వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 3
స్వరూపం
వ్యాసాలను ఆయా విషయాల ప్రకారం వర్గీకరిస్తున్నాము కదా? మళ్ళీ ఈ జాబితాలెందుకు? జాబితాల వలన కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి.
- సమాచారం
- సమాచారాన్ని అందించడానికి జాబితాలు ఒక పటిష్టమైన విధానం. జాబితాలను విషయానుగుణంగా విభాగాలుగా కూర్చవచ్చును - "కాలం" లేదా "అకారాది క్రమం" లేదా "ప్రాముఖ్యత" లేదా "వర్గీకరణ". ఉదాహరణకు చూడండి దేశాల జాబితాల జాబితా, తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా
- దిక్సూచి
- ప్రత్యేకంగా పరిశోధన చేయనక్కర లేకుండా ఒక విషయానికి సంబంధించి వివిధ వ్యాసాలను జాబితా పేజీ ద్వారా తేలికగా చేరుకోవచ్చును. ఉదాహరణకు భారతదేశ జిల్లాల జాబితా
- వ్యాసాల అభివృద్ధికి ప్రణాళిక
- ఇప్పటికే ఉన్న వ్యాసాలు, ఇంకా అవుసరమైన వ్యాసాలు ఈ జాబితాలో కూర్చడం ద్వారా ఒక విషయంపై వికీని అభివృద్ధి చేయవచ్చును. ఉదాహరణకు ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
- అదనపు సమాచారం
- జాబితాలో కేవలం వ్యాసాల పేర్లు మాత్రమే కాకుండా ఆ వ్యాసాలకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా ఇవ్వవచ్చును. ఉదాహరణకు నవవిధ భక్తులు, భూకంపాల జాబితా