వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 9
Jump to navigation
Jump to search
వికీపీడియాలో వెతకడం
వికీపీడియాలో ఏదైనా విషయం గురించి వెతకాలంటే ఎడమచేతివైపున్న వెతుకు పెట్టెలో వ్రాసి వెళ్ళు నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఆ పేరుతో వికీపీడియాలో వ్యాసం ఉండి ఉంటే ఆ పేజీకి నేరుగా చేరుకుంటారు, లేకపోతే ఆ విషయానికి సంబంధించిన వ్యాసాలు చూపించబడతాయి. వెతుకు నొక్కితే ఇంకా కొద్దిగా సవివరమైన ఫలితాలు పొందవచ్చు. ఇంకా మీకు కావలసిన విషయం దొరకకపోతే వెతుకు పేజీలో ఉన్న డ్రాప్‌డౌన్ మెనూలో గూగుల్, యాహూ, విండోస్ లైవ్ మరియు వికీవిక్స్ సెర్చ్ ఇంజన్లకు లింకులు ఉన్నాయి. వాటి ద్వారా వెతికితే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.