Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 7

వికీపీడియా నుండి
వికీపీడియాను ఎంతవరకూ నమ్మొచ్చు?

తెలుగు వికీపీడియా రోజురోజుకీ మెరుగవుతుంది. కానీ...

...ఇక్కడ ఎవరయినా ఏ వ్యాసానయినా మార్చవచ్చు, కాబట్టి వారి వారి సొంత అభిప్రాయాలతో అన్ని వ్యాసాలూ నిండిపోయే ప్రమాదం ఉంది, లేదా వ్యాసాలలో ఉన్న సమాచారం బాగా పాతబడిపోయి ఉండవచ్చు, లేదా వ్యాసంమొత్తం పూర్తిగా తప్పుడు సమాచారంతో నిండిపోయు ఉండవచ్చు. ఇవన్నిటినీ నిరోధించటానికి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని వాడుకునే ముందు నమ్మకమైన మూలాలతో ఇక్కడ ఉన్న సమాచారాన్ని పరిశీలించాలి.

ఇక్కడ వ్యాసాలను మార్చేవారితో పాటుగా బోలెడంతమంది చదువుతూ ఉండేవాళ్లు ఉంటారు, వారితో పాటుగా ఎవరెవరు ఏయే పేజీలలో మార్పులు చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించే సభ్యులు కూడా ఉంటారు. ఇంకొంతమంది కొన్ని పేజీలను తమ వీక్షణా జాబితాలో చేర్చుకుని మరీ వాటిపై జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా ఎవరయినా తప్పుడు సమాచారాన్ని చేరిస్తే దాన్ని వెంటే సరిదిద్దేవారు కూడా ఉంటారు. కాకపోతే కొత్త కొత్త తప్పులు వ్యాసాలలోకి వస్తూనే ఉంటాయి, కాబట్టి నాణ్యత పెరుగుతుందా అంటే, పెరుగుతుంది అని గట్టిగా చెప్పలేము, అయినా కూడా మీకు ఎక్కడయినా వ్యాసాలలో తప్పులుంటే వాటిని సరిచేస్తూ ఉండండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా