వికీపీడియా:వికీ బడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో క్రియాశీలమైన సభ్యులకు వికీపై, వికీ విధి విధానాలపై ఒక స్థూలమైన దృష్టిని కలుగజేసే ప్రయత్నంలో ప్రారంభించిన పాఠాల శృంఖల ఇది. ఇవి ఇన్‌ఫార్మల్ గా అనుభవాలు పంచుకునే పద్ధతిలో కొనసాగే పాఠాలు. వీలైనంత వరకు పరిశోధన చేసి తయారు చేసినా పాఠాలైనా వీటిలోని సమాచారాన్ని వికీ నియమాలుగాను, పాలసీలుగానూ ఉదహరించకూడదు. సముదాయపు ఆమోదంతో తయారు కాబడిన అధికారిక పద్ధతులు, మార్గదర్శకాలకు ఇక్కడ చూడండి.

  1. తొలి పాఠం - మూలాలు, ఉదహరింపులు, మూలలను చేర్చే విధానం, వికీలో మూలాలను ఉదహరించడంపై ఉన్న నియమనిబంధనలు, మార్గదర్శకాలు, మూలాల నాణ్యతను బేరీజు వెయ్యటం, బ్లాగులను ఉదహరించడం, సమాచారపు తనిఖీ మొదలుగు అంశాలని అనుకుంటున్నాను. నేను ఈ పాఠానికి కావలసినవి సమకూర్చుకోవటానికి ఒక రెండు వారాలు పడుతుంది.
  2. రెండవ పాఠం - విజ్ఞానసర్వస్వపు రచనాశైలి - వివిధ రచనాశైలులలో ఉన్న వ్యత్యాసాలు (వార్తలు, మేగజిన్లు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ట్రావెల్‌గైడ్స్, స్వీయ చరిత్రలు) డూస్ అండ్ డోంట్స్ (చేయకూడనివి, చేయవలసినవి)
  3. మూడవ పాఠం - వికీపీడియాలోని వివిధ తత్త్వాలు, అభిమతాలు - వాటి పరిశీలన. దైనందిన దిద్దుబాటు క్రమంలో వీటి influence (అన్వయం?)
  4. నాలుగవ పాఠం - వికీపీడియా ఏమిటి, ఏది కాదు, వికీపీడియా యొక్క పరిధి, ఇతర సోదర వికీమీడియా ప్రాజెక్టులతో గల సంబంధం.
  5. ఐదవ పాఠం - వికీ సభ్యుల ప్త్రవర్తనా నియమావళి, ఎలా నడచుకోవాలి, ఎందుకలా నడచుకోవాలి, సభ్యుల మధ్య సంబంధాలు.
  6. ఆరవ పాఠం - బొమ్మలు చేర్చటం, సేకరించడం, కాపీహక్కులు, సముచిత వినియోగం, క్లుప్తంగా సంబంధింత కాపీహక్కుల లైసెన్సులపై చర్చ, కొన్ని కాపీహక్కుల చట్టాలపై చర్చ.
  7. ఏడవ పాఠం - నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు