వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 2
Jump to navigation
Jump to search
మీ వీలును బట్టే వికీలో కృషి చేయండి
వికీపీడియా ఒక స్వేచ్చా విజ్ఞాన సర్వస్వమని మీకందరికీ తెలిసిందే. ఇదే స్వేచ్చ వికీపీడియా కోసం పని చేసే సభ్యులకూ వర్తిస్తుంది. వికీ సభ్యులు తమకు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన సమయాల్లో, ఇష్టం వచ్చిన వ్యాసాలలో మార్పులు చేయవచ్చు. ఒక వేళ వికీ సభ్యులు తాము తగినంత సమయం కేటాయించలేక పోతే అందుకు సదరు సభ్యులు బాధ పడనక్కర లేదు. ఇతర సభ్యులు అందుకు ఆక్షేపించడం కూడా సరియైన పద్దతి కాదు. అది నిర్వాహకుల విషయంలో నైనా సరే. ఎవరికైనా వాళ్ళ స్వంత పనులు, అభిరుచులు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని గౌరవించడం ఉత్తమం.