Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/అనుమతులు

వికీపీడియా నుండి
వికీపీడియా:WikiProject/పుస్తకాలు కు అనుబంధ పేజీ

పేజీ లక్ష్యం

[మార్చు]

కొన్ని వెబ్ సైటులు లేదా రచనలనుండి బొమ్మలనుకాని, వ్యాసాలను కాని తెలుగు వికీలో వాడుకోవడానికి మనం అనుమతులు కోరుతున్నాము. అలా అనుమతులు లభించినట్లయితే వాటిని రిఫరెన్సుకోసం ఈ ఉపపేజీలో చేర్చండి.


గమనించండి

[మార్చు]

అనుమతులు కోరేటపుడు క్రింది విషయాలు గమనించండి.

వారి ప్రచురణలోని విషయ సంగ్రహం వికీలో చేరిస్తే అది GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక ఇతరులెవరైనా గాని స్వేచ్ఛగా వాడుకొంటారని వారికి తెలియబరచడం మరచిపోవద్దు. "అనుమతులు" పేజీలో ఇ-మెయిల్ లేదా ఇతర ఉత్తర ప్రత్యుత్తరాలు కాపీ చేసినపుడు వారి వెబ్ సైటు లింకు మాత్రమే ఇవ్వండి. కాని వారి ఇ-మెయిల్ గాని, వ్యక్తిగత వివరాలు గాని ఇవ్వవద్దు. స్పామ్ నిరోధానికి, వారి గోప్యతా పరిరక్షణకు ఇది అవుసరం.


ఇప్పటికి లభించిన అనుమతులు

[మార్చు]


ఉత్తర ప్రత్యుత్తరాలు

[మార్చు]

ఎవికెఎఫ్

[మార్చు]

చాలా కాలం క్రితం మెయిల్ ద్వారా ఇచ్చిన అనుమతి.

వారి సైటునుండి పుస్తక ముఖచిత్రాలు, పరిచయ సారాంశం వాడుకోవచ్చునని.


పుస్తకం.నెట్

[మార్చు]
(ఇంకా అనుమతి లభించలేదు)
అభ్యర్ధన

పుస్తకం.నెట్ సంపాదకులకు

నమస్కారములు. ఈ సైటు నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు.నేను తెలుగు వికీపీడియాలో పని చేస్తుంటాను. http://te.wikipedia.org ఒకమారు చూడగలరు. "పుస్తకం"లో ప్రచురించే అనేక సమీక్షలు కొద్ది మార్పులతో వికీపీడియాలో వ్యాసాలుగా కూర్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నాను.

‘పుస్తకం’లో ప్రచురించిన రచనలపై సర్వ హక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి.- అని మీరు వ్రాసిన గమనికను నేను గౌరవిస్తున్నాను. కాని అనేక పుస్తకాల గురించిన వ్యాసాలు వికీపీడియాలో కూడా ఉంటే మీ ఆశయం, సమీక్షకుల ఆశయం మరింత ఫలించే అవకాశం ఉన్నదని మనవి చేస్తూ మిమ్ములను క్రింది సహాయం మరియు అనుమతులు కోరుతున్నాను.

(1) మీ వెబ్ సైటు తరఫున, మీవరకు, ఈ సమీక్షలను కొన్ని మార్పులతో తెలుగు వికీలోకి కాపీ చేయడానికి అనుమతించగలరా? అవి ఫలాని వెబ్‌సైటు నుండి తీసుకోబడినవని తప్పక వ్రాస్తాము.

(2) ఇదే విధమైన అనుమతిని మీ సమీక్షకులనుండి పొందడానికి అనువుగా ఈ మెయిల్‌ను వారికి పంపగలరా?

(3) సమీక్షకులు ఆయా పుస్తకాలను ఇప్పటికే చదివి ఉన్నారు గనుక తెలుగువికీలో ఆ పుస్తకాల గురించి మరింత సమాచారాన్ని వ్రాస్తే బాగుంటుందని కూడా సూచిస్తున్నాను.

అయితే తెలుగు వికీలో ప్రచురించిన సమాచారం GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక దానిని ఇతరులు వినియోగించుకొనే అవకాశం మెండుగా ఉన్నదని మీరు, మీ సమీక్షకులు తప్పక గమనించగలరు.

వందనములతో

కాజ సుధాకరబాబు

జవాబు

సుధాకర్ గారు,

వీలైనంత త్వరలో వీటిపై మా అభిప్రాయాలు తెలియజేస్తాం!

పుస్తకం.నెట్

చదువు

[మార్చు]
అభ్యర్ధన

దుప్పల రవికుమార్ గారికి

నమస్కారములు. http://chaduvu.wordpress.com/ సైటు నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు.

నేను తెలుగు వికీపీడియాలో పని చేస్తుంటాను. http://te.wikipedia.org ఒకమారు చూడగలరు.

మీ బ్లాగులో ప్రచురించే అనేక సమీక్షలు కొద్ది మార్పులతో వికీపీడియాలో వ్యాసాలుగా కూర్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నాను. అనేక పుస్తకాల గురించిన వ్యాసాలు వికీపీడియాలో కూడా ఉంటే అందరూ పుస్తకాల గురించి తెలుసుకోవాలనే మీ ఆశయం మరింత ఫలించే అవకాశం ఉన్నదని మనవి చేస్తూ మిమ్ములను క్రింది సహాయం మరియు అనుమతులు కోరుతున్నాను.


(1) మీ సమీక్షలను కొన్ని మార్పులతో తెలుగు వికీలోకి కాపీ చేయడానికి అనుమతించగలరా? అవి ఫలాని వెబ్‌సైటు నుండి తీసుకోబడినవని తప్పక వ్రాస్తాము.

(2) ఇంతకంటే మంచి పద్ధతి- మీరే స్వయంగా తెలుగు వికీలో సభ్యత్వం తీసుకొని ఆయా పుస్తకాలను గురించి మరింత సమాచారాన్ని వ్రాస్తే బాగుంటుంది.

అయితే తెలుగు వికీలో ప్రచురించిన సమాచారం GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక దానిని ఇతరులు స్వేచ్ఛగా వినియోగించుకొనే అవకాశం మెండుగా ఉన్నదని తప్పక గమనించగలరు.

వందనములతో

కాజ సుధాకరబాబు

జవాబు

సుధాకర్ గారికి నమస్తే.

పుస్తక పరిచయ వ్యాసానికి కామెంట్ వస్తేనే పొంగిపోయే నేను..., తెవికీలో ఈ పరిచయాలను పెడతామంటే వద్దంటానా? అదో పెద్ద సర్టిఫికేట్ గా పరిగణిస్తున్నాను. మీకు నచ్చినట్టు వాటిని తెవికీలో పెట్టడానికి నేను సమ్మతిస్తున్నాను. అంతేకాక, అక్కడ (తెవికీలో) నేనేమైనా సాయం చేయగలనంటే తప్పక చేస్తాను.

ధన్యవాదాలతో...

-రవికుమార్