వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25
స్వరూపం
వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.
సభ్యనామం రాయడం
సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం
తేదీ, సమయం మాత్రమే రాయడం
సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -
3 సార్లు నొక్కితే - సభ్యనామం
4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం
5 సార్లు నొక్కితే - తేదీ, సమయం
చూపబడతాయి.