం రెండు సంవత్సరముల విద్యార్థులలో 14% ఉన్నత చదువులకు వెళ్లారు.

వ్యయం

[మార్చు]

విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల వార్షిక వేతనాలు బయటి కాలేజీలకంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి. 2018-19 సంవత్సరంలో భోధన , బోధనేతర సిబ్బంది వేతనాలకై 62.57కోట్లు ఖర్చు చేశారు . వర్క్‌షాప్‌లు, సెమినార్లు, పరిశోధనా సమావేశాలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, వీటి కొరకై 2018-19 సంవత్సరములో 74.05లక్షలు ఖర్చు పెట్టారు. గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను ఎప్పటికి అప్పుడు నవీకరిస్తూ ఉంటారు. వీటి కొరకై 2018-19 సంవత్సరములో 70.12లక్షలు ఖర్చు పెట్టారు.

వికలాంగులకు సౌకర్యాలు

[మార్చు]

ఇక్కడ శారీరక వికలాంగులకు సహాయపడే సౌకర్యాలు కలవు. ఎక్కువ భవనాలలో 80 % కంటే ఎలివేటర్లు, ర్యాంప్‌లు ఉన్నాయి .వికలాంగులకై ప్రత్యేక మరుగుదొడ్లు 80 శాతంకి పైగా భవనాలలో కలవు. ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్ళడానికి వీల్ చైర్ వంటి వసతులు ఉన్నాయి.

అమిటీ యూనివర్సిటీ నోయిడా
స్థానంగౌతమ్ బుద్ నగర్, ఉత్తరప్రదేశ్

మూలాలు

[మార్చు]

https://www.nirfindia.org/nirfpdfcdn/2020/pdf/Engineering/IR-E-U-0497.pdf

  1. "Amity University". www.amity.edu. Retrieved 2021-06-21.
  2. "కోర్సులు". amity.edu. Retrieved 2021-06-21.{{cite web}}: CS1 maint: url-status (link)