Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 3

వికీపీడియా నుండి
వ్యాస పరిచయం

వ్యాస పరిచయం ప్రతీ వ్యాసానికి ఎంతో ముఖ్యమైన భాగం. ఇది సాధారణంగా వ్యాసంలో వచ్చే మొట్టమొదటి శీర్షిక పైన ఉంటుంది.

ఒక వ్యాసాన్ని వికీటెక్స్ట్ ఎడిటర్ లో చూసినప్పుడు మనకు అందులో శీర్షికలు ఈ విధంగా కనపడతాయి:

== ఇది ఒక శీర్షిక ==

వ్యాసం యొక్క పొడవు బట్టి వ్యాస-పరిచయం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ ఒక్క భాగాన్ని చదివితే వ్యాసం మొత్తంపై ఒక అవగాహన ఏర్పడాలి. సాధారణంగా వ్యాసాన్ని పరిచయం చేస్తున్నప్పుడు వ్యాసానికి బాగానప్పే ఒక బొమ్మను చేర్చడం చాలా మంచి ఉపాయం. బొమ్మను వ్యాస-పరిచయం కంటే ముందుగా పెడతారు. దానిని [[బొమ్మ:బొమ్మ పేరు.jpg|thumb|బొమ్మ గురించి]] అని చేరుస్తారు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా