వికీపీడియా:వికీమీడియా కామన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీమీడియా కామన్స్ (కామన్స్, వికీకామన్స్ అనికూడా అనవచ్చు) అనేది, ఉచితంగా అందుబాటులో ఉండే బొమ్మలు, ధ్వని మొదలైన మల్టీమీడియా ఫైళ్ళ ఖజానా. ఇది వికీమీడియా ఫౌండేషను యొక్క ప్రాజెక్టు. ఈ ఖజానాలో ఉన్న ఫైళ్ళను ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా (వికీపీడియా, వికీబుక్స్.. మొదలైనవి) స్థానికంగా మళ్ళీ అప్‌లోడు చేసుకోకుండానే సరాసరి వాడుకోవచ్చు.


ఈ ప్రాజెక్టు 2004 సెప్టెంబర్ 7 న ప్రారంభమైంది. ఒకే ఫైలును వివిధ ప్రాజెక్టుల్లో వాడేటపుడు ప్రతీ ప్రాజెక్టులోకీ ఆ ఫైలును అప్‌లోడు చేసే డూప్లికేషనును నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన సాంకేతికమైన పని 2004 అక్టోబర్‌కు పూర్తయింది. [1]

స్థానికంగా అప్‌లోడులు చేసుకునే సౌకర్యం ఇంకా ఉంది. అయితే అది కామన్స్ విధానాల ప్రకారం అనుమతింపబడనివి, స్థానిక ప్రాజెక్టుల విధానాలకు అనుగుణమైన వాటికే వాడాలి. ఉదాహరణకు ఫెయిర్ యూస్ విధానం.

మీడియా ఫైళ్ళను వ్యాసాల్లో ఇముడ్చడం[మార్చు]

తెలుగు వికీపీడియాలోకి అప్‌లోడు చేసిన బొమ్మను వ్యాసంలో ఇముడ్చేందుకు ఎలా చేస్తామో వికీమీడియా కామన్స్ లోని బొమ్మను కూడా అదే విధంగా చెయ్యడమే.

వ్యాసంలో మీరు రాసిన పేరుతో బొమ్మ తెలుగు వికీపీడియాలో ఉంటే దాన్ని చూపిస్తుంది. లేదంటే కామన్స్ లో ఉన్న బొమ్మను చూపిస్తుంది. బొమ్మను పేజీలో ఇముడ్చేందుకు కింది లింకును వాడాలి:

[[బొమ్మ:file.jpg]] or [[బొమ్మ:file.png|alt text]]

file అంటే ఫైలు పేరు.