వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 12
Jump to navigation
Jump to search
వీర తాళ్ళకు వికీ సరైన క్షేత్రం కాదు
క్రొత్త పదాలు కనిపట్టినవారికి మాయాబజార్ సినిమాలో "వీరతాళ్ళు" ఇచ్చారు. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి క్రొత్త పదాలు సృష్టించడం, క్రొత్త పదాల సృష్టిని ప్రోత్సహించడం - ఈ రెండు పనులపై చాలమంది ఉత్సాహం చూపుతారు.
మీ చొరవకు అభినందనలు. భాష అభివృద్ధికి క్రొత్త పదాలు మొలకెత్తాల్సిందే. కాని వికీపీడియా అందుకు పదునైన క్షేత్రం కాదు. అరుదుగా వాడే పద ప్రయోగాలూ, క్రొత్తగా పుట్టించిన పద ప్రయోగాలూ వికీపీడియాకు అనువైనవి కావు. వీలయినంతవరకు ప్రామాణిక పదాలను వాడండి.
తెలుగు భాషలో పారిభాషిక పదజాలం ప్రాచుర్యం పొందనందున ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవచ్చును గాక.