వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దారి మార్పుకి దారి మార్పులు

దారి మార్పు పేజీ అంటే ఒక పేరుతో వ్యాసం కోసం వెతికినపుడు, మరో వ్యాసానికి దారి మళ్ళించడం. ఉదాహరణకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే పేరుతో వ్యాసం ఉందనుకుందాం. మహాత్మా గాంధీ, గాంధీ లాంటి పేజీలకు దారి మార్పులు తయారు చెయ్యవచ్చు. అలా చెయ్యాలంటే సదరు పేజీల్లో #REDIRECT [[మోహన్ దాస్ కరంచంద్ గాంధీ]] అని చేరిస్తే సరి.

అయితే ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఉంది. మహాత్మా గాంధీ, మరియు గాంధీ పేజీల రెండింటిలో #REDIRECT [[మోహన్ దాస్ కరంచంద్ గాంధీ]] అని చేర్చాలి. ఉదాహరణకు మహాత్మా గాంధీ అనే పేజీ లో #REDIRECT [[మోహన్ దాస్ కరంచంద్ గాంధీ]] అని చేర్చి, గాంధీ లో #REDIRECT [[మహాత్మా గాంధీ]] అని చేరిస్తే అది దారిమార్పుకు దారి మార్పు అవుతుంది. ఇలా ఉండటం వలన సందర్శకులు చేరవలసిన వ్యాసాన్ని చేరడానికి కష్టమౌతుంది. కాబట్టి వీటిని సాధ్యమైనంతవరకు దొర్లకుండా చూసుకోవాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా