వికీపీడియా:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు
తెలుగు వికీ ప్రారంభం నుండి వికీప్రాజెక్టుల నిర్వహణ జరుగుతూనే వున్నాయి. అయితే చాలావరకు వీటిలో ఒక అంశం మీద ఎవరికి వారు కొన్ని వ్యాసాలు సృష్టించడం, కొన్ని బొమ్మలు చేర్చడం లాంటి పనులే గాని, ప్రాజెక్టు లక్ష్యాలలో నాణ్యతను నిర్దేశించడం, ప్రాజెక్టు తరువాత సమీక్షించడం, ఒక వ్యాసంలో జరిగిన కృషిని ఇతరులు పరిశీలించి మెరుగుపరచడం జరిగినవి చాలా తక్కువ. వికీపీడియా నాణ్యత మెరుగవ్వాలంటే పాటించాల్సిన సూత్రాలు అప్పుడప్పుడు కొందరు సభ్యులు సూచిస్తున్నా, వాటిని పాటించిన దాఖలాలు చాలా తక్కువ. అటువంటి సూచనలపై మరింత ధ్యాసను కల్గించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
ప్రాజెక్టు అని ప్రామాణికంగా పిలిచేవాటికి కాల నిర్ణయం తప్పనిసరి. సాధారణ రోజువారీగా జరిగే నిర్వహణ పనులు (శుద్ధి) పనులను కూడా వికీలో ప్రాజెక్టు అంటారు కాని, దానికి ప్రామాణికమైన ఆంగ్ల పదం ఆపరేషన్.
ప్రాజెక్టు లక్ష్యాలు
[మార్చు]పరిధి
[మార్చు]తెవికీలో నెలలో చురుకుగా మార్పులు అనగా కనీసం నెలలో 5 మార్పులు చేసేవారు షుమారు 30-60 మంది మాత్రమే. ప్రాజెక్టులో పనిచేయాలంటే ఇంకా చురుకైన వారు కావాలి. 5-10 మంది ఒక ప్రాజెక్టుపై ఆసక్తి చూపితే ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ. ఈ కొద్ది మందికి కూడా ప్రత్యేక ఆసక్తులుంటాయి, ఇతర నిర్వహణ కార్యక్రమాలలో కొంతమంది పాల్గొంటూ వుంటారు. కాబట్టి ప్రాజెక్టు విషయం ఎక్కువమందికి ఆసక్తి కలిగించేదిగా వుంటే మంచిది.
ప్రాజెక్టు ప్రారంభానికి ముందే పరిధిని నిర్ణయించండి. ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు, పరిధిలో లేక సంబంధిత నియమాలలో స్వల్పమైన సవరణలు తప్పించి, దానికి పాల్గొనటానికి ఇష్టపడిన వారి కృషిని ప్రభావితం చేసే పెద్ద సవరణలు చేయవద్దు.
కాలం
[మార్చు]ఎక్కువమంది ఔత్సాహిక సభ్యులు ఎక్కువ కాలం ఒక ప్రాజెక్టులో పనిచేయాలంటే సమస్యలుంటాయి, కావున ప్రాజెక్టు కాలాన్ని మూడు నెలలలోపలికి పరిమితం చేయటం మంచిది. పని ఎక్కువవుంటే, మిగిలిన పనిని ఆసక్తిని బట్టి, వెనువెంటనే, లేక కొన్నాళ్ల తరువాత ఇంకొక ప్రాజెక్టులో భాగంగా చేయవచ్చు.
వనరులు
[మార్చు]సాధారణ ప్రాజెక్టులకు పాల్గొనేవారికి కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యముంటే చాలు. బహుమతులు, ఇతర ఆన్లైన్, ఆఫ్లైన్ సమావేశాలు కొరకు నగదు అవసరం రావచ్చు. వీటికొరకు సిఐఎస్ ను లేక వికీమీడియా ఫౌండేషన్ ను సంప్రదించవచ్చు.
నాణ్యత
[మార్చు]ప్రాజెక్టు లక్ష్యంలో నాణ్యత నిర్వచించాలి. రోజుకో వ్యాసం రాయడం, వ్యాసం పరిమాణం, ఉండవలసిన లింకులు లాంటి కేవలం గణాంక లక్ష్యంతో వ్యాసాలు రాయడం, వాటిని ప్రోత్సహించడం వలన వికీపీడియా నాణ్యత మెరుగవదు. ఎందుకంటే వికీలో మంచి వ్యాసాలు వ్రాసిన అనుభవం లేనివారి ధ్యాస వ్యాసం రాశామనే కాని దాని నాణ్యత పై వుండదు. ఒక మంచి వ్యాసం రూపొందాలంటే కొంతకాలంపాటు చాలా పరిశోధన చేయవలసి వస్తుంది. నలుగురు కలిసి కృషి చేస్తేనే మెరుగవుతుంది.
ప్రచారం
[మార్చు]వికీలో
[మార్చు]- వికీలో Mediawiki:Sitenotice, Mediawiki:Anonnotice ప్రకటనలకు వాడవచ్చు. అయితే ప్రాజెక్టు ప్రారంభానికి ముందు ఒక వారం రోజులమాత్రమే ప్రచారం చేయటం మంచిది. ప్రాజెక్టులో తగిన గుర్తింపు గాని, బహుమతులకు గాని, పాల్గొనేవారందరికి సమాన అవకాశం కల్పించడానికి వీలవుతుంది.
- వికీలో వాణిజ్యప్రకటనలకే అస్కారంలేదు, చదువరులకు నిరంతరం వికీప్రాజెక్టుల ప్రకటణలు కొనసాగుతున్నా, వికీ వాడుక అనుభవానికి అసౌకర్యంగా వుంటుంది.
బయట
[మార్చు]- తెవికీ గురించిన ఈమెయిల్ లిస్టు, ఫేస్బుక్ గ్రూపు లాంటి వాటిలో ప్రచారంచేయవచ్చు.
ప్రాజెక్టు చర్చలు
[మార్చు]ప్రాజెక్టు చర్చలు, సంబంధిత ప్రాజెక్టు చర్చపేజీలోనే జరపటం మంచిది. ఒకవేళ ఇతర చోట్ల జరిగినట్లైతే, కనీసం ప్రాజెక్టు చర్చాపేజీలో లింకు చేర్చటం మంచిది.
సమీక్ష
[మార్చు]సమీక్ష కొరకు గణాంకాలు సేకరించాలి. కొన్ని గణాంకాలు వికీపీడియాలోని ఉపకరణాలతో సేకరించవచ్చు. అయితే నాణ్యతకు సంబంధించిన గణాంకాలకు, ప్రాజెక్టు సభ్యులు ఇతర సభ్యుల కృషిని ఒక ప్రాతిపదికమీద మదింపు చేస్తేనే వీలవుతుంది.
- ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత, బాగా ఏమి జరిగింది, ఇంకనూ బాగా జరగాల్సిన వేమిటని సమీక్ష చేస్తే ముందు ప్రాజెక్టులకు ఉపయోగంగా వుంటుంది. ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు కూడా మంచిపద్దతులను సభ్యులందరికీ తెలియచేయటానికి ప్రాజెక్టు పేజీని తాజాపరచుతుండాలి.
గుర్తింపు
[మార్చు]- ప్రాజెక్టులో పాల్గొన్న వారి కృషికి గుర్తింపుకొరకు నియమాలను కూడా ప్రాజెక్టు ప్రారంభానికి ముందే నిర్ణయించడం మంచిది. ఇటువంటి గుర్తింపులు కేవలం సంఖ్యాపరంగా కన్నా నాణ్యతతో కూడిన గణింపులపై చేయడం మంచిది.
న్యాయనిర్ణేతల మండలి
[మార్చు]న్యాయనిర్ణేతల మండలి ఏదైనా ఏర్పరిచితే దానిలో పాల్గొనేవారు, ప్రాజెక్టులో పనిచేసినా బహుమతులకు అనర్హులుగా చేయటం మెరుగు.
వనరులు
[మార్చు]- ఎడిటథాన్లకు వాడే ఫౌంటేన్ ఉపకరణం (నాణ్యత ప్రమాణాలను బేరేజీవేయటానికి వీలుంది, కాని ప్రాజెక్టుకొరకు అంగీకరించబడిందా లేదా అని మాత్రమే.)
- హేష్ టేగ్ టూల్, (బొమ్మలు చేర్చటం లాంటి ప్రాజెక్టు గణాంకాలను, సవరణకు చేర్చే సారాంశంలో #WPWP లాంటి టేగ్ల ఆధారంగా గణాంకాల నివేదికకు)
- వాడుకరి:Mpradeepbot/ProjectStatistics.py ప్రాజెక్టులో చేరిన వ్యాసాల నాణ్యతను మదింపుచేసి వాటి చర్చాపేజీలో మూసలో చేర్చిన వివరాలను పట్టికగా రూపొందించే పైథాన్ స్క్రిప్టు. ప్రాజెక్టుకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలి. ఇప్పటికే వున్న వ్యాసాలు పరిధిలో వుంటే, ప్రాజెక్టు ప్రారంభంముందు మదింపు చేసి, ప్రాజెక్టుపూర్తి అయిన తరువాత మరొకసారి బాటు నడపాలి.